Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
స్టోన్ మాసనరీ అంటే ఏమిటో ఇప్పుడు మీకు ఒక అవగాహన ఉంది కదా! ఇక మీరు ఖచ్చితంగా నివారించాల్సిన కొన్ని సాధారణ స్టోన్ మాసనరీ తప్పులు కూడా ఇక్కడ తెలియజేస్తున్నాము.
అనేక కారకాలు రాతి యొక్క సహజ మన్నికను ప్రభావితం చేస్తాయి, అయితే రంధ్రాల నిర్మాణం చాలా ముఖ్యమైనది. రంధ్ర నిర్మాణం ముఖ్యం ఎందుకంటే ఇది రాతి ద్వారా ప్రవేశించే మరియు రాతి ద్వారా కదిలే నీటి మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంకా, రాయికి హాని కలిగించే లవణాలు నీటి ద్వారా తీసుకుపోబడతాయి, అవి రంధ్రాలలో పేరుకుపోతాయి. రంధ్రాలు ఎంత స్థలాన్ని ఏర్పరుస్తాయన్నది కాదు, కానీ అవి ఎలా నిర్మించబడ్డాయన్నది చూడాల్సిన ముఖ్యమైన అంశం. తక్కువ సచ్ఛిద్రత (పొరోసిటీ) కలిగిన రాళ్ళు ఎక్కువ నీరు చొచ్చుకుపోవడానికి అనుమతించవు. అందువలన లవయణీయత మరియు/లేదా మంచు దాడి (ఫ్రాస్ట్ అటాక్)కి తక్కువ అవకాశం ఉంటుంది. తక్కువ సచ్ఛిద్రత కలిగిన రాళ్లు సాధారణంగా మరింత మన్నికగా ఉంటాయి. అధిక సచ్ఛిద్రత కలిగిన రాయి ఎక్కువ నీటిని లోపలికి చొరబడేలా చేస్తుంది, కానీ రంధ్రాలు పెద్దగా ఉంటే, నీరు సాపేక్షంగా త్వరగా ఆవిరైపోతుంది.
అవక్షేపణ (సెడిమెంటేషన్) సమయంలో, సెడిమెంటరీ రాక్స్ ఏర్పడతాయి. ఒక స్టోన్ బ్లాక్ దాని బెడ్డింగ్ ప్లేన్‌కి తప్పుగా ఇన్‌స్టాల్ చేయబడితే, లోపాలు సంభవించవచ్చు.
గోడలో ఇన్‌స్టాల్ చేయబడుతున్నపుడు రాయిని దాని నేచురల్ బెడ్డింగ్ పొజిషన్ లో ఉంచాలి. అంటే దీనర్థం, రాయి దాని సహజమైన నిర్మాణం ఏ విధంగా ఉందో, అదే తీరులో లేయర్స్‌ని అడ్డంగా నడపాలి, ఆ విధంగా రాయి దాని పొజిషన్ లో బలంగా ఉంటుంది, లోపాలకు తక్కువ అవకాశం ఉంటుంది. రాయి నిలువుగా పేర్చబడినట్లయితే, సాల్ట్ క్రిష్టలైజేషన్ లేదా ఫ్రాస్ట్ యాక్షన్ వల్ల నష్టం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రక్కనే ఉన్న రాళ్ల నుండి ఎటువంటి నియంత్రణ లేనందున బెడ్డింగ్ లేయర్స్‌ని నెట్టడం చాలా సులభం.
సాల్ట్స్ వివిధ మార్గాల్లో సమస్యలను కలిగిస్తాయి, అవి వివిధ మౌలిక పదార్థాల నుండి వస్తాయి. కాంక్రీటు, ఇటుక మోర్టార్, నేల, గాలి మౌలిక పదార్థాలు. ఉప్పు ఆరిపోయినప్పుడు ఉపరితలం మీద లేదా రాయి లోపల జమ చేయబడుతుంది. రంధ్రాల లోపల స్ఫటికీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది తరచుగా నష్టాన్ని కలిగిస్తుంది. రాయి రకం, ఉప్పు రకం, రంధ్రాల లక్షణాలు - ప్రత్యేకించి వాటి పరిమాణం, అమరిక - ఇవన్నీ నష్ట సంభావ్యతనీ, పరిధినీ ప్రభావితం చేస్తాయి. మీరు తీరానికి సమీపంలో నివసిస్తున్నట్లయితే సముద్రపు లవణాలు మరియు సాపేక్ష ఆర్ద్రతకి సంబంధించిన అధిక శక్తి కలయిక కారణంగా సాల్ట్ స్ఫటికీకరణ ప్రమాదం పెరుగుతుంది.
స్టోన్ మాసనరీ నిర్మాణంలో, లైమ్ రన్-ఆఫ్, లైమ్ స్టెయినింగ్ అని కూడా పిలుస్తారు, ఇది సిమెంట్ ద్వారా అదనపు నీరు ప్రవహించినప్పుడు సంభవించే ఒక లక్షణం. సున్నపురాయిలో ఆమ్ల వర్షం, కాల్షియం కార్బోనేట్ ల మధ్య ప్రతిచర్య ఫలితంగా, ఇతర మెటీరియల్స్ లో కరిగే లవణాలు అభివృద్ధి చెందుతాయి. కరిగే లవణాలు ఏర్పడినప్పుడల్లా, అవి సున్నపురాయి కోపింగ్స్‌ని తొలగిస్తాయి మరియు ఇటుకలు లేదా శాండ్ స్టోన్ మీద స్థిరపడతాయి. ఈ లవణాలు క్రిష్టలైజ్ అయినప్పుడు, అవి వేరే ఏ విధంగానూ క్షీణించని మెటీరియల్స్‌ని క్షీణించేలా చేస్తాయి.
స్టోన్ మాసనరీ నిర్మాణంలో, లైమ్ రన్-ఆఫ్, లైమ్ స్టెయినింగ్ అని కూడా పిలుస్తారు, ఇది సిమెంట్ ద్వారా అదనపు నీరు ప్రవహించినప్పుడు సంభవించే ఒక లక్షణం. సున్నపురాయిలో ఆమ్ల వర్షం, కాల్షియం కార్బోనేట్ ల మధ్య ప్రతిచర్య ఫలితంగా, ఇతర మెటీరియల్స్ లో కరిగే లవణాలు అభివృద్ధి చెందుతాయి. కరిగే లవణాలు ఏర్పడినప్పుడల్లా, అవి సున్నపురాయి కోపింగ్స్‌ని తొలగిస్తాయి మరియు ఇటుకలు లేదా శాండ్ స్టోన్ మీద స్థిరపడతాయి. ఈ లవణాలు క్రిష్టలైజ్ అయినప్పుడు, అవి వేరే ఏ విధంగానూ క్షీణించని మెటీరియల్స్‌ని క్షీణించేలా చేస్తాయి.
బాగా తడిగానూ, గడ్డకట్టే అవకాశం ఉన్న ప్రాంతాలలోనూ మంచు (ఫ్రాస్ట్) సమస్య ఎక్కువగా ఉంటుంది. షెల్టర్డ్ ప్లెయిన్ వాల్స్ విషయంలో, డ్యాంప్-ప్రూఫ్ కోర్సు దిగువన మినహా మంచు నష్టం చాలా అరుదుగా సంభవిస్తుంది. అటాక్ ప్రోసెస్ అదే విధంగా ఉన్నా, బ్రిక్ వర్క్ లాగానే ఒక భవనానికి సంబంధించిన పోరస్ స్ట్రక్చర్, ఫ్రాస్ట్ అటాక్‌ని ఎలా తీసుకోవాలనే విధానాన్ని నిర్ణయిస్తుంది.
రాతి కట్టడం నిర్మాణంలో ప్రత్యేకించి రాయి, కోపింగ్‌లు లేదా పారాపెట్‌లు వంటి దెబ్బతినడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో ఉంటే ఈ పొరపాటు పెద్ద రాతి భాగాలను తొలగించగలదు.
ఇసుకరాళ్ళు కాంటూర్ స్కేలింగ్‌ని ప్రదర్శిస్తాయి, ఇది రంధ్రాలను నిరోధించే కాల్షియం సల్ఫేట్ వల్ల సంభవిస్తుందని భావిస్తున్నారు. రాయి, సున్నపు ఇసుకరాయి కానప్పుడు కూడా ఇది సంభవిస్తుంది. ఫలితంగా, రాతి ముఖం నుండి మందపాటి తుప్పు పొర వేరు పడుతుంది.
శతాబ్దాలుగా, ఇనుము స్టీల్ క్రాంప్స్, స్టోన్‌వర్క్ ఫిక్సింగ్ పరికరాలుగా ఉపయోగించబడుతున్నాయి. అయినప్పటికీ, తుప్పు ఈ మెటల్ ఫిక్సింగ్స్ తో రాయిలోకి విస్తరించవచ్చు మరియు విరగగొట్టవచ్చు. ఇంకా, స్టోన్ కేవిటీ వాల్స్, కేవిటీ వాల్ టై ద్వారా ప్రభావితం కావచ్చు.
లోపలి పగుళ్లకు కారణమయ్యే పేలుడు మెటీరియల్స్ తో రాళ్లను వెలికితీస్తే క్వారీలోని రాళ్లకు హాని కలుగుతుంది. రాతి ఉపరితలం మీద మితిమీరిన టూలింగ్ కూడా నష్టాన్ని కలిగిస్తుంది.
1. పొడవైన దీర్ఘచతురస్రాకార రాళ్లను ఉపయోగించడం గోడల్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
2. మీ గోడల లోపలి మరియు బాహ్య భాగాలు అదే సమయంలో నిర్మించబడాలి.
3. రాతి సైజు ఆధారంగా జాయింట్ మందం 2-2.5 సెం.మీ మధ్య ఉండాలి మరియు 1 సెం.మీ కంటే తక్కువగా ఉండకూడదు.
4. కాంక్రీట్ మిశ్రమానికి సరైన సిమెంట్‌కి సరిపడా నీటి నిష్పత్తిని ఉపయోగించాలనీ, దానిని కలిపిన 30 నిమిషాలలోపు ఉపయోగించాలనీ గుర్తుంచుకోండి.
5. చిన్న రాళ్లను ఖాళీలను పూరించడానికీ, గోడకి సరైన ఆకారాన్ని ఇవ్వడానికీ ఉపయోగిస్తారు.
6. రాళ్లు గోడ నుండి ముందుకు పొడుచుకు రాకూడదు, కాంక్రీటు మిశ్రమంతో సరైన స్థానంలో సెట్ అవాలి.
7. గోడలు కనీసం 7 రోజులపాటు క్యూరింగ్ చేయాలి.
నిర్మాణ సమయంలో రాళ్లను ఉపయోగించడం వల్ల మీ భవనం బలంగా ఉంటుంది, దీర్ఘకాల మన్నిక కలిగి ఉంటుంది. రాయి దాదాపు 104.9 MPa సగటు సంపీడన బలాన్ని (కంప్రెసివ్ స్ట్రెంగ్త్) కలిగి ఉండడం వల్ల ఇతర మెటీరియల్ కంటే ఇది మెరుగైన ఎంపిక అవుతుంది. ఒక రాతి కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటే అది చూర్ణం కాకుండా లేదా పగుళ్లు లేకుండా తట్టుకోగల కేవల గరిష్ట లోడ్. మాసనరీ బలం కూడా మోర్టార్ బలం ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతుంది.
ఇది స్టోన్ మాసనరీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి. ఏడాది పొడవునా, భవనాలు వివిధ రకాల వాతావరణాలకు లోబడి ఉంటాయి. వర్షం, వడగళ్ళు, మంచు వంటి వాతావరణ అంశాల వల్ల కలిగే ఎలాంటి ప్రభావానికైనా తట్టుకుని నిలబడే సామర్ధ్యం రాతి కట్టడానికి ఉంది. వర్షం వచ్చినప్పుడు, రాయి నీటిని పీల్చుకోదు, కాబట్టి తేమ వల్ల భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉండవు.
స్టోన్ మాసనరీ ఇతర నిర్మాణ పద్ధతుల కంటే గణనీయమైన ప్రయోజనాన్ని కలిగి ఉంది, ఎందుకంటే రాయి చాలా విధాలైన అరుగుదలని తట్టుకోగలదు. ఫర్నీచర్ ని కదపడం వల్ల అవి గోడలకి తగిలి సొట్టలు పడేలా చేయవచ్చు, అది సాధారణ అరుగుదలకి కారణం కావచ్చు. అలాంటి ఇబ్బందులు రాతినిర్మాణంలో ఉండవు. ఇది వంగడం, చుట్టడం, చీలిపోవడం, స్ప్లింటరింగ్, సొట్టలు పడడం, ఉబ్బడం వంటికి కూడా నిరోధకతను కలిగి ఉంటుంది, ఇవన్నీ దీని మన్నికకు దోహదం చేస్తాయి.
ప్లాస్టరింగ్ కలర్ వాషింగ్ అవసరమయ్యే బ్రిక్ మాసనరీతో పోలిస్తే, స్టోన్ మాసనరీ తో నిర్మించిన భవనాలకు వాటి మన్నిక కారణంగా చాలా తక్కువ మెయింటెనెన్స్ సరిపోతుంది.
స్టోన్ మాసనరీ అంటే ఏమిటి, మీరు నివారించగల సాధారణ స్టోన్ మాసనరీ తప్పుల గురించి మీరు తెలుసుకోవలసినది ఇదే. సరైన రాళ్లను ఎంచుకోవడం నుండి గట్టి ఫౌండేషన్ వేయడం వరకు, మీరు రాతితో చేసే తాపీ పని గురించి ఆలోచించినప్పుడు మీరు నివారించగల ఎనిమిది పొరబాట్లని గురించి మా గైడ్ తెలియజెప్తుంది, మీ ప్రాజెక్ట్ దీర్ఘకాలం మన్నికనిచ్చేలా నిర్ధారిస్తుంది.