Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
ఒక పటిష్టమైన పునాదిని నిర్మించడానికి ఉపయోగించే మెటీరియల్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కొన్ని సాధారణ పునాది మెటీరియల్స్ ని చూద్దాం. వాటి లక్షణాలు, అప్లికేషన్లు ప్రయోజనాలను అర్థం చేసుకుందాం.
చెక్క ఫౌండేషన్‌లు ప్రెషర్-ట్రీటెడ్ కలప లేదా ఇంజనీరింగ్ కలప ఉత్పత్తులను ఉపయోగించి నిర్మించబడతాయి. చిన్న షెడ్‌లు, క్యాబిన్‌లు లేదా ఇతర తేలికపాటి నిర్మాణాలకు ఇది సాధారణ ఎంపిక. కలపను పునాది మెటీరియల్ గా ఉపయోగించడం ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి ఇతర మెటీరియల్ తో పోలిస్తే దాని ధర బాగా తక్కువ.
ఎ) పని చేయడం మరియు నిర్మించడం సులభం
బి) ఖర్చుతో కూడుకున్నది
సి) ఇతర పునాదులు విఫలమయ్యే హై వాటర్ టేబుల్స్ ఉన్న ప్రాంతాలకు అనుకూలం
రాతి పునాదులు సహజ లేదా కత్తిరించిన రాతి బ్లాకులతో తయారు చేయబడతాయి. పాత గృహాలూ, భవనాల కోసం పునాదులను నిర్మించడానికి ఇది ఒక సాధారణ పద్ధతి. రాతి పునాదులు మన్నికైనవీ, ఎక్కువ కాలం నిలబడతాయి, కానీ వాటికి సాధారణ మెయింటెయిన్స్, నిర్వహణ అవసరం.
ఎ) మన్నికైనది, ఎక్కువ కాలం నిలబడేది
బి) అగ్ని-నిరోధకత
సి) ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు వ్యతిరేకంగా అద్భుతమైన ఇన్సులేషన్ ని అందిస్తుంది
ఫౌండేషన్ కోసం ఉపయోగించే అత్యంత సాధారణ రకాలైన మెటీరియల్లో కాంక్రీట్ పునాదులు ఒకటి. ఈ పునాదులు ప్రధానంగా సిమెంట్ కోసం తయారు చేయబడ్డాయి అధిక సంపీడన (కంప్రెసివ్) బలాన్ని కలిగి ఉంటాయి. గణనీయమైన బరువును తట్టుకోగలవు. సిమెంట్ ఫౌండేషన్‌లు అని కూడా పిలుస్తారు, కాంక్రీటును ఆన్-సైట్‌లో పోయవచ్చు లేదా ఫౌండేషన్ నిర్మాణం కోసం బ్లాక్‌లలో ముందుగా వేయవచ్చు. అదనంగా, కాంక్రీట్ బ్లాక్‌లను సిండర్ బ్లాక్‌లని కూడా అంటారు. ఇవి పోర్డ్ కాంక్రీట్ ఫౌండేషన్‌లకు తక్కువ-ధరలో అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయ ఫౌండేషన్లు.
ఎ) బలమైనవీ, మన్నికైనవీ
బి) అగ్ని, తేమ, పెస్ట్ రెసిస్టెంట్
సి) నిర్వహణ అవసరం తక్కువ
కంకర, క్రష్డ్ స్టోన్ లేదా రీసైకిల్ చేసిన కాంక్రీటు వంటి కంకరలను పునాది మెటీరియల్ గా ఉపయోగించవచ్చు. కంకర వేస్తే పునాది నుండి నీటిని తొలగించి నేల కోతను నివారిస్తుంది కాబట్టి అవి హై వాటర్ టేబుల్స్ ఉన్న ప్రాంతాలకి అనువైనవి.
ఎ) తక్కువ ఖర్చుతో కూడుకున్నవి
బి) సరైన డ్రైనేజీని అనుమతిస్తాయి
సి) పర్యావరణ అనుకూలమైనది
ఫ్లై యాష్, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల బై ప్రొడక్ట్, దాని బలం మన్నిక కారణంగా సాధారణంగా పునాది మెటీరియల్ గా ఉపయోగించబడుతుంది. ఇది కాంక్రీట్ మిశ్రమాలలో సిమెంటుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగించబడుతుంది, ఇది పర్యావరణ అనుకూల ఎంపికగా మారుతుంది.
ఎ) సిమెంట్ వాడకాన్ని తగ్గిస్తుంది
బి) పర్యావరణ అనుకూలమైనది
సి) సంకోచం మరియు పగుళ్లకు నిరోధకత
ఇసుక అనేది లో వాటర్ టేబుల్స్, స్థిరమైన నేలలు ఉన్న ప్రాంతాల్లో ఉపయోగించే ఒక సాధారణ పునాది మెటీరియల్. ఇది తరచుగా పునాది నేల మధ్య బెడ్డింగ్ లేయర్ గా ఉపయోగించబడుతుంది.
ఎ) పని చేయడం సులభం కాంపాక్ట్
బి) స్థిరమైన పునాదిని అందిస్తుంది
సి) సరైన డ్రైనేజీని అనుమతిస్తుంది
పునాదిగా ఇటుకలు మన్నిక దీర్ఘాయువు పరంగా రాతి పునాదులను పోలి ఉంటాయి. పాత గృహాలు మరియు భవనాలకు ఇవి సాధారణ ఎంపిక.
ఎ) మన్నికైనది మన్నికైనది
బి) అగ్ని-నిరోధకత
సి) ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు వ్యతిరేకంగా అద్భుతమైన ఇన్సులేషన్ ని అందిస్తుంది
నిర్మాణ పరిశ్రమలో స్టీల్ పునాదులు సాపేక్షంగా కొత్తవి. అవి బలమైనవీ, మన్నికైనవీ అయినందు వల్ల వాణిజ్య పారిశ్రామిక భవనాలకు ప్రసిద్ధ ఎంపిక.
ఎ) బలమైన మన్నికైనది
బి) వాతావరణం మరియు తెగుళ్ళకు నిరోధకత
సి) తక్కువ నిర్వహణ అవసరం
అనేక కారణాల వల్ల నిర్మాణంలో మంచి నాణ్యత గల పునాది మెటీరియల్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. అధిక-నాణ్యత మెటీరియల్స్ పై పెట్టుబడి పెట్టడం ఎందుకు కీలకమో ఇక్కడ కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి:
అధిక-నాణ్యత పునాది మెటీరియల్స్ కాల పరీక్షను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. అవి త్వరగా పాడవకుండా ఉంటూ మరింత రెసిస్టెంట్ గా ఉంటాయి. ఫౌండేషన్ మరియు మొత్తం నిర్మాణం దీర్ఘకాలిక మన్నికని ఈ మెటీరియల్స్ నిర్ధారిస్తాయి. నాసిరకం నాణ్యంగా ఉన్న మెటీరియల్ ని ఎంచుకుంటే తక్కువ సమయంలోనే క్షీణత ఏర్పడవచ్చు, భవనం స్థిరత్వం భద్రతకు ముప్పు కలగవచ్చు.
పునాది ఏదైనా భవనానికి వెన్నెముక. మంచి నాణ్యమైన మెటీరియల్ ని ఎంచుకోవడమనేది పునాది నిర్మాణం, బరువు, భారాన్ని నిర్వహించగలగేలా చేస్తుంది. పేలవమైన మెటీరియల్ వాడితే పునాది స్థిరపడకుండా పగుళ్లకు లేదా వైఫల్యానికి దారితీయవచ్చు. ఇది భవనం నిర్మాణ సమగ్రతను ప్రమాదంలో పడేస్తుంది.
తేమ, ఉష్ణోగ్రత మార్పులు తెగుళ్లు వంటి పర్యావరణ కారకాలను నిరోధించడానికి మంచి-నాణ్యత మెటీరియల్ ని తరచుగా ఇంజనీరింగ్ చేయబడతాయి. ఈ మెటీరియల్ వాటర్ వేస్టేజి, ఫ్రీజింగ్, థాయింగ్ సైకిల్స్ (ద్రవీభవన చక్రాలు), కీటకాలు లేదా చెదపురుగుల దాడి నుంచి మెరుగైన రక్షణను అందిస్తాయి. ఖరీదైన మరమ్మతులు, సంభావ్య ప్రమాదాలను నివారిస్తాయి.
బిల్డింగ్ నియమ నిబంధనలు, నిర్మాణ సామగ్రికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తాయి. మంచి నాణ్యత గల ఫౌండేషన్ మెటీరియల్స్ ని ఎంచుకోవడం, భద్రతను ప్రోత్సహించడానికీ సంభావ్య నిర్మాణ వైఫల్యాలను నివారించడానికీ బిల్డింగ్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. బిల్డింగ్ నిర్మాణానికి పాటించాల్సిన నియమ నిబంధనలను పాటించకపోవడం చట్టపరమైన సమస్యలను కలిగిస్తుంది, నివాసితులకు ప్రమాదాలను కలిగిస్తుంది.
అధిక-నాణ్యత మెటీరియల్ మీద ఎక్కువ ఖర్చు ముందే పెట్టాల్సి వచ్చినప్పటికీ, అవి తరచుగా దీర్ఘకాలికంగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసి పొదుపుకు దారితీస్తాయి. మన్నికైన మెటీరియల్స్ మీద పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు తరచుగా మరమ్మతులు, నిర్వహణ చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. భవనం జీవితకాలం మొత్తం ఖర్చులను తగ్గిస్తుంది.
సారాంశమేమంటే, మంచి నాణ్యత గల పునాది మెటీరియల్స్ ని ఎంచుకోవడం నిర్మాణంలో కీలకమైన అంశం. ఇది నిర్మాణ స్థిరత్వం, మన్నిక, బిల్డింగ్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండటం వల్ల దీర్ఘకాలికంగా అయ్యే ఖర్చుల్ని తగ్గించి మీకు పొదుపు చేస్తుంది. అధిక-నాణ్యత మెటీరియల్స్ పై పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ భవనానికి భద్రత, దీర్ఘకాలికంగా మన్నేలా చేయవచ్చు. ఇది మీ నిర్మాణ ప్రాజెక్ట్ మొత్తం విజయంలో తెలివైన పెట్టుబడిగా మారుతుంది.