Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
నిర్మాణ పరిశ్రమకు స్టీల్ వెన్నెముక. నిర్మాణ ప్రాజెక్ట్ ని ప్రారంభించినప్పుడు, సరైన స్టీల్ బార్లను ఎంచుకోవడం అనేది కేవలం ముఖ్యం మాత్రమే కాదు; ఇది చాలా చాలా ప్రాధాన్యతతో కూడుకున్న విషయం. మీ కన్‌స్ట్రక్షన్ సమగ్రత, భద్రత, దీర్ఘకాల మన్నిక ఈ ఎంపికపై ఆధారపడి ఉంటుంది.
తప్పు ఎంపిక చేయడం వలన నిర్మాణపరమైన సమస్యలు వస్తాయి, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, భద్రతాపరమైన సమస్యలు కూడా ఏర్పడవచ్చు. పరిగణించాల్సిన వివిధ కారకాలతో స్టీల్‌లో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి, ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
నిర్మాణ ప్రాజెక్టులలో సాధారణంగా ఉపయోగించే వివిధ రకాల స్టీల్ రాడ్లు ఉన్నాయి, ప్రతి దానికీ వాటి వాటి ప్రత్యేక లక్షణాలు, ప్రయోజనాలు ఉన్నాయి. రెండు సాధారణ రకాలు:
ప్లెయిన్ బార్లు అని కూడా పిలువబడే తేలికపాటి స్టీల్ రాడ్లు నిర్మాణ అప్లికేషన్లకు చాలా ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అవి తక్కువ కార్బన్ కంటెంట్‌ని కలిగి ఉంటాయి, వెల్డ్ చేయడం, కావలసినట్టుగా మార్చుకోవడం చాలా సులభం. మైల్డ్ స్టీల్ రాడ్లు మంచి బలం, డక్టిలిటీ (సాగగలగుణము) కలిగి ఉంటాయి, సాధారణ నిర్మాణ అవసరాలకు అనుకూలంగా ఉంటాయి.
రూపం మార్చబడిన స్టీల్ రాడ్లను "రీఇన్‌ఫోర్స్‌డ్ బార్స్" లేదా "రీబార్లు" అని కూడా అంటారు, ఇవి మెరుగైన అడ్హెషన్‌ని అందించడానికి ఉపరితల వైకల్యాలతో కూడిన స్టీల్ రాడ్ల కాంక్రీటు. స్టీల్‌కీ, కాంక్రీటు మధ్య బంధన (అడ్హెషన్) బలాన్ని పెంచడానికి ఈ బార్లు సాధారణంగా రీఇన్‌ఫోర్డ్ కాంక్రీట్ నిర్మాణాలలో ఉపయోగించబడతాయి. వంచబడిన స్టీల్ రాడ్ల అద్భుతమైన తన్యత (టెన్సైల్) బలం, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లక్షణాలను అందిస్తాయి.
కన్‌స్ట్రక్షన్ కోసం స్టీల్‌ను ఎలా ఎంచుకోవాలో అర్థం చేసుకుంటున్నపుడు, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి, మీరు అనేక కీలకమైన అంశాలను అంచనా వేసుకోవాలి. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి:
స్టీల్ రాడ్స్, డయామీటర్ మరియు గ్రేడ్ వాటి భారాన్ని మోసే సామర్థ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. సరైన ఎంపిక మీ ప్రాజెక్ట్ నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి ఉంటుంది. నిర్మాణ డిజైన్‌లో పేర్కొన్న స్టీల్ అవసరమైన డయామీటర్‌నీ, గ్రేడ్‌నీ వెరిఫై చేయండి. మీరు హెవీ-లోడ్ స్ట్రక్చర్ పై పని చేస్తుంటే, అక్కడి అవసరాల్ని తీర్చడానికి మీకు మందపాటి హై-గ్రేడ్ స్టీల్ బార్లు అవసరం.
వివిధ నిర్మాణ ప్రాజెక్టులకు వివిధ స్టీల్ రాడ్ బరువులు అవసరమవుతాయి. స్టీల్ రాడ్ల బరువు చూడండి, ఎందుకంటే ఇది నిర్వహణ, రవాణా, ఇన్‌స్టలేషన్‌పై ప్రభావం చూపుతుంది. ఎంచుకున్న స్టీల్ బార్ల బరువు మేనేజ్ చేయదగినదనీ, ప్రాజెక్ట్ అవసరాలకు అనుకూలంగా ఉందనీ నిర్ధారించుకోండి. మీరు మీ అప్లికేషన్ కోసం తేలికైన స్టీల్ రాడ్లను ఉపయోగిస్తే, మీరు నిర్మాణ వైఫల్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
ఏదైనా కనిపించే పగుళ్లు లేదా లోపాల కోసం స్టీల్ రాడ్లను జాగ్రత్తగా పరిశీలించండి. చిన్న పగుళ్లు కూడా కాలక్రమేణా నిర్మాణ సమగ్రతను బలహీనపరుస్తాయి. పగుళ్లు ఉన్న రాడ్స్ ని ఉపయోగించకండి, ఎందుకంటే అవి చాలా పెద్ద భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఉపరితలాలు నునుపుగా ఉండి, పగుళ్లు ఏవీ లేకుండా ఉండే రాడ్లను ఎంచుకోండి.
తుప్పు స్టీల్ సమగ్ర బలాన్ని దెబ్బ చేస్తుంది. రాడ్స్ పరిస్థితిని చెక్ చేయండి, తుప్పు పట్టకుండా నిరోధించడానికి ఎపాక్సీ లేదా జింక్ వంటి ఏవైనా ప్రొటెక్టివ్ కోటింగ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయండి. స్టీల్ రాడ్లు తుప్పు పట్టకుండానూ లేదా మరింత తుప్పు పట్టకుండానూ చూసుకోండి. తుప్పు తరచుగా తొలగించబడుతుంది, కానీ మరీ ఎక్కువ తుప్పు పట్టిన రాడ్ ని వాడకుండా ఉండడమే మంచిది.
మీరు ఎంచుకున్న స్టీల్ బ్రాండ్ ముఖ్యం. ప్రసిద్ధ బ్రాండ్లు సాధారణంగా హై-క్వాలిటీ స్టీల్ రాడ్లను అందిస్తాయి, ఇది మెటీరియల్ విశ్వసనీయత, బలం విషయంలో చాలా మనశ్శాంతిగా ఉంటుంది. విశ్వసనీయ బ్రాండ్లను ఎంచుకోవడమనేది పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా నిజమైన ధృవీకరించబడిన స్టీల్‌ని ఉపయోగించారనే విషయాన్ని ధృవీకరిస్తుంది.
స్టీల్ రాడ్లపై అంచుల రకాన్ని పరిగణించండి. హ్యాండ్లింగ్, ఇన్‌స్టలేషన్ సమయంలో గాయాల ప్రమాదాన్ని తగ్గించడం కోసం గుండ్రని అంచులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. చక్కటి ఫినిషింగ్ అంచులతో ఉన్న స్టీల్ రాడ్లు నిర్మాణ సమయంలో సులభంగా హ్యాండిల్ చేసేందుకు, ఒక చోట పెట్టడానికి వీలు కల్పిస్తాయి. ఇది మీ పని నాణ్యతకు దోహదం చేయడమే కాకుండా నిర్మాణ ప్రక్రియ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
చివరిగా, నిర్మాణ సమగ్రతనీ, భద్రతనీ నిర్ధారించడానికి కన్‌స్ట్రక్షన్ కోసం సరైన స్టీల్ బార్లను ఎంచుకోవడం చాలా కీలకం. మీరు చేసే ఎంపిక మీ భవనం, నిర్మాణ పటిష్టత, దీర్ఘకాలిక మన్నిక మీద శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. ఇంకా పైగా డయామీటర్, బరువు, పగుళ్లు, తుప్పు, బ్రాండ్, అంచుల ఫినిషింగ్ వంటి అంశాలను జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలి. కన్‌స్ట్రక్షన్‌లో స్టీల్ రీఇన్‌ఫోర్స్‌మెంట్ ఎందుకు ఉపయోగించబడుతుందనే దానిపై మరింత సమగ్ర అవగాహన కోసం, ఈ సమాచార వీడియోను చూడాలని మేము సిఫార్సు చేస్తున్నాము: స్టీల్‌ను రీఇన్‌ఫోర్స్‌మెంట్‌గా ఎందుకు ఉపయోగిస్తారు.