Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
ఈశాన్య మూలను వాస్తు ఈశాన్య మూల అని కూడా పిలుస్తారు, ఇది వాస్తు శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాంతం, ఇది భారతీయ సాంప్రదాయిక ప్రదేశాల రూపకల్పన, నిర్వహణ విధానం. ఈ మూలలో చాలా సానుకూల శక్తి ఉన్నందున ఇది ఇంట్లో ఉత్తమ ప్రదేశంగా ఉంటుంది. ఇది ధ్యానం, ప్రార్థన లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సరైన ప్రదేశం. ఇంట్లో ఉన్నవారు తమ దేవుడి మందిరాన్ని ఈ ప్రదేశంలో పెట్టడానికి ఇష్టపడతారు. వాస్తు ఈశాన్య మూలను కుబేరుడు, శివుడు, ఇద్దరు దేవతలు పర్యవేక్షిస్తూ ఉంటారు, వారు సంపదనీ, ఆరోగ్యాన్నీ, ఇంకా అనేక మంచి విషయాలు కలుగజేస్తారనీ, అక్కడ ఉండే ప్రతి ఒక్కరి జీవితాన్నీ మెరుగుపరుస్తారనీ చెప్పబడింది.
ఈశాన్య మూలకు వాస్తు శాస్త్రం ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఇంట్లో శక్తివంతమైన ప్రదేశం అని నమ్ముతారు. వాస్తు ప్రకారం, ఈ ప్రాంతం మంచి శక్తిని తీసుకురావడం ద్వారా మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. మనం ఈ మూలను పవిత్రంగా పెట్టుకుంటే, అది మనకు సంపద, ఆరోగ్యం, ఆనందాన్ని తెస్తుంది. ఈ మూలతో సానుకూల శక్తులకు ప్రత్యేక అనుబంధం ఉంది, ఇది మన ఇళ్లను ప్రశాంతంగా ఉంచి, శుభప్రదమైన భావనలతో నింపడంలో సహాయపడుతుంది. అందుకే వాస్తు పద్ధతుల్లో ఈశాన్యం మూల శ్రద్ధ పెట్టడం చాలా కీలకం.
ఈశాన్య మూలలో వాస్తు దోషాలు ఆస్తిలోని ఈశాన్య మూలలో దోషాలు లేదా లోపాలను సూచిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం, ఖాళీ జాగాల ప్లాన్, ఈ మూలలో ఆధ్యాత్మిక పెరుగుదల, ఆరోగ్యం శ్రేయస్సుతో సంబంధం ఉన్న అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈశాన్య ప్రాంతం సరిగ్గా సర్దుకోకపోతే, అది వాస్తు దోషాలుగా పిలవబడే సమస్యకి దారి తీస్తుంది. ఈ దోషాలు ఇంట్లో ఉండేవారి జీవితాలపై ఈ క్రింది వాటితో సహా అనేక ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి:
వాస్తు ఈశాన్య మూలలోని లోపాలుంటే అక్కడ నివసించేవారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇది శారీరక, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.
ఈశాన్యం సంపదతో (కుబేరుడి స్థలం) సంబంధం కలిగి ఉన్నందున, ఈ దోషాలు ఆర్థిక అస్థిరత, సంపద నష్టం, కొత్త ఆర్థిక అవకాశాలని రానివ్వకుండా ఇబ్బందులు కలిగిస్తాయి.
ఆ మనుషులు, వారి కెరీర్ దిశలో వెళ్తున్నపుడు ఆ మార్గంలో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం, ఉద్యోగంలో అసంతృప్తి, ఎటువంటి పురోగమనమూ లేకుండా అన్ని అవకాశాలూ కోల్పోవడం వంటి ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవచ్చు.
ఈశాన్య ప్రాంతం ప్రజ్ఞతోనూ, విజ్ఞానంతోనూ కూడా అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రాంతంలో వాస్తు దోషాల వల్ల చదువులో ఇబ్బందులు, ఏకాగ్రత లోపించడంతో చదువు సరిగా రాదు.
ప్రతికూల ప్రభావం వ్యక్తిగత సంబంధాలకు విస్తరించవచ్చు, కుటుంబ సభ్యులు లేదా భాగస్వాముల మధ్య అపార్థాలు, విభేదాలు, అసమ్మతిని కలిగిస్తుంది.
దిగువ పేర్కొన్న ఈశాన్య మూలలోని వాస్తు నివారణలతో వాస్తు దోషాలను గుర్తించడం సరిదిద్దడం ద్వారా మీ ఇల్లు లేదా ఆఫీసులో బ్యాలెన్సు వాతావరణం ఏర్పడుతుంది, సానుకూల శక్తి ప్రవాహాన్ని ఆహ్వానించడానికి మీకు సహాయపడుతుంది.
ఈశాన్యం మూల శుభ్రంగా, చిందరవందరగా లేకుండా ఉండాలి. ఇది సహజ కాంతి లేదా దీపాల ద్వారా కూడా బాగా వెలిగించాలి.
ఈ మూలలో ధూపం వేస్తే, శాంతియుత సానుకూల శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
మూలకు సమీపంలో వాస్తు పిరమిడ్‌లను ఉంచడం వల్ల వాస్తుకి సంబంధించిన అసంతులనని సరిచేయవచ్చు.
ఈశాన్య మూల 'కట్' అయితే లేదా లేకుండా పోతే, గోడపై అద్దాన్ని ఉంచడం ద్వారా తప్పిపోయిన స్థలాన్ని సింబాలిక్‌గా 'పూర్తి' చేయవచ్చు.
మీకు ఈశాన్యంలో పడకగది ఉంటే, గది నైరుతి భాగంలో మంచం ఉంచండి, ఉత్తరం వైపు మీ తలని పడుకోకుండా ఉండండి.
వాస్తు యంత్రాన్ని ఈశాన్యంలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తులను దూరంగా పాలద్రోలవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య మూలలోని సానుకూల శక్తిని ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో మీకు సహాయపడే కొన్ని చేయవలసినవీ, చేయకూడనివీ ఇక్కడ ఇవ్వబడుతున్నాయి:
ఈశాన్య మూలలో పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం. ఈ ప్రాంతం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సానుకూల శక్తిని స్వేచ్ఛగా ప్రవహించేలా చేయాలంటే, వస్తువుల్ని చెల్లాచెదరుగా పడెయ్యకుండా, చెత్త లేకుండా నీట్ గా ఉంచాలి.
ఈ మూలలో భారీ ఫర్నిచర్ ఉండకుండా లేదా వస్తువులు చిందరవందరగా లేకుండా చూసుకోండి. ఈశాన్యంలో బహిరంగ ప్రదేశం సానుకూల వైబ్‌లను ఆహ్వానిస్తుంది మానసిక స్పష్టతకు సహాయపడుతుంది.
ఈశాన్యం జల అంశతో ముడిపడి ఉంది. ఇక్కడ వాటర్ ఫౌంటెన్ లేదా అక్వేరియం పెడితే అదృష్టాన్ని ఆకర్షించవచ్చు, ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది.
ఈ మూలలో సహజ సూర్యకాంతి లేదా కృత్రిమంగానైనా లైటింగ్ ఉండేలా చూడాలి. ఈశాన్యంలోని ప్రకాశం చీకటిని (అజ్ఞానం) తొలగించడాన్నీ, జ్ఞానాన్ని పొందడాన్నీ సూచిస్తుంది.
ఈశాన్య మూల ప్రార్థన గదికి లేదా ధ్యాన స్థలానికి సరైనది. దాని ప్రశాంతమైన ప్రకంపనలు ఆధ్యాత్మిక వృద్ధికి శాంతికి తోడ్పడతాయి.
ఈశాన్యంలోని టాయిలెట్ ఈ మూలలోని స్వచ్ఛతను కలుషితం చేస్తుంది, ప్రతికూల శక్తి ఆరోగ్య సమస్యలను తెస్తుంది.
భారీ ఫర్నిచర్ లేదా యంత్రాలు మూలలోని శక్తిని "బరువు"ని పెంచుతాయి, ఇది ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఇక్కడ చెత్త పేరిస్తే లేదా చిందరవందరగా ఉంటే మీ ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశించకుండా నిరోధించబడవచ్చు, అప్పుడు జీవితంలో స్తబ్దత ఏర్పడుతుంది.
ఈశాన్యంలోని మెట్లు సానుకూల శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఈ ప్రాంతంలోని ముదురు రంగులు ఇంటికి ఉద్దేశించిన సానుకూల శక్తులను గ్రహించగలవు. ఆ ప్రాంతం ఉత్సాహంగానూ సానుకూల వైబ్‌లతో నిండి ఉండేలా చూసుకోవడానికి లేత రంగులను ఎంచుకోండి.
చివరిగా చెప్పేదేమంటే, ఈశాన్య మూలలో వాస్తు దోషాలను సరిదిద్దడం వలన మీ ఇంటి సామరస్యం శక్తి ప్రవాహాన్ని గణనీయంగా ప్రభావితం చేయవచ్చు. శుభ్రంగా ఉండడం, పంచభూతాలు ఏ స్థానాల్లో ఉండాలో అక్కడే సరిగ్గా ఉంచితే ప్రతికూలతని నివారించవచ్చు, ఇలాంటి సాధారణ నివారణలు ఈ స్థల పవిత్రతని మార్చగలవు. ఈ మార్పులను స్వీకరించడం మీ జీవన వాతావరణంలో శ్రేయస్సు, శాంతి సానుకూలతను ప్రోత్సహిస్తుంది.