Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
లివింగ్ రూమ్‌లు అంటే మీ ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే ప్రదేశాలు. అక్కడ మీ పిల్లలతో రాత్రి ఆటలు ఆడుకుంటారు. మీ భాగస్వామితో హాయిగా విశ్రాంతిగా ఉన్న సోఫాల్లో కూర్చుని తీరిగ్గా ఒక కప్పు కాఫీ త్రాగుతారు లేదా ప్రతి పదిహేను రోజులకు మీకు బాగా నచ్చిన స్నేహితుల్ని పార్టీకి ఆహ్వానిస్తారు. అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్‌తో పాటు, ఆ ప్రదేశానికి శుభప్రదమైన, సానుకూలమైన శక్తుల్ని ఆహ్వానించడానికీ, ప్రతికూల శక్తులు లేకుండా చేయడానికీ గదిలో కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించడం చాలా ముఖ్యం.
ఈ ఆర్టికల్‌లోని లివింగ్ రూమ్ కోసం వాస్తు చిట్కాలు మీ కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరికీ సంతోషకరమైన, విజయవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించే వాస్తు-అనుకూల స్థలాన్ని ప్లాన్ చేయడంలోనూ, డిజైన్ చేయడంలోనూ మీకు మార్గనిర్దేశం చేస్తాయి.
లివింగ్ రూమ్‌లో తూర్పు లేదా ఉత్తరం వైపు స్లోప్ ఫ్లోరింగ్‌ను రూపొందించడం వాస్తు నిపుణులు శుభప్రదంగా భావిస్తారు. లివింగ్ రూమ్‌లో స్లోప్ ఫ్లోరింగ్ వేయడానికి తూర్పు ఈశాన్య దిశ అత్యంత అనుకూలమైన దిశ.
లివింగ్ రూమ్‌లోని వాలు అంతస్తు ఇంట్లో పిల్లలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. చదువుతున్నప్పుడు వారికి విజయం చేకూరుతుంది, ఏకాగ్రతను అందిస్తుంది. విద్యావేత్తలకు, పశ్చిమ వైపు నుంచి ప్రవేశం ప్రయోజనకరంగా చూపబడింది.
షాండ్లియర్ వంటి షోపీస్‌లను వేలాడదీయాలని వాస్తు సూచిస్తోంది, వీటిని తప్పనిసరిగా నివసించే ప్రాంతానికి పశ్చిమ లేదా దక్షిణ వైపున వేలాడదీయాలి. ఇవి ఈ స్థలం సానుకూలత పైనా, చక్కదనంపైనా గొప్ప ప్రభావాన్ని చూపుతాయి.
వాస్తు-అనుకూల ప్రదేశంలో నివసించడం ద్వారా ఆరోగ్యం, సంపద, ఆనందం సంతృప్తిని స్వాగతించండి. మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును ప్లాన్ చేయడానికి మీ అతిథులను సానుకూల వాతావరణంలోకి స్వాగతించడానికీ, పిల్లలు మరియు అతిథి గదులు వాస్తు శాస్త్రం ప్రకారం ఎలా ఉండాలో అనే అంశంపై ఈ కథనాన్ని చదవండి.