Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
ఒక గోడకి ప్లాస్టర్ ఎలా వెయ్యాలో తెలుసుకునే ముందు, మీరు తెలుసుకోవాలి అసలదేంటో. ప్లాస్టరింగ్ అనేది గోడలు, సీలింగులు లేదా పార్టిషన్ల ఉపరితలాలపై ఒక నున్నని, సమాంతరంగా ప్లాస్టర్ అనబడే మిక్స్చర్ని పొరలాగా పూయడం. ఈ మిక్స్చర్లో సాధారణంగా సిమెంట్, ఇసుక ఇంకా నీళ్ళు ఉంటాయి, అయినప్పటికీ పనితనం ఇంకా ప్రదర్శనని పెంచేందుకు అదనపు పదార్ధాలైన సున్నం లేదా జిప్సమ్ కలపవచ్చు. ప్లాస్టరింగ్ యొక్క ప్రాధమిక ఉద్దేశం నిర్మాణ మన్నిక ఇంకా రూపురేఖలు పెంచేదుకు ఒక సురక్షా కోటింగ్ ఇవ్వడం. ప్లాస్టరింగ్ ఒక నున్నని, సమాంతర్ ఉపరితలాన్ని పెయింటింగ్ లేదా ఇతర అలంకరణ ఫినిష్ లు ఇవ్వడానికి కూడా సాయపడుతుంది.
ఇంకో పక్క పేయింటింగ్ అనేది తాపీ నిర్మాణంలో ఇటుకలు లేదా రాళ్ళ మధ్య బయటకొచ్చిన జాయింట్లని ఫినిష్ చేసే ప్రక్రియ. ఈ సాంకేతికతలో జాయింట్లని మోర్టార్ మిక్స్ తో నింపే ప్రక్రియ, ఇది తరచు ప్లాస్టర్ లాగా సిమెంట్, ఇసుక ఇంకా నీళ్ళతో చేయబడుతుంది. నిర్మాణంలో పాయింటింగ ప్రాధమిక ప్రయోజనం నీరు చొరబడకుండా చేసి కట్టడం యొక్క నిర్మాణ సమగ్రతని పెంచడం. ఇది మొత్తం రూపురేఖలకి దోహదం చేస్తుంది, అలా వ్యక్తిగత యూనిట్లని హైలైట్ చేస్తూ గోడలకి ఒక శుభ్రమైన ఇంకా ఫినిష్డ్ రూపునిస్తుంది.
ప్లాస్టరింగ్ ఇంకా పాయింటింగ్ లలో తేడాని అర్ధం చేసుకునే ముందు మనం కొన్ని కీలక తేడాలను తెలుసుకోవాలి
ప్లాస్టరింగ్ మొత్తం ఉపరితలాలకి పూయబడుతుంది, గోడలు ఇంకా సీలింగులని కవర్ చేస్తూ ఒక నున్నని ఇంకా నిలకడ ఫినిష్ ఇస్తుంది. పాయింటింగ్ ఇంకో పక్క నిర్దిష్టంగా ఇటుకలు లేదా రాళ్ళవంటి వ్యక్తిగత యూనిట్లకి పూయబడుతుంది.
ప్లాస్టరింగ్ ప్రాధమికంగా ఒక ఉపరితలం రూపురేఖలని పెంచడంపై ద్రుష్టి పెడుతుంది ఇంకా బయటి మూలకాలనుంచి సురక్షతని ప్రసాదిస్తుంది. ఇది ఒక అలకరణ ఇంకా పనితనపు కోటింగునిస్తుంది.
ప్లాస్టరింగ్ సాధారణంగా సిమెంట్, ఇసుక ఇంకా నీళ్ళ మిక్స్చర్ని ఉపయోగిస్తుంది, అదే పాయింటింగ్ ప్రధానంగా మోర్టారుని ఉపయోగిస్తుంది. నిర్దిష్ట ప్రాజెక్ట్ అవసరాలని బట్టి పదార్ధాల ఎంపిక మారచ్చు.
ప్లాస్టరింగ్ లో తాపీలు, ఫ్లోట్లు ఇంకా ఇతర పనిముట్లు ప్లాస్టర్ని సమానంగా వ్యాపింపచేయడానికి ఇంకా కావలసిన టెక్స్చర్ పొందడానికి ఉపయోగించబడతాయి. పాయింటిం కి యూనిట్ల మధ్య ఖాళీలని సరిగ్గా నింపడానికి ప్రత్యేక పాయింటింగ్ పనిముట్లు అవసరమవుతాయి అంటే పాయింటింగ్ తాపీలు ఇంకా జాయింటర్లు.
ప్లాస్టరింగులో పెద్ద వైశాల్యాలని కవర్ చెయ్యాల్సి ఉంటుంది అంటే గోడలు లేదా సీలింగులు. దీనికి ఒక విశాలమైన అప్లికేషన్ ఇంకా విస్త్రుత ఉపరితల తయారీ అవసరమవుతాయి. పాయింటింగ్ ఇంకో పక్క సాధారణంగా చిన్న సెక్షన్లపై చేయబడుతుంది, ముఖ్యంగా వ్యక్తిగత యూనిట్ల మధ్య కేంద్రీకరిస్తూ.
ప్లాస్టరింగుకి సాధారణంగా ఎక్కువ సమయం అవసరమవుతుంది ఎందుకంటే అందులో పెద్ద ప్రాంతాలు ఉంటాయి. దీనికి అదనపు అంచెలైన ప్లాస్టర్ బోర్డ్ ఇన్స్టలేషన్ ఇంకా బేస్ కోట్ అప్లికేషన్ అవసర పడచ్చు. పాయింటింగ్ ఒక స్థానిక ప్రక్రియ కాబట్టి మమూలుగా త్వరితము ఇంకా బాగా సరసమైనది.
ప్లాస్టరింగ్ గణనీయంగా భవనపు మొత్తం అందానికి దోహదం చేస్తుంది, ఒక నున్నని ఇంకా ఫినిష్డ్ రూపునిస్తుంది. ఇది విభిన్న అలంకరణ ఫినిష్ లని అనుమతిస్తుంది, అంటే టెక్స్చర్డ్ లేదా పాలిష్డ్ ఉపరితలాలు. పాయింటింగ్ పెద్దగా కంటికి కనిపించకపోయినా వ్యక్తిగత యూనిట్లని హైలైట్ చేస్తూ, తాపీపని కట్టడాల గుణం ఇంకా సమ్మోహనాత్మకతని పెంచి శుభ్రమైన, చక్కని జాయింట్లని ఇస్తుంది.
ప్లాస్టరింగుకి కట్టడాన్ని మంచి కండిషన్లో ఉంచడానికి కాలానుగుణ మెయింటెనెన్స్ అవసర పడచ్చు, అంటే తిరిగి పెయింట్ చెయ్యడం లేదా ఖాళీలు పూడ్చడం. పాయింటింగ్ ఒకసారి సరిగ్గా చేస్తే, సాధారణంగా కనిష్ట్ మెయింటెనెన్స్ అవసరమవుతుంది, ఎందుకంటే దాని ప్రాధమిక పని జాయింట్లని సంరక్షించడం ఇంకా తాపీపని యొక్క నిర్మాణ సమగ్రతని మెయింటెయిన్ చెయ్యడం.
ముగింపుగా, నిర్మాణ ప్రక్రియలో ప్లాస్టరింగ్ ఇంకా పాయింటింగ్ రెండూ కీలకమైన పాత్రలు పోషిస్తాయి. అది మీరు ఇంటి యజమానైనా, కాంట్రాక్టర్ లేదా ఆర్కిటెక్ట్ అయినా, మీ నిర్మాణ ప్రాజెక్టులకి విషయపూరిత నిర్ణయాలు తీస్కోవడానికి ప్లాస్టరింగ్ ఇంకా పాయింటింగ్ లలో తేడాలని గుర్తించడం ఆవశ్యకం. మీరు ప్లాస్టరింగ్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఇంకా మీ ఇంటికి దాన్ని సరైన పద్ధతిలో ఎలా చెయ్యాలో ఈ సహాయక వీడియోని చూడండి: మీ ఇంటికి ప్లాస్టర్ చేయడానికి సరైన మార్గం. ఈ వీడియో నైపుణ్య ప్లస్టరింగ్ ఫలితాలని సాధించడానికి విలువైన అంతర్ ద్రుష్టి ఇంకా అంచెలంచెలుగా మార్గదర్శనని ఇస్తుంది.