Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


బెడ్ రూమ్ కి 7 సరళమైన వాస్తు చిట్కాలు

పడకగది అనేది ఇంట్లో ఒక వ్యక్తికి సురక్షితమైన స్వర్గధామం, వారు తమ ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఆనందిస్తారు. విశ్రాంతికీ, హాయిగా కాలక్షేపం చేయడానికీ ఉద్దేశించిన స్థలం ఎవరికైనా చాలా వ్యక్తిగతమైనదీ, ప్రత్యేకమైనదీ. అక్కడ సానుకూలమైన, శాంతియుతమైన వాతావరణం ఉండేలా చూడడమనేది సరైన శక్తుల రేడియేషన్‌కి చాలా అవసరం.

Share:




వాస్తు శాస్త్రం ప్రకారం మీ పడకగదిని నిర్మించడంలోని ప్రాముఖ్యత

 

ప్రజలు తమ ఇళ్లను కట్టుకునే సమయంలో తమకి నచ్చిన విధంగా కట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. రోజంతా అలసిపోయి వచ్చి విశ్రాంతి తీసుకునేవాళ్లు ఎంత హాయిగా ఉంటారో సరైన వాస్తు ఉన్న ఒక పడకగది నిర్ణయిస్తుంది. అంతే కాదు, మన బెడ్‌రూమ్‌లు మనకు ప్రపంచానికి దూరంగా ఉండడానికి మనకు కావలసిన చోటుని అందిస్తాయి. ఇక్కడ మనం పని చేయడం, రాయడం, మా అభిరుచులలో మునిగిపోవడం మొదలైన అనేక పనులను కూడా చేయవచ్చు. పడకగదికి సరైన వాస్తు శాస్త్రం ముఖ్యమైనది. గదిలో ఉండే శక్తిలో మాత్రమే కాకుండా మన ఆరోగ్యం, సంపద, విజయానికి కూడా అది కారకమవుతుంది.


వాస్తు ప్రకారం మాస్టర్ బెడ్‌రూమ్

 

దిశ: మాస్టర్ బెడ్‌రూమ్ వాస్తు చిట్కాల ప్రకారం, బెడ్‌రూమ్ నైరుతి దిశలో ఉండాలని సిఫార్సు చేయబడింది.

 

ప్రధాన ద్వారం స్థానం: మాస్టర్ బెడ్‌రూమ్ వాస్తు మార్గదర్శకాల ప్రకారం బెడ్‌రూమ్ డోర్ 90 డిగ్రీల వద్ద తెరుచుకోవాలి. తెరుచుకునేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు ఎటువంటి శబ్దం చేయకూడదు. అది తూర్పు, పడమర లేదా ఉత్తరం దిశలో ఉండాలి.

 

మంచం ఉండే చోటు: మాస్టర్ బెడ్‌రూమ్ వాస్తు చిట్కాల ప్రకారం వాస్తు సూత్రాలు మంచాన్ని దక్షిణం లేదా పడమర దిశలో వేయాలని సిఫార్సు చేస్తున్నాయి. తద్వారా కాళ్లు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంటాయి. ఇది ఒక మూలలో కాకుండా గది మధ్యలో ఉండాలి.

 

రంగు: మాస్టర్ బెడ్‌రూమ్ వాస్తు మార్గదర్శకాల ప్రకారం మాస్టర్ బెడ్‌రూమ్‌కు అనువైన రంగులు బూడిద, ఆకుపచ్చ, గులాబీ, నీలం, ఏనుగు దంతం లేదా లేత రంగు

 

వార్డ్ రోబ్ ప్లేస్‌మెంట్: మాస్టర్ బెడ్‌రూమ్ వాస్తు చిట్కాల ప్రకారం ఈ దిశలు సానుకూల శక్తిని ప్రసరింపజేస్తాయి కాబట్టి వార్డ్ రోబ్‌ను పడమర, నైరుతి లేదా దక్షిణ దిశలో ఉంచాలి.

 

అలంకరణ: ప్రకృతి దృశ్యాలు లేదా సముద్రం నిర్మలమైన పెయింటింగ్స్ తో గోడను అలంకరించాలని సిఫార్సు చేయబడింది మరియు మాస్టర్ బెడ్‌రూమ్ వాస్తు మార్గదర్శకాల ప్రకారం హింసను వర్ణించే ఏవైనా పెయింటింగ్‌లను నివారించాలి.


బెడ్ రూమ్ కోసం సింపుల్ వాస్తు చిట్కాలు


పడకగది దిశ

 

  • వాస్తు ప్రకారం పడకగదికి అనువైన దిశ ఉత్తర దిశ, ఇది కెరీర్ సంబంధిత విజయాన్ని తెస్తుందని చెప్పబడింది.
  • పడకగదికి వాస్తు చిట్కాల ప్రకారం సంపదను ఆహ్వానిస్తున్నందున పడకగదికి పశ్చిమ దిశ కూడా మంచి దిశ.
  • ఇంటి మధ్యలో, ఈశాన్య మరియు ఆగ్నేయ దిశలలో పడకగదిని ఉంచడం మానుకోండి.

వాస్తు ప్రకారం మంచం దిశ, ఆకారం మరియు స్థానం:

 

  • వాస్తు ప్రకారం గదికి నైరుతి దిశలో పడకకు అనువైన దిశ.
  • మంచం చెక్కతో తయారు చేయాలి మరియు అది చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి.
  • మంచం నేరుగా బీమ్ క్రింద ఉంచకూడదు.
  • పడక దిశల కోసం వాస్తు సూచించిన విధంగా బెడ్ గది మధ్యలో ఉండాలి, గోడలకు మరీ దగ్గరగా ఉండకూడదు.

వాస్తు ప్రకారం నిద్ర దిశ:

 

మీరు నిద్రిస్తున్నప్పుడు, మీ తల దక్షిణం లేదా తూర్పు దిశలోనూ, మీ కాళ్ళు ఉత్తరం లేదా పడమర దిశలోనూ ఉండాలని సిఫార్సు చేయబడింది. ఈ విధంగా మీ శరీరం సానుకూల శక్తిని గ్రహిస్తుంది. ఎప్పుడూ ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించకండి.


అద్దాలు, వార్డ్ రోబ్‌లు, డ్రస్సర్లు ఉండే చోటు:

  • మీ వార్డ్ రోబ్‌ని పడకగదికి నైరుతి దిశలో ఉంచాలి, తలుపు ఉత్తరం లేదా తూర్పు దిశలో తెరుచుకునేలా చూసుకోవాలి.
  • ఉత్తరం లేదా తూర్పు దిశలో అద్దం పెట్టాలి. మీరు నిద్ర పోతున్నపుడు మీ ప్రతిబింబం అందులో కనిపించడం మంచిది కాదు. కాబట్టి అద్దం ఎన్నడూ మంచానికి ఎదురుగా ఉండకూడదు.
  • సంపదలకు అధిపతి ఉండేచోటు కాబట్టి విలువైన వస్తువులను ఉత్తరం వైపు పెట్టాలి.
  • చిందరవందరగా ఉన్న గది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి మీ గదిలో ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూసుకోవాలి.
  • డ్రెస్సర్‌ను మంచం పక్కనే ఉంచాలి.

బెడ్ రూమ్ సీలింగ్:

 

  • మానసిక ఒత్తిడి, నిద్రలేమికి దారితీసే ఎగుడు దిగుడు లేదా వాలుగా ఉన్న పైకప్పును రూపొందించడం మానుకోండి.
  • సీలింగ్ ఎత్తు 10-12 అడుగులు ఉండాలని సిఫార్సు చేయబడింది, ఎందుకంటే అవి సానుకూల శక్తి ప్రవహించడానికి తగినంత స్థలాన్ని ఇస్తాయి.
  • ముదురు రంగు పైకప్పులు దురదృష్టాన్నీ, ఆటంకాల్నీ ఆహ్వానిస్తాయి కాబట్టి పైకప్పులు తేలికపాటి ఛాయలతో ఉండాలి.
  • పైకప్పులు షాండిలియర్లు లేదా డిజైన్‌ల వంటి ఏ అలంకరణలోనూ ఉండకూడదు. అవి చక్కగా ఇంటి మధ్యలో దీర్ఘచతురస్రాకారంలో గానీ లేదా చతురస్రాకార నమూనాలో గానీ మూడు లైన్లతో సాదాగా ఉండాలి.

పడకగదిలో బాల్కనీ:

 

  • బాల్కనీని ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఆదర్శంగా నిర్మించాలి.
  • బాల్కనీ గోడలు 90 డిగ్రీల వద్ద కలుసుకోవాలి.
  • బాల్కనీ ఈశాన్య భాగంలో పూల ప్రింట్ లు లేదా వేవీ ప్రింట్లతో తక్కువ బరువు ఉండాలి. ఇది సౌర శక్తి ప్రవాహం సులభంగా జరిగేలా చూస్తుంది. ఇది ఇది గదిని తేజోవంతంగా చేస్తుంది.

పడకగది రంగు:

  • మీ పడకగది రంగు మృదువుగానూ, తేలికైన షేడ్స్ నీ కలిగి ఉండాలి.
  • గదికి అనువైన రంగులు ఆఫ్-వైట్, క్రీమ్, గ్రే, పింక్, బ్లూ.
  • గదిలో ఒక లైట్ ఉండాలి. అది ఆ గదిని చైతన్యవంతంగా, ఉల్లాసభరితంగా చేయాలి. ఒత్తిడి లేని వాతావరణం తీసుకురావాలి. మానసిక స్థితిలో మంచి మార్పును కూడా తీసుకురావాలి.
  • మీ గదిలో డార్క్ షేడ్స్ ఉపయోగించడం మానేయాలి, ఎందుకంటే అవి ప్రతికూల శక్తినీ, వైబ్రేషన్‌నీ తీసుకువస్తాయని చెప్పబడుతోంది.

 

ఇది కూడా చదవండి : మీ ఇంటిని అద్భుతంగా పెయింట్ చేయడానికి చిట్కాలు & ఉపాయాలు





ఇప్పుడు మీ పడకగదికి సరైన వాస్తు గురించి మీకు బాగా తెలుసు కాబట్టి, మీ పవిత్ర స్థలాన్ని సానుకూల నిర్మలమైన ప్రకంపనలతో నింపండి. దానిని మీ నివాసంగా చేసుకోండి.


మీ బెడ్‌రూమ్‌తో పాటు, మీ వాష్‌రూమ్ కూడా మీరు గణనీయమైన సమయాన్ని వెచ్చించే చోటూ, మీ ఆలోచనలు ఎక్కువగా జరిగే చోటూ కూడా అయి ఉంటుంది. సరైన వాస్తుతో నిర్మించడం ద్వారా ఇది ఆహ్లాదకరమైన ప్రదేశం కాగలదని నిర్ధారించుకోండి. వాష్‌రూమ్‌ల కోసం వాస్తు గురించి మరింత చదవండి.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....