ఏది మంచి పింగాణీ లేదా సిరామిక్ టైల్ అని నిర్ణయించడం అనేది మీ నిర్దిష్ట అవసరాలు, టైల్స్ వేయదలుచుకున్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఏ రకమైన టైల్స్ అయినా పరిగణించవలసిన కొన్ని ముఖ్య లక్షణాలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి:
1. మన్నిక
పింగాణీ టైల్స్ దళసరిగానూ, మరింత మన్నికైనవిగానూ ఉంటాయి. చిప్స్, గీతలు, తేమకు అధిక నిరోధకతను కలిగి ఉంటాయి. సిరామిక్ టైల్స్, కొంచెం తక్కువ దళసరిగా ఉన్నప్పటికీ, అవి మన్నికైనవి, ఎక్కువగా నివసించే ప్రదేశాల్లో వేయడానికి అనుకూలంగా ఉంటాయి.
2. నీటి నిరోధకత
పింగాణీ టైల్స్ కి తక్కువ నీటి శోషణ రేటు ఉంటుంది. ఇవి వాటర్ డేమేజికి అధిక నిరోధకతను కలిగి ఉంటాయి. సిరామిక్ టైల్స్ మరింత పోరస్ (రంధ్రాలతో కూడి ఉండడం) అయినప్పటికీ, నీటి వాడకం తక్కువగా ఉన్న చోట లేదా సరిగ్గా సీలు చేయబడిన ప్రదేశాలలో కూడా ఉపయోగించవచ్చు.
3. డిజైన్ ఎంపికలు
పింగాణీ సిరామిక్ టైల్స్ రెండూ వివిధ రంగులు, పాటర్న్స్, ఫినిష్ లతో సహా అనేక రకాల డిజైన్ ఎంపికలను అందిస్తాయి. పింగాణీ టైల్స్ మరింత క్లిష్టమైన డిజైన్‌లను కలిగి ఉండవచ్చు. కానీ సిరామిక్ టైల్స్ వైవిధ్యభరితమైన ఆకర్షణతో అందంగా ఉంటాయి, తగిన విధంగా అవసరమైన ఎంపికలను అందిస్తాయి.
4. ఖర్చు
పింగాణీ టైల్స్ వాటి తయారీ ప్రక్రియ మరియు అధిక నాణ్యత కారణంగా సిరామిక్ టైల్స్ కంటే ఖరీదైనవిగా ఉంటాయి. సౌందర్యం, ఆకర్షణ అందిస్తూనే సిరామిక్ టైల్స్ సాధారణంగా మరింత తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి.
మొత్తం మీద, పింగాణీ సిరామిక్ టైల్స్ ఒకేలా ఉంటాయా? లేదు. అవి ఒకేలా ఉండవు. బాత్‌రూమ్‌లు, వంటగదుల వంటి తడి ఉండే ప్రదేశాల్లో అసాధారణమైన మన్నికతో తడిని నిరోధించాల్సిన ప్రాంతాల్లో పింగాణీ టైల్స్ చాలా బాగా పనిచేస్తాయి. అనేక రెసిడెన్షియల్ అప్లికేషన్‌లకు వైవిధ్యభరితమైన సిరామిక్ టైల్స్ అనువైనవీ, అలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపికగా ఉంటాయి. కాబట్టి నిర్ణయించేటప్పుడు, పింగాణీ, సిరామిక్ కంటే మెరుగైనదా కాదా (లేదా వైస్ వెర్సా) పింగాణీ, సిరామిక్ - ఈ రెండింటిలో ఏది వాడాలో మీ తుది నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.