Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
గృహ వాస్తు చార్ట్ అనేది వాస్తు శాస్త్రంలో అంతర్భాగం. ఇది 360 డిగ్రీల వాస్తు చార్ట్ విధానంతో ఖాళీ స్థలాల నిర్మాణం, మెయింటెనెన్సుకి సమగ్ర మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇది పర్యావరణానికీ, ఇంట్లో ఉండేవారికీ మధ్య సామరస్యాన్ని సాధించే లక్ష్యంతో ఆర్కిటెక్చర్‌ని ప్రకృతి అంశాలతో మిళితం చేసే సూత్రాలను కలిగి ఉంటుంది.
చార్ట్ ఒక గ్రిడ్ రూపంలో వాస్తు రేఖాచిత్రం ద్వారా సూచించబడుతుంది, సాధారణంగా చతురస్రాలు లేదా ప్యాడ్‌లను కలిగి ఉంటుంది, వాస్తు సూత్రాల ప్రకారం వివిధ గదులు మరియు ఫంక్షన్‌ల కోసం నిర్మాణంలో అనువైన స్థానాలను సూచిస్తుంది.
ఇది ఇల్లు, దాని భాగాలను (తలుపులు, కిటికీలు, గదులు) ప్రధాన దిశలతో (ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమం) అవి సూచించే అంశాలతో అలైన్ చేయడానికి గొప్ప ప్రాధాన్యతనిస్తుంది, ఇలా చేయడం శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.
లేఅవుట్ స్థలంలో విశ్వ శక్తి సామరస్య ప్రవాహాన్ని నిర్ధారించడానికి రూపొందించబడుతుంది, ఇది దాని ఇంట్లో ఉండేవారి శ్రేయస్సును మెరుగుపరుస్తుందని నమ్ముతారు.
ఇంటి కోసం ఈ ఆర్కిటెక్చర్ చార్ట్ నిర్మాణ డిజైన్‌కు మార్గనిర్దేశం చేసే పునాది బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది, ఇది నిర్మించిన పర్యావరణం సహజ ప్రపంచం మధ్య సమతుల్యతను సృష్టించడం, తద్వారా ఇంట్లో సానుకూల శక్తి, ఆరోగ్యం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.
భూమి అయస్కాంత క్షేత్రం, గురుత్వాకర్షణ శక్తులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. స్థిరత్వం కోసం నిర్దిష్ట దిశలు స్థానాలను సూచిస్తాయి.
సంపదనీ, శ్రేయస్సునీ పెంచడానికి ప్రవాహాన్నీ, స్వచ్ఛతనీ సూచించే పంచభూతాల్లో ఒకటైన జలం ఉంచాలి.
ఇది ఎనర్జీనీ, శక్తినీ నియంత్రించే అగ్ని మూలకం, వంటగది విద్యుత్ ఉపకరణాల పరిస్థితిని నిర్ణయిస్తుంది.
గాలి ప్రవాహం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సరైన వెంటిలేషన్ ఉంచే స్థానాలు మరియు కిటికీలు పెట్టే స్థానం ముఖ్యమైనవి.
ఆకాశంతో సహా పంచభూతాల్లో అన్నిటికీ కాస్మిక్ కంటైనర్ హోలిస్టిక్ డిజైన్, స్ట్రక్చర్ లేఅవుట్‌ని నిర్ణయిస్తుంది.
గృహ వాస్తు చార్ట్ లేదా వాస్తు పురుష మండలం, తూర్పు వైపు ఉన్న ఒక విశ్వ పురుషుని తలకి ప్రాతినిధ్యం వహించి ఆర్కిటెక్చర్ సూత్రాలను ప్రతిబింబించే అధ్యాత్మపరమైన చతురస్రాకార ప్లాన్. ఈ గ్రిడ్ నమూనాలో గదులు, తలుపులు ఫర్నిచర్ అమరిక ఉంటుంది, ఇది లివింగ్ స్పేస్ ప్రదేశంలో వీలైనంత ఎక్కువ శక్తి ప్రవాహాన్ని ప్రసరించే లక్ష్యంతో ఉంటుంది.
చార్ట్‌లోని ప్రతి దిశ నిర్దిష్ట ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది, నిర్దిష్ట కార్యకలాపాలు లేదా గదులకు ఉత్తమంగా సరిపోతుంది:
ఇది పడక గదులకి అనువైనది, ఎందుకంటే ఇది స్థిరత్వాన్ని సూచిస్తుంది, ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది.
వంటగదికి ఉత్తమ స్థానం. ఇది ఆరోగ్యానికీ, శక్తికీ సంబంధించినది, ఎందుకంటే ఇది పంచభూతాల్లో అగ్నికి సంబంధించినది.
ప్రవేశానికి అనుకూలమైనది, అభివృద్ధినీ, సానుకూల శక్తి ప్రవాహాన్నీ ప్రవహింపజేస్తుంది.
ధ్యానం లేదా ప్రార్థన ప్రదేశాలకు అనుకూలం. ఇది స్పష్టతనీ, ఆధ్యాత్మిక అభివృద్ధినీ అందిస్తుంది.
ఇంటి కోసం ఆర్కిటెక్చర్ చార్ట్‌ని అనుసరించడం ద్వారా మీరు ప్రతి గదినీ, క్షేమంగా, సామరస్యంగా ఉండేలా ఏర్పాటు చేయడంలో మీకు సహాయపడుతుంది:
ఉత్తరం లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో స్వాగతించే వాతావరణం ఏర్పడుతుంది, కుటుంబ సామరస్యత పెరుగుతుంది.
ఆగ్నేయ దిశ, మండే లక్షణంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యాన్నీ, ఉత్సాహాన్నీ పెంచుతుంది.
దక్షిణ దిశ కావలసినంత శక్తిని అందిస్తుంది, ప్రశాంతతనీ, గాఢ నిద్రను అనుగ్రహిస్తుంది.
బాత్‌రూమ్‌ని వాయువ్య దిశలో ఉంచడం వలన పరిశుభ్రతని మెయింటెయిన్ చేసేందుకూ, ప్రతికూలతను తొలగించడానికీ సహాయపడుతుంది.
ఒక వాస్తు దిశ చార్ట్‌లోని ఈ అమరికలను అనుసరించడం ద్వారా, మీరు ఒక సంతులితమైన సానుకూలమైన గృహ వాతావరణాన్ని సృష్టించవచ్చు.
గృహాల కోసం వాస్తుశాస్త్ర చార్ట్‌ల సూత్రాలను అప్లై చేయడం అనేది ప్రతి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలని మాత్రమే కాదు, మీరు నివసించే ప్రదేశంలో సమతుల్యత, ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావడానికి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని అన్వయించుకోవాలి. ఈ విధానం ప్రాకృతిక శక్తులతో ఇంటిని అనుసంధానిస్తుంది, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తుంది.
సంక్షిప్తంగా, గృహ వాస్తు చార్ట్ వ్యావహారికంగానూ, సౌందర్యపరంగానూ మాత్రమే కాకుండా, పంచభూతాలతో అనుగుణంగా ఉండే ప్రదేశాల్ని నిర్మించుకోవడానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది, ఇల్లు ప్రశాంతంగా, సంపన్నంగా ఉండేలా చూస్తుంది.
గృహాల కోసం వాస్తు చార్ట్ సూత్రాలను చేర్చడం వల్ల ఇంట్లో ఉండేవారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, అవి ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండేలా చూడడం దాకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సరైన వ్యూహం, ఆ స్థలానికి అనుగుణంగా ఉండేలా ప్రకృతి శక్తులకీ, నిర్మించే వాతావరణానికీ మధ్య సామరస్యత, సమతుల్యతనీ తీసుకొస్తుంది. ఆ విధంగా ఇంట్లో ప్రశాంతత, శక్తి బాగా పెరుగుతాయి.
మీ ఇంట్లో వాస్తు సూత్రాలను ఉపయోగించడం వల్ల అక్కడ నివసించే వారి ఆరోగ్యం మెరుగుపడే వాతావరణాన్ని సృష్టించవచ్చు.
వాస్తు ప్రకారం స్థలాల అమర్చి, వ్యవస్థీకృతం చేస్తే సానుకూల శక్తి, శ్రేయస్సు లభిస్తాయి.
వాస్తు మీ నివాస స్థలంతో ప్రాకృతిక శక్తులను సమన్వయం చేయడంలో సహాయపడుతుంది, తద్వారా శాంతినీ, స్థిరత్వాన్నీ పెంచుతుంది.
వాస్తు సూత్రాలను అప్లై చేయడం వల్ల మీ ఇంటిలో సరైన ప్రవాహం, ప్రాకృతిక శక్తుల సమతుల్యతను నిర్ధారించడం ద్వారా మొత్తం శక్తి స్థాయిని పెంచవచ్చు.
వాస్తు సూత్రాలు ఇంటికీ, ప్రకృతి శక్తులకీ మధ్య పరస్పర చర్యని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి, ఫలితంగా మరింత ఆరోగ్యకరమైన సామరస్యపూర్వకమైన జీవన వాతావరణం ఏర్పడుతుంది.
ఇంటికి వాస్తు శాస్త్రం గురించి నిశితంగా తెలుసుకోవడమంటే మీ ఇంటికి శాంతినీ, సమతుల్యతనీ తీసుకురావడమే. గృహ వాస్తు చార్ట్‌ను సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యం. ఈ చార్ట్ కేవలం ఒక సాధారణ సాధనం కాదు; ఇది మీ నివాస స్థలాన్ని ప్రకృతితో అనుసంధానించడం ద్వారా మీ గృహ జీవితాన్ని మెరుగుపరచడానికి అనుసరించే ఒక మార్గం. మీ ఇంటికి మంచి శక్తినీ ఆనందాన్నీ అందించేందుకు వాస్తు శాస్త్రం నుంచి ఇక్కడ కొన్ని సులభమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
సమృద్ధిని ఆహ్వానించడానికి ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి.
ఈశాన్య దిశ సామాజిక సంబంధ బాంధవ్యాలనీ, కుటుంబ బంధాలనీ మెరుగ్గా సాగేలా చేస్తుంది.
ఆగ్నేయ మూలలో ఉన్న జీవశక్తి కోసం పంచభూతాల్లోని అగ్నితో అనుసంధానం చేయబడింది.
స్థిరత్వానికి నైరుతి దిశలో మాస్టర్ బెడ్ రూమ్ ఉండేలా చూసుకోవాలి; అతిథి గదికి వాయువ్య దిశలో ఉండాలి.
ప్రతికూలతను తొలగించడానికి ఇది వాయువ్యంలో ఉండాలి.
ఇవి కఠినమైన నియమాలు కాదు, డిజైన్ ప్రక్రియను సానుకూలంగా ప్రభావితం చేయడానికి మార్గదర్శకాలు.
గృహాలు వాస్తు చార్ట్‌ను ఖచ్చితంగా అనుసరించడం ఎల్లప్పుడూ సాధ్యం కాదనీ, వాస్తులో గణనీయమైన మార్పులు అవసరం లేకుండా ప్రతికూల ప్రభావాలను తగ్గించగల చర్యలు సర్దుబాట్లు ఉన్నాయనీ అర్థం చేసుకోవడం.
అద్దాలు శక్తి ప్రవాహాన్ని దారి మళ్లించగలవు; వాటిని ఉత్తరం లేదా తూర్పు గోడ మీద ఏర్పాటు చేస్తే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
రంగులు మానసిక స్థితి శక్తిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. నివసించే ప్రదేశాలలో ప్రశాంతతనిచ్చే రంగులు, మసిలే ప్రదేశాలలో ఉత్తేజాన్ని కలిగించే రంగులు ఉంటే వాతావరణాన్ని సంతులితం చేయగలవు.
ఈశాన్య దిశలో ఇండోర్ ప్లాంట్స్, వాటర్ ఫీచర్స్ పెడితే సానుకూల శక్తినీ, సమృద్ధినీ కలుగజేస్తాయి.
ఇళ్లల్లో వాస్తు శాస్త్రం గురించి ఉన్న సాధారణంగా ప్రజల మనసుల్లో ఉన్న అపోహలను పరిష్కరించడానికీ, వ్యావహారిక ఆచరణకీ ఇది చాలా ముఖ్యం:
వాస్తు అనేది తరచుగా అనేక కఠినమైన నియమాల్ని ఆచరించాల్సిన విధానంగా భావించబడుతుంది. అయితే, ఇది ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉండే సౌకర్యవంతమైన మార్గదర్శకం.
వాస్తు సూత్రాలు ప్రాచీన పద్ధతులపై ఆధారపడి ఉన్నప్పటికీ ప్రత్యేకించి ప్రాదేశిక సామరస్యత, శక్తి ప్రవాహానికి సంబంధించి వాటికి శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి.
గృహ వాస్తు చార్ట్‌తో మీ నివాస స్థలాన్ని అలైన్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అది మీ రోజువారీ జీవితంలో సామరస్యాన్ని సానుకూలతను నింపుతుంది. గృహాలకు వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రాచీన జ్ఞానాన్ని అప్లై చేస్తే, చిన్న చిన్న విషయాల్లో కూడా మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఈ వాస్తు సూత్రాల ప్రకారం మీ వాతావరణాన్ని మెయింటెయిన్ చేయడం వల్ల మీ ఇల్లు శాంతికీ, శ్రేయస్సుకీ మాధ్యమంగా మారుతుంది. సమతుల్యమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఇలా చేస్తే ఇల్లు నిజమైన స్వర్గధామంగా ఉంటుంది.