Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
ఫ్లోర్ టైల్స్ కి పెయింట్ వెయ్యడం కష్టంగా అనిపించచ్చు, కానీ సరైన పనిముట్లు ఇంకా సాంకేతికతలతో మీరు ఒక నైపుణ్యంగా కనిపించే ఫలితాన్ని సాధించచ్చు. ఇది మీకు కష్టమైనదిగా అనిపించినా, మీరు దాన్ని సరైన పద్ధతిలో చేసి పరిపూర్ణతని సాధించగలరు. అది ఒక సిరామిక్ ఫ్లోరుకి పెయింట్ వెయ్యాలన్నా లేక సిమెంట్ ఫ్లోరుకు పెయింట్ వెయ్యాలన్నా, పరిపూర్ణ ఫలితం సాధించవచ్చు.
ముందుగా మీరు మీ టైల్స్ కి సరిపడే పెయింటుని ఎంచుకోవాలి. ఇపాక్సీ-బేస్డ్ పెయింట్లు లేదా టైల్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పెయింట్లు వాటి మన్నిక ఇంకా టైల్ ఉపరితలానికి నిబద్ధతకై సిఫారసు చేయబడతాయి. అదనంగా పెయింటుకి టైల్స్ కీ మధ్య ఒక ధ్రుఢమైన బంధం ఏర్పడడానికి ప్రత్యేకంగా టైల్స్ కోసం చేయబడ్డ ప్రైమర్ వాడడాన్ని పరిగణించండి.
ఫ్లోర్ టైల్స్ కి పెయింట్ వేయడం ఆరంభించే ముందు, అన్ని అవసరమైన పనిముట్లు ఇంకా పదార్ధాలని సేకరించడం ఆవశ్యకం. ఇక్కడ స్ఫలవంతంగా ఫ్లోర్ టైల్స్ కి పెయంట్ వెయ్యడం ఆరంభించడానికి ఒక లిస్ట్ ఉంది.
ఫ్లోర్ టైల్స్ ని పెయింట్ చేసేటప్పుడు ఇంకా కాంక్రీట్ ఫ్లోర్లకి ఎలా పెయింట్ వెయ్యాలో నేర్చుకుంటున్నపుడు ఈ స్టెప్పులని అనుసరించండి:
ఒక స్మూత్ పెయింట్ అప్లికేషన్ని నిర్ధారించుకోవడానికి మీ టైల్స్ నుంచి ఏదైనా మురికి లేద చెత్తని తీసేసి సరిగ్గ శుభ్రం చెయ్యండి. ఒక మైల్డ్ డిటర్జెంట్ ఉపయోగిస్తూ ఫ్లోరుని వాక్యూమ్ ఇంకా మాప్ చెయ్యండి, తర్వాత దాన్ని పూర్తిగా ఆరనివ్వండి.
ఒక గరుకు టెక్స్చర్ రావడానికి మీ టైల్సుని లైట్ గా సాండ్ చెయ్యండి, దాంతో పెయింట్ బాగా అంటడానికి సాయమవుతుంది. ఒక తడి బట్టతో ఏదైనా ధూలిని తుడిచెయ్యండి ఇంకా టైల్సుని ఆరనివ్వండి.
ఒక బ్రష్ లేదా రోలర్ని ఉపయోగించి టైల్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ప్రైమర్ ఒక పొరని పూయండి. తయారీదారు సూచనల ప్రకారం ప్రైమర్ని ఆరనివ్వండి.
మీరు పెయింట్ చెయ్యక్కర లఏదనుకునే ఏరియాలని సంరక్షించడానికి పెయింటర్ టేపుని ఉపయోగించండి అంటే మెరిక లైన్లు లేదా పక్క ఉపరితలాలు. పెయింట్ చిందకుండా ఉండడానికి చుట్టుపక్కల ఏరియాని డ్రాప్ బట్టతో లేద ప్లాస్టిక్ షీటింగుతో కప్పండి.
మీరు ఎంచుకున్న టైల్ పెయింటుని మెరుగైన ఫలితల కోసం తయారీదారు సూచనల మేరకు ఒక బ్రష్ లేదా రోలర్ని ఉపయోగించి రాయండి. కావలసిన కవరేజ్ ఇంకా రంగు కోసం మీరు ఎక్కువ కోట్లు వెయ్యాల్సి రావచ్చు.
టైల్స్ మీద నడవడానికి లేదా ఏదైనా ఫర్నిచర్ పెట్టే ముందు తయారీదారు సూచనల మేరకు పెయింటుని పూర్తిగా ఆరనివ్వండి.
గుర్తుంచుకోండి, మీకు ఫ్లోర్ టైల్స్ ఎలా పెట్టాలో నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే, విలువైన మార్గదర్శన ఇంకా అంచెలంచెలుగా సూచనలు ఏక్సెస్ చెయ్యడానికి మా వద్ద ఒక సమాచారపూరిత బ్లాగ్ పోస్ట్ "How to Lay Floor Tiles" ఉంది.
పెయింటింగ్ గ్న్యానాన్ని ఫ్లోర్ టైల్స్ పెట్టే నైపుణ్యంతో జత కలిపి మీరు మీ ప్రదేశాన్ని పరివర్తన చేసి ఇంకా మీ ఇంటికి విలువని చేకూర్చే ఒక అందమైన మరియు కస్టమైజ్డ్ ఫ్లోర్ని స్రుష్టించచ్చు.
మీరు ఫ్లోర్ టైల్స్ కి పెయింట్ వేసే ముందు, ఫ్లోర్ టైల్స్ కి పయింట్ వెయ్యడంలోని ప్రయోజనాలు ఇంకా దుష్ప్రయోజనాలని పరిగణించాలి, అలాగే ఇతర ప్రత్యామ్నాలైన పగిలిన్ టైల్ రిపేరు కూడా.
టైల్స్ ని పెయింట్ చెయ్యడం వాటిని మార్చడం కన్నా గణనీయంగా సరసమైనది.
మీ అలంకరణకి సరిపోలేలా ఒక విస్త్రుత శ్రేణి ఫ్లోర్ పెయింట్ రంగులు ఇంకా ఫినిషెస్ నుంచి ఎంచుకోండి.
సరైన పనిముట్లు ఇంకా టెక్నిక్కులతో టైల్స్ పెయింటింగ్ చాలా మంది ఇంటి యజమానులకి ఒక మానేజ్ చెయ్యగల ప్రాజెక్ట్.
పెయింట్ వేసిన టైల్స్ కొత్త టైల్స్ కన్నా అంత మన్నికగలవి కాకపోవచ్చు, ముఖ్యంగా అధిక ట్రాఫిక్ ఏరియాల్లో లేదా తేమకి గురయ్యే ప్రదేశాల్లో.
సంభావ్య కొనుగోలుదారులు పెయింట్ వేసిన వాటికన్నా ఒరిజినల్ టైల్సునే ఇష్టపడచ్చు, అది మీ ఇంటి రీసేల్ విలువని ప్రభావితం చేయగలదు.
ఫ్లోర్ టైల్స్ ని పెయింట్ చెయ్యడం మీ టైల్స్ ని మార్చే ఝంఝాటం లేకుండా ఉండే ధరకు తగ్గ ప్రతిఫలాన్నిస్తుంది ఇంకా మీ ప్రదేశాన్ని అప్డేట్ చేసే స్రుజనాత్మక పద్ధతి. సరైన పనిముట్లు ఇంకా సాంకేతికతలతో మీరు మీ ఇంటికి ఒక కొత్త జీవాన్నిచ్చే నైపుణ్యంగా కనిపించే ఫలితాన్ని సాధించవచ్చు, అది బాత్రూం టైల్స్ కి పెయింట్ వెయ్యడం దగ్గరనుంచి కిచెన్ ఫ్లోర్ టైల్స్ దాకా. మీ గ్న్యానాన్ని ఇంకా నిపుణతలని మరింత పెంచుకోవడానికి, మేం సిఫారసు చేస్తాం మా సహాయక యుట్యూబ్ వీడియోని టైల్ ఇన్స్టలేషన్ చిట్కాలు ఇంకా అల్ట్రాటెక్ టైల్ ఫిక్సో ని ఎలా ఉపయోగించాలో, సరైన టైలింగ్ కోసం ఒక నిపుణ టైల్ బైండర్.