సరైన కాంక్రీట్ మిక్స్‌ని తయారు చేయడమనేది కొన్ని మెటీరియల్స్‌ని కలపడమంత సులభం కాదు. మా మిక్స్ దాని లక్ష్యాత్మక బలాన్ని సాధిస్తుందనీ, అద్భుతమైన మన్నికను చూపుతుందనీ, అవసరమైన పని సామర్థ్యాన్ని అందజేస్తుందనీ నిర్ధారించే ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయి. దిగువన, ఆదర్శవంతమైన మిక్స్ కోసం M25 కాంక్రీట్ నిష్పత్తి లెక్కని చిన్న చిన్న ముక్కలుగా విడదీసి అర్థం చేసుకుందాం.
1) లక్ష్యాత్మక బలాన్ని లెక్కించండి
లక్ష్యాత్మక బలం అంటే మనం అనుకున్న విధంగా క్యూర్ చేసిన తర్వాత మనకు కావలసిన M25 కాంక్రీటుకు 25 MPa కాంక్రీట్ మిక్స్. M25 కాంక్రీట్ నిష్పత్తి మిక్స్ గట్టిపడిన తర్వాత ఈ స్థాయి బలాన్ని సాధించడానికి రూపొందించబడింది.
2) నీరు-సిమెంట్ నిష్పత్తిని ఎంచుకోండి
నీరు-సిమెంట్ నిష్పత్తి పరిగణించవలసిన ముఖ్యమైన అంశం. ఈ నిష్పత్తి కాంక్రీటు బలం, మన్నిక మరియు పని సామర్థ్యాన్ని ప్రభావితం చేసే మిక్స్‌లో సిమెంట్ బరువుతో విభజించబడిన నీటి బరువు. మా M25 కాంక్రీటు దాని లక్ష్యాత్మక మన్నిక మరియు బలాన్ని చేరుకోవడానికి సరైన నిష్పత్తిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
3) నీటి కంటెంట్‌ను ఎంచుకోండి
వివిధ కారకాలు మిక్స్‌లో అవసరమైన నీటి పరిమాణాన్ని నిర్దేశిస్తాయి, ఉదాహరణకు ఉపయోగించే కంకరల పరిమాణం మరియు రకం. కాంక్రీటుకి అవసరమైన పని సామర్థ్యం, నిర్దిష్ట మిక్స్ డిజైన్ ఆధారంగా మీరు దీన్ని నిర్ణయిస్తారు.
4) సిమెంట్ కంటెంట్‌ను లెక్కించండి
మీరు నీటి పరిమాణం నీటి-సిమెంట్ నిష్పత్తిని నిర్ణయించిన తర్వాత, మీ మిక్స్‌లో ఎంత సిమెంట్ అవసరమో మీరు గుర్తించవచ్చు. నీరు-సిమెంట్ నిష్పత్తి సిమెంట్ బరువుతో భాగించబడిన నీటి బరువుకు సమానం కాబట్టి, మీరు మీ సిమెంట్ కంటెంట్‌ను తెలుసుకోవడానికి మీ నిష్పత్తి ద్వారా నీటి మొత్తాన్ని గుణించవచ్చు.
5) కంకర కంటెంట్‌ను లెక్కించండి
తరువాత, కంకర కంటెంట్‌ను కనుగొనడానికి, ఉపయోగించాల్సిన కంకర గరిష్ట పరిమాణం, దాని ఆకృతి-నునుపుగా ఉందా, రఫ్‌గా ఉందా, ఇంకా కాంక్రీటు కావలసిన పని సామర్థ్యం, సంపీడన బలం వంటి అంశాలను కూడా లెక్కకు తీసుకోండి. ఈ కారకాలు, నీరు మరియు సిమెంట్ తెలిసిన పరిమాణాలతో పాటు, అవసరమైన కంకర కంటెంట్‌ను లెక్కించడంలో సహాయపడతాయి.
6) నీటి కంటెంట్ మరియు ఫైన్-టు-అగ్రిగేట్ నిష్పత్తిని నిర్ణయించండి
చివరగా, తెలిసిన అన్ని ఇతర కొలతలతో, మీ మిక్స్‌లో ఎంత పొడి కంకర (ఇసుక సైజులో ఉండేది), ఎంత గ్రావెల్ (కంకర రాయి సైజు) అవసరమో మీరు నిర్ణయించవచ్చు. ఈ రెండింటి మధ్య నిష్పత్తి కాంక్రీటు బలాన్నీ, పని సామర్థ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. మీరు మీ వద్ద ఉన్న కంకరలో గల తేమ ఆధారంగా నీటి శాతాన్ని సర్దుబాటు చేయాల్సి రావచ్చు.