వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి



ఇల్లు కట్టేటప్పుడు సింపుల్ వాస్తు చిట్కాలు

ఇంటి కోసం వాస్తు చిట్కాలు మీకు మీ కుటుంబానికి అదృష్టాన్ని, సంతోషాన్ని విజయాన్ని అందించడంలో సహాయపడతాయి.

Share:


ఇంటికి ఆనందం విజయాన్ని తీసుకురావడానికి ఈ సాధారణ వాస్తు చిట్కాలను అనుసరించండి.

 

మీరు కొత్త ఇంట్లోకి మారుతున్నట్లయితే దానిని మీరే డిజైన్ చేసుకోవాలని లేదా ఇంటీరియర్ డిజైనర్ సహాయంతో ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇంటి వాస్తును ఎల్లప్పుడూ సరిచూసుకోవడం మంచిది. ఇంటికి వాస్తు శాస్త్రం శాస్త్రీయ పరిశోధన ఆధారంగా రూపొందించబడింది. ఇది డిజైన్, ఆర్కిటెక్చర్ లేఅవుట్ సూత్రాన్ని వివరిస్తుంది. ఇల్లు సానుకూల శక్తిని ప్రసరింపజేయడానికి ప్రతికూలతను అరికట్టడానికి, ఇంటి కోసం వాస్తు చిట్కాలను అనుసరించడం చాలా అవసరం.

సానుకూలతనీ, మంచి వైబ్రేషన్స్ నీ మెరుగుపరచడంలో వాస్తు శాస్త్రం చెప్పేదానికీ, మన గృహాల డిజైన్ కీ మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం. మీరు ప్రేమపూర్వకమైన, సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండేలా చూసుకోవడానికి మీ ఇంటిలో చేర్చవలసిన అనేక వాస్తు చిట్కాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి:


సైట్ ఎంపిక:

 

  • ఇంటి సానుకూలతలో ఇంటికి వాస్తు దిశ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు నివాస స్థలం కోసం భూమిని ఎంచుకుంటున్నట్లయితే, ప్లాట్ వాస్తుకు కట్టుబడి, తదనుగుణంగా విషయాలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమం. సైట్ ఓరియంటేషన్, నేల రకం, ప్లాట్ ఆకారం వంటి మరిన్ని విషయాల వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి.



వీధి శూలలు:

ప్లాట్‌కి ఎదురుగా రోడ్డు ఉంటే అది వీధి శూల అవుతుంది. వీధి శూలాల్లో కొన్ని సానుకూలతను తెస్తాయి, మరికొన్ని ప్రతికూల శక్తిని తెస్తాయి. ఈశాన్యానికి ఉత్తరాన, ఈశాన్యానికి తూర్పున ఉన్న వీధి శూలాలను ఉత్తమంగా పరిగణిస్తారు. అయితే ఆగ్నేయానికి దక్షిణం, వాయువ్యానికి పశ్చిమంగా ఉండే వీధిశూలల్ని ఓ మోస్తరు మంచివిగా పరిగణిస్తారు.



నీటి వనరులు :

 

  • గృహ వాస్తును పరిగణనలోకి తీసుకున్నప్పుడు, నీటి వనరులు చూసుకోవాల్సిన మరో అంశం. ట్యాంకులు, బావులు లేదా ఇతర నీటి వనరులకు ఈశాన్యం ఉత్తమ దిశ. ఉత్తర దిక్కును గృహాలలో శుభప్రదంగా భావిస్తారు కాబట్టి దానిని ఖాళీగా ఉంచాలి. ఖాళీ స్థలంలో నీటి ట్యాంకులు ఉంచవచ్చు, ఇది సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.


గృహ ప్రవేశానికి వాస్తు:

 

  • మీ ఇంటికి ప్రవేశ ద్వారం కాబట్టి ప్రధాన ద్వారం వాస్తు చాలా ముఖ్యమైన అంశం. ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండాలి. మెయిన్ డోర్‌ను నాణ్యమైన చెక్కతో నిర్మించాలి. ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలి. ప్రధాన ద్వారం వెలుపల ఏవైనా ఫౌంటైన్‌లు లేదా ఇతర అలంకారమైన నీటికి సంబంధించిన అలంకరణలని పెట్టవద్దు.


లివింగ్ రూమ్:

 

  • లివింగ్ రూమ్ అంటే ఇంట్లో చాలా వరకు కార్యకలాపాలు అక్కడే జరుగుతాయి. ఇది మీ ఇంటిపై అభిప్రాయాన్ని సృష్టిస్తుంది, కాబట్టి ఇది సమస్యాత్మకంగా ఉండకండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య ముఖంగా ఉండాలి. లివింగ్ రూమ్‌కు పశ్చిమ లేదా నైరుతి దిశలో బరువైన ఫర్నిచర్‌ను ఉంచాలి.

     

ఇది కూడా చదవండి : లివింగ్ రూమ్ కోసం వాస్తు చిట్కాలు


పెద్ద పడక గది :

 

ఆదర్శవంతంగా, నైరుతి దిశలో పడకగది మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కలిగేలా చేస్తుంది. పడకగదికి నైరుతి మూలలో మంచాన్ని పెట్టాలి. మంచం ముందు అద్దం లేదా టెలివిజన్ పెట్టవద్దు.

 

ఇది కూడా చదవండి : మీ పడకగదికి టాప్ 5 ముఖ్యమైన చిట్కాలు వాస్తు చిట్కాలు


పిల్లల గది/అతిథి గది:

 

  • పిల్లల గది ఈశాన్య దిశలో ఉండాలి, అది తెలివితేటలు, బలం, శక్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. మంచం ఆ దిశలో వేస్తే బిడ్డకి ఆ దిశ సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది.

వంటగది:

 

  • వంటగదికి ఆగ్నేయ దిశ అనువైనదిగా పరిగణించబడుతుంది. గోడలకు పసుపు, గులాబీ, నారింజ, ఎరుపు నలుపు వంటి ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోండి. ఆగ్నేయ దిశలో స్టవ్ ఉండేలా చూసుకోవాలి.

     

ఇది కూడా చదవండి : వాస్తుకు అనుకూలమైన వంటగదిని రూపొందించడానికి సులభమైన చిట్కాలు


భోజనాల గది:

 

  • భోజనం చేసేటప్పుడు తూర్పు, పడమర లేదా ఉత్తరం ముఖంగా కూర్చుని భోజనం చేయాలి. నిత్యం దక్షిణాభిముఖంగా భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డైనింగ్ టేబుల్ చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. గుండ్రంగా గానీ లేదా ఉండకూడని మరేదైనా ఆకారంలో గానీ ఉండకూడదు.


పూజ గది:

 

  • పూజ గదికి తూర్పు లేదా ఈశాన్యం సరైనది. పవిత్రమైన స్థానంలో ఆసనం వేసి, కొవ్వొత్తులు లేదా అగరబత్తితో అలంకరించండి. తెలుపు, లేత గోధుమరంగు, లేత పసుపు లేదా ఆకుపచ్చ రంగులు వేస్తే గోడలకు మంచిది.

     

ఇది కూడా చదవండి : మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి 6 మార్గాలు


బాత్రూమ్ / మరుగుదొడ్లు:

 

  • వాష్ బేసిన్ షవర్ ఏరియా వాస్తు ప్రకారం బాత్రూమ్ తూర్పు, ఉత్తరం ఈశాన్య భాగంలో ఉండాలి. బాత్రూమ్ టాయిలెట్‌లో నీరు డ్రైనేజీ సరైన వాస్తు దిశ ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం.


బాల్కనీలు:

 

  • బాల్కనీలను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలలో నిర్మించాలి. నైరుతి లేదా దక్షిణ దిశలో బాల్కనీ ఉన్న ఇంటిని తీసుకోకూడదు.




మీ ఇల్లు ఆనందం, విజయం మంచి ఆరోగ్యంతో నిండి ఉండేలా చేయడానికి ఇంటి కోసం ఈ వాస్తు చిట్కాలను అనుసరించాలి.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....