స్కిర్టింగ్ టైల్స్ డిజైన్ కోసం సరైన రంగును ఎంచుకోవాలి, ఎందుకంటే గదికి ఉండాల్సిన మానసిక స్థితిని అదే నిర్ధారిస్తుంది, చూడడానికి ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికీ అది సహకరిస్తుంది.
1. న్యూట్రల్ టోన్స్: తెలుపు, లేత గోధుమరంగు, గ్రే కలర్, ఇవి ఇప్పటి రోజుల్లో ఎంచుకోవలసిన ఎంపికలు. ఇవి ఖాళీ జాగాల్ని విశాలంగానూ, కాంతివంతంగానూ కనిపించేలా చేయడంలో సహాయపడతాయి. వాల్ కలర్స్ వైవిధ్యభరితంగా విస్తృత శ్రేణిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.
2. బోల్డ్ షేడ్స్: నలుపు లేదా శక్తివంతమైన రంగుల స్కిర్టింగ్ టైల్స్, ముఖ్యంగా ఆధునిక లేదా మినిమలిస్ట్ ప్రదేశాలలో ఒక అద్భుతమైన కాంట్రాస్ట్‌ను సృష్టించగలవు. ఈ ఎంపిక, గది డిజైన్ కు ప్రాధాన్యతనిస్తుంది. ఆ ప్రదేశంలో వ్యక్తిత్వాన్ని మరింత మెరుగ్గా చేస్తుంది.
3. గోడ రంగుతో సరిపోలడం: నిరంతరం ఒక ఆత్మీయ బంధం అలరారే విధంగా గోడలకి ఉన్న రంగులోనే స్కిర్టింగ్ టైల్స్ అమరిస్తే చూడడానికి అది గది ఎత్తును మరింత విశాలం చేస్తుంది. ఇది మరింత విశాలంగానూ సొగసైనదిగానూ కనిపిస్తుంది.
4. కాంప్లిమెంటరీ రంగులు: గోడల కంటే తేలికైన లేదా ముదురు రంగులో ఉండే స్కిర్టింగ్ టైల్స్ ని ఎంచుకోవడం వలన స్థలాన్ని సూక్ష్మంగా నిర్వచించవచ్చు, గది సౌందర్యానికి ఎక్కువ డెప్త్ ని జోడించవచ్చు.