ఫ్లోర్ టైల్స్ లో పగుళ్లు ఏర్పడటానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. ఫ్లోర్ టైల్స్ పగుళ్లను సమర్థవంతంగా నిరోధించడానికి ఈ కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అత్యంత సాధారణ ప్రమాద కారకాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
1. హార్డ్ ఇంపాక్ట్స్
టైల్ పగుళ్లకు ప్రధాన కారణాలలో ఒకటి హార్డ్ ఇంపాక్ట్స్. టైల్స్ పై భారీ వస్తువులు పడినప్పుడు లేదా టైల్స్ దెబ్బతినే విధంగా ఏవైనా వస్తువులు పడినప్పుడు అవి వెంటనే పగుళ్లు ఏర్పడవచ్చు లేదా కాలక్రమేణా బలహీనపడవచ్చు. టైల్స్ దెబ్బతినకుండా ఉండటానికి టైల్స్ పై ఉన్న ఫర్నిచర్ ని జరిపేటప్పుడూ లేదా ఇతర భారీ వస్తువులను తరలించేటప్పుడూ జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.
2. సరిగా ఇన్స్టాల్ చేయకపోవడం
ఇన్‌స్టలేషన్ పద్ధతులు సరిగా లేకపోయినా టైల్ పగుళ్లకు దారితీయవచ్చు. అడ్హెసివ్ కవరేజ్ సరిపోకపోవడం, గ్రౌటింగ్ సరిగ్గా చేయకపోవడం లేదా తగినంత సబ్‌స్ట్రేట్ తయారీ చేయకపోవడం వంటివి సాధారణ ఇన్‌స్టలేషన్ లో జరిగే పొరబాట్లు. వీటి ఫలితంగా పగుళ్లు ఏర్పడవచ్చు. అటువంటి సమస్యలను నివారించడానికి సరైన ఇన్‌స్టలేషన్ పద్ధతులను అనుసరించే ప్రొఫెషనల్ టైల్ ఇన్‌స్టాలర్‌ను నియమించుకోవడం చాలా ముఖ్యం.
3. చాలా ఎక్కువ బరువును మోయడం
టైల్స్ పై అధిక బరువు లేదా ఒత్తిడి వల్ల, అందునా ముఖ్యంగా స్ట్రక్చరల్ సపోర్టు సరిపోని ప్రాంతాల్లో, పగుళ్లు ఏర్పడతాయి. భారీ వస్తువులను టైల్స్ పై నేరుగా ఉంచినప్పుడు లేదా కొన్ని ప్రత్యేక స్పాట్స్ పై బాగా బలమైన బరువులు పడినప్పుడు ఇలా జరుగుతుంది. మీ టైల్స్ పై భాగాలపై బరువు సరిగా పంపిణీ అయేలా చూడాలనే విషయం గుర్తుంచుకోండి. పగుళ్లను నివారించడానికి సరైన సపోర్టుని ఉపయోగించండి.
4. క్రాక్డ్ సబ్‌స్ట్రేట్
టైల్ మన్నికలో సబ్‌ఫ్లోర్ లేదా అంతర్లీన ఉపరితలం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సబ్‌ఫ్లోర్ దెబ్బతిన్నా, పగుళ్లు ఏర్పడినా లేదా ఎగుడు దిగుడుగా ఉన్నా, అది పై టైల్స్ పై ఒత్తిడిని కలిగించి పగుళ్లకు దారి తీస్తుంది. టైల్ ఇన్‌స్టలేషన్‌కు ముందు సబ్‌స్ట్రేట్ మంచి స్థితిలో ఉండేలా చూసుకోండి. ఏవైనా నిర్మాణ సమస్యలను వెంటనే పరిష్కరించండి.
5. కంట్రోల్ జాయింట్స్ టైలింగ్ ఓవర్
బిల్డింగ్ మెటీరియల్స్ సహజమైన కదలికలు, విస్తరణ కోసం కంట్రోల్ జాయింట్లు లేదా ఎక్స్పాన్షన్ జాయింట్లు రూపొందించబడ్డాయి. టైల్ వేసేటప్పుడు ఈ జాయింట్లని వదిలేస్తే ఫ్లోరింగ్ కదలికలని నిర్బంధించడం అవుతుంది. అది టైల్స్ పై ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా పగుళ్లు, టైల్ పాపింగ్ జరుగుతుంది. కంట్రోల్ జాయింట్లని జాగ్రత్తగా పట్టించుకోండి. సంకోచ వ్యాకోచాల కోసం సరైన టైలింగ్ పద్ధతులను అనుసరించండి.