Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
ఏదైనా ఎక్కువ అంతస్తులు ఉన్న ఇంట్లో, మెట్లు చాలా కీలకమైన భాగం. అందంగా ఉండేవీ, ఎక్కి దిగేందుకు వీలుగా ఉండేవీ- ఇలా రెండు విధాలగానూ తగిన మెట్ల రకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైన అంశం. మీరు ఎంచుకున్న మెట్ల రకాలు మీ ఇంటి కొలతలు, డిజైన్ స్థలానికి తగినవిగా ఉండాలి. వివిధ రకాల ఇళ్లకి తగిన మెట్ల వరుసలకి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:
స్ట్రెయిట్ ఫ్లైట్ మెట్లు చాలా సాధారణమైన మెట్ల రకం. చిన్నా, పెద్దా అన్ని రకాల ఇళ్లకీ ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ రకమైన స్టెయిర్‌కేస్‌లు సింపుల్ గానూ సూటిగానూ ఉంటాయి. ఇవి కలప, లోహం, కాంక్రీట్ సహా వివిధ రకాల పదార్థాలతో తయారు చేయబడతాయి. అవి మీ ఇంటికి సొగసునీ, ఆధునిక రూపాన్నీ అందిస్తాయి. అదే సమయంలో ఎక్కి దిగడానికి కూడా చాలా వీలుగా సులభంగా ఉంటాయి.
పరిమిత స్థలం ఉన్న గృహాలకు క్వార్టర్ టర్న్ మెట్లు సరైన ఎంపిక. ఇవి టౌన్‌హౌస్‌లకీ లేదా చిన్న గృహాలకీ మంచి ఎంపిక. అవి ల్యాండింగ్ లో 90-డిగ్రీల మలుపు తిరిగే మెట్లను నేరుగా కలిగి ఉంటాయి, స్థలం పరిమితంగా ఉన్న ప్రాంతాలకు ఈ మెట్లు చాలా అనుకూలమైన ఎంపిక.
డాగ్-లెగ్డ్ స్టెప్స్, క్వార్టర్ టర్న్ మెట్లను పోలి ఉంటాయి, అయితే ల్యాండింగ్ ద్వారా కనెక్ట్ చేయబడే రెండు ఫ్లయిట్ల మెట్లు ఉంటాయి. ఈ మెట్లు పెద్ద భవనాలకు సరైనవి. సాంప్రదాయిక/ క్లాసిక్ డిజైన్ ఉన్న గృహాలకు మంచి ఎంపికగా ఉంటాయి. అవి చూడచక్కని అధునాతన రూపంతో ఉండి ఇళ్లలో ఈ రకమైన స్టెప్స్ గొప్ప వైభవోపేతంగా ఉంటాయి.
ఓపెన్ న్యూయల్ స్టెయిర్స్ పెద్ద భవంతులకి సరైనవి. ఇవి ఆధునికమైన లేదా ఇప్పట్లో వచ్చే కొత్త తరహా డిజైన్‌తో ఇళ్లకి మంచి ఎంపికగా ఉంటాయి. ఈ రకమైన స్టెప్స్ మరింత ఓపెన్ గానూ, విశాలంగానూ ఉన్న అనుభూతిని కలిగించేలా ఓపెన్‌గా ఉండే సెంట్రల్ పోస్ట్ లేదా న్యూవెల్‌ను కలిగి ఉంటాయి. సొగసుగా, కాంటెంపరరీ లుక్‌తో ఉండే ఈ మెట్లు మీ ఇంట్లో చాలా చక్కగా అమిరాయని అనుకునేలా చేస్తాయి.
వృత్తాకార మెట్లు వృత్తాకారంలోనూ లేదా వంకరగానూ ఉంటాయి. బాగా విశాలమైన చోటు ఉన్న ఇళ్లకి ఇవి సరైనవి. వీటిని తరచుగా గ్రాండ్ ఎంట్రన్స్ మార్గాల్లో గానీ, సంపన్న భవనాలలో వైభవోపేతమైన డిజైన్‌తో గానీ ఉపయోగిస్తారు. మీ ఇంటికి ఇవి విలాసవంతమైన రూపాన్ని అందిస్తాయి.
స్పైరల్ మెట్లు మెలికలు తిరిగే లేదా హెలికల్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. పరిమిత స్థలం లేదా చిన్న గదులతో ఉన్న ఇళ్లకి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఇవి ఆధునికమైన, ఈ కాలానికి అనుగుణమైన డిజైన్‌తో ఇళ్లకి మంచి ఎంపికగా ఉంటాయి. ఇవి కలప, మెటల్ గాజుతో సహా వివిధ రకాల పదార్థాల నుండి తయారు చేయబడతాయి. వీటి సొగసైన స్టైలిష్ లుక్‌తో ఈ రకమైన మెట్లు అందరినీ ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి.
విభజించబడిన (బైఫర్‌కేటెడ్) మెట్లు మంచి ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంటాయి. విశాలమైన స్థలంతో పెద్ద గృహాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి. ల్యాండింగ్ వద్ద విడిపోయే రెండు మెట్ల వరసలు ఉంటాయి, ఇవి క్లాసిక్ లేదా సాంప్రదాయ డిజైన్‌తో వైభవోపేతమైన భవనాలకు సరైన ఎంపిక. ఈ మెట్లు మీ ఇంటికి చక్కదనాన్నీ, అధునాతనతనీ అందిస్తాయి.
విండర్ మెట్లు క్వార్టర్-టర్న్ మెట్లను పోలి ఉంటాయి కానీ ల్యాండింగ్ వద్ద తిరిగే కోణాకారపు (యాంగిల్డ్) ట్రెడ్‌లను కలిగి ఉంటాయి. ఇవి పరిమిత స్థలం ఉన్న ఇళ్లకు సరిపోతాయి. సాంప్రదాయబద్ధమైన / క్లాసిక్ డిజైన్ గల ఇళ్లకు మంచి ఎంపికగా ఉంటాయి. ఈ రకమైన మెట్లు మీ ఇంటి సౌందర్యానికి మరింత పెంచడమే కాక, ఎక్కి దిగడంలో మంచి సౌలభ్యాన్ని అందిస్తాయి.
U ఆకారపు మెట్లు డాగ్-లెగ్డ్ మెట్లను పోలి ఉంటాయి, అయితే U ఆకారాన్ని ఏర్పరిచే అదనపు మెట్లు దిగువన ఉంటాయి. అవి విశాలమైన స్థలంతో పెద్ద గృహాలకు అనుకూలంగా ఉంటాయి. గొప్ప డిజైన్‌తో ఉన్న గృహాలకు మంచి ఎంపికగా ఉంటాయి. గొప్ప ఆకట్టుకునే రూపంతో, ఇవి మీ ఇంటి సౌందర్యాన్ని ఎన్నో రెట్లు పెంచగల మెట్ల రకం.
సరైన మెటీరియల్స్, డిజైన్ నిర్మాణ సాంకేతికతలతో, బాగా నిర్మించిన మెట్ల ఏ భవనానికైనా అందాన్నిస్తుంది, అలాగే పని చక్కగా సౌలభ్యాన్నీ అందిస్తుంది. అలాగే దానిని ఉపయోగించే వారికి భద్రత, సౌకర్యం ఉండేలా చూస్తుంది.