Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


మెరుగైన ఆరోగ్యం, సంపద మరియు మొత్తం శ్రేయస్సు కోసం వంటగది వాస్తు చిట్కాలు

వంటగది అంటే ప్రకృతిలోని పంచభూతాలలో ఒకటైన అగ్ని నివసించే ప్రదేశం. ఈ అగ్ని ప్రయోజనాలను పొందేందుకు సరైన వంటగది వాస్తు ఉండడం చాలా ముఖ్యం. లేకుంటే, వంటగది ప్రమాదాలకు గురవుతుంది.

Share:



వాస్తు ప్రకారం వంటగదిని నిర్మించడంలో గల ప్రాముఖ్యత

 

పౌష్టికాహారానికీ, ఆహారానికీ దేవత అయిన అన్నపూర్ణా దేవి ఇక్కడ నివసిస్తుంది. కాబట్టి పూజ గది తర్వాత వంటగదిని ఇంట్లో అత్యంత పవిత్రమైన గదిగా పరిగణిస్తారు. వంటగది అంటే మనం రోజువారీ భోజనాన్ని సిద్ధం చేసే ప్రదేశం. మన రోజువారీ పనులను పూర్తి చేయడానికీ, మనకి మౌలికావసరాల్లో ఒకటైన ఆకలిని తీర్చడానికీ, మనల్ని ఆరోగ్యంగానూ, ఫిట్‌గానూ ఉంచడానికీ శక్తినిచ్చేది భోజనమే.

 

సముచితమైన వంటగది వాస్తు ఉంటే అనారోగ్యాలను ఆహ్వానించే ప్రతికూల శక్తులను నివారించి సానుకూల వాతావరణంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది. వాస్తు ప్రకారం నిర్మించని వంటగది ఆర్థిక భారం, అనారోగ్యాలు, కుటుంబ కలహాలు మొదలైన వాటిని ఆహ్వానిస్తుంది.


వంటగది వాస్తు చిట్కాలు మరియు మార్గదర్శకాలు


వంటగది పెట్టుకోవలసిన చోటు:

 

  • వంటగది వాస్తు చిట్కాల ప్రకారం, ఇంటి ఆగ్నేయ దిశ అగ్ని ప్రాంతం. అందుకే వంటగదిని నిర్మించడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం.
 
  • ఒక మంచి వంటగది వాస్తు దిశ వాయువ్య దిశ.
 
  • ఉత్తరం, ఈశాన్య, నైరుతి దిశల్లో వంటగది ఏర్పాటు చేయకూడదు, ఎందుకంటే అవి వాస్తు ప్రకారం వంటగది దిశకు తగినవిగా పరిగణించబడవు.
 
  • బాత్రూమ్ మరియు వంటగదిని పక్క పక్కనే ఏర్పాటు చేయకూడదు. ఎందుకంటే ఇది వాస్తు దోషంగా పరిగణించబడుతుంది.

ప్రవేశం:

 

  • సరైన వంటగది వాస్తు చిట్కాలు ప్రవేశ ద్వారం పడమర లేదా ఉత్తరం దిశలో ఉండాలని సూచిస్తున్నాయి. వంటగది ప్రవేశానికి ఇది అత్యంత పవిత్రమైన దిశగా పరిగణించబడుతుంది. ఒకవేళ, ఈ దిశలు అందుబాటులో లేనట్లయితే, ఆగ్నేయ దిశను కూడా ఉపయోగించవచ్చు.

గ్యాస్ స్టవ్ :

 

  • వంటగది కోసం వాస్తు చిట్కాలు గ్యాస్ స్టవ్‌ను వంటగదికి ఆగ్నేయ దిశలో ఉంచాలని సూచిస్తున్నాయి.
 
  • గ్యాస్ స్టవ్‌ను వంట చేసేటప్పుడు తూర్పు వైపు ఉండే విధంగా ఉంచాలి.

తలుపులు, కిటికీలు:

 

  • వంటగదిలో ప్రవేశానికి ఒక దిశ మాత్రమే ఉండాలి. ఒకదానికొకటి ఎదురుగా రెండు తలుపులు ఎప్పుడూ నిర్మించకూడదు. రెండు తలుపులు ఉంటే, ఉత్తరం లేదా పడమర వైపు ఉన్న ఒకటి తెరిచి ఉంచాలి. వ్యతిరేక దిశలలో ఉన్న రెండవ తలుపుని మూసివేయాలి.
 
  • సరైన వంటగది వాస్తు ప్రకారం, సమృద్ధినీ, శ్రేయస్సునీ ఆహ్వానించడానికి వంటగది తలుపు సవ్యదిశలో తెరవాలి. అపసవ్య దిశలో ఉన్న తలుపు అభివృద్ధిని నెమ్మది చేస్తుంది. ఫలితాలు ఇవ్వడం ఆలస్యం చేస్తుంది.
 
  • కిటికీని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది సానుకూల శక్తుల ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. వంటగదిలో తగినంత వెంటిలేషన్ మరియు వెలుతురు ఉండేలా చేస్తుంది.
 
  • కిటికీలు వంటగదికి తూర్పు లేదా దక్షిణం వైపున ఉంచాలి, తద్వారా ఎండ, గాలి సులభంగా ప్రవేశించగలవు.
 
  • వంటగదిలో రెండు కిటికీలు ఉంటే, క్రాస్ వెంటిలేషన్‌ను సులభతరం చేయడానికి చిన్నది పెద్దదానికి ఎదురుగా ఉండాలి.
 
  • చిన్న కిటికీని దక్షిణం వైపు లేదా పెద్ద కిటికీకి ఎదురుగా నిర్మించడం సరైనది.

కిచెన్ స్లాబ్:

 

  • వంటగది కోసం వాస్తు శాస్త్రం స్లాబ్‌ను గ్రానైట్‌కు బదులుగా బ్లాక్ మార్బుల్ లేదా రాయితో తయారు చేయాలని సిఫార్సు చేస్తోంది.
 
  • వంటగది స్లాబ్ రంగు కూడా వంటగది యొక్క దిశపై ఆధారపడి ఉంటుంది.
 
  • వంటగది తూర్పున ఉన్నట్లయితే, ఆకుపచ్చ లేదా గోధుమ రంగు స్లాబ్ ఉత్తమం.
 
  • వంటగది ఈశాన్యంలో ఉంటే, పసుపు స్లాబ్ అనువైనది.
 
  • దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో వంటగది కోసం, వంటగది వాస్తు ద్వారా గోధుమ, మెరూన్ లేదా ఆకుపచ్చ స్లాబ్ సిఫార్సు చేయబడింది.
 
  • వంటగది పశ్చిమాన ఉంటే, అప్పుడు గ్రే లేదా పసుపు స్లాబ్ అనువైనది.
 
  • ఉత్తర దిశలో వంటగది కోసం, స్లాబ్ ఆకుపచ్చ రంగులో ఉండాలి కానీ ఉత్తరం వైపు వంటగదిని కలిగి ఉండకూడదని వాస్తు సూచిస్తోంది.

వంటగది సింక్ :

 

  • కిచెన్ సింక్ ని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెట్టాలి.
 
  • సింక్‌ను స్టవ్‌కి సమాంతరంగా లేదా ఒకే దిశలో పెట్టకూడదు. ఎందుకంటే వాస్తు ప్రకారం, అగ్ని, నీరు ఒకదానికొకటి వ్యతిరేకం. ఆ రెండింటినీ కలిపి ఉంచితే ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.
 
  • హానికరమైన ప్రభావాలు లేకుండా చేయడానికి, వంటగది వాస్తు చిట్కాలు సింక్, స్టవ్‌ల మధ్య బోన్ చైనా వాజ్‌ని కలిపి నిర్మించాలని సూచించబడుతోంది.

త్రాగు నీరు :

 

  • సరైన వంటగది వాస్తు సూచించిన విధంగా త్రాగునీరు మరియు పాత్రలకు సంబంధించిన ఉపకరణాలు కూడా వంటగది లోపల పెట్టాలి.
 
  • వంటగది వాస్తు చిట్కాల ద్వారా ఇంటి ఈశాన్య లేదా ఉత్తర మూలలో త్రాగునీటి వనరులను ఉంచాలని సిఫార్సు చేయబడింది.
 
  • ఉత్తరం, ఈశాన్యం అందుబాటులో లేకపోతే వాటిని తూర్పు మూలలో కూడా ఉంచవచ్చు.

వంటింటి ఉపకరణాలు :

 

  • వంటగది వాస్తు చిట్కాలు రిఫ్రిజిరేటర్‌ను వంటగదికి నైరుతి మూలలో గానీ లేదా వేరే ఏదైనా మూలలో గానీ ఉంచాలని సూచిస్తున్నాయి. కానీ ఈశాన్య మూలలో ఎప్పుడూ ఉంచకూడదు.
  • వాస్తు ప్రకారం వంటగది ఏ సమయంలోనూ చిందరవందరగా ఉండకూడదు, కాబట్టి వంటగదికి దక్షిణ లేదా పశ్చిమ మూలల్లో క్యాబినెట్‌లో అన్ని పాత్రలనూ చక్కగా అమర్చండి.
  • వంటగదిలోని అన్ని ఎలక్ట్రిక్ ఉపకరణాలనూ ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఈ ఉపకరణాలు పెట్టడానికి ఈశాన్య మూల పనికి రాదు కాబట్టి ఆ మూల పెట్టకూడదు.

వంటగది రంగు:

 

  • వంటగది వాస్తు చిట్కాలు వంటగదికి లేత రంగులను సిఫార్సు చేస్తున్నాయి.
  • ఎరుపు, లేత గులాబీ, నారింజ ఆకుపచ్చ వంటి రంగులను కూడా వాస్తు ప్రకారం వంటగది రంగులుగా ఉపయోగించవచ్చు.
  • ముదురు రంగులను ఉపయోగించడం మానేయాలి. ఎందుకంటే అవి వంటగదినీ, అక్కడి వాతావరణాన్నీ నిస్తేజం చేస్తాయి.

 

ఇది కూడా చదవండి : మీ ఇంటిని అద్భుతంగా పెయింట్ చేయడానికి చిట్కాలు & ఉపాయాలు




వాస్తు స్నేహపూర్వక వంటగదిని నిర్మించడానికి సానుకూల వైబ్‌లను రేకెత్తించడానికి మిమ్మల్ని కుటుంబ సభ్యులందరినీ ఫిట్‌గానూ, ఆరోగ్యంగానూ ఉంచుకోవడానికి మీరు తెలుసుకోవలసిన అన్ని చిట్కాలు పైన చెప్పబడ్డాయి.


పూజ గది ఇంట్లో మరొక పవిత్రమైన భాగం మీ ఇంట్లో ప్రశాంతత శాంతి వాతావరణాన్ని సృష్టించడానికి మీ అత్యంత శ్రద్ధ అవసరం. పూజ గది కోసం వాస్తు గురించి మరింత చదవండి.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....