అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి

hgfghj


స్లాబ్ అంటే ఏమిటి? నిర్మాణంలో ఉపయోగించే వివిధ రకాల స్లాబ్‌లు

మీరు అనుభవజ్ఞుడైన నిర్మాణ నిపుణుడైనా లేదా ఆసక్తిగల ఇంటి యజమాని అయినా, ఈ గైడ్ మీకు సరైన వనరు! ఈ గైడ్‌తో, మీరు నిర్మాణంలో ఉపయోగించే వివిధ రకాల స్లాబ్‌ల గురించి మరియు భవనం డిజైన్ మరియు నిర్మాణంలో వాటిని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి మీరు తెలుసుకోవచ్చు.

Share:


బీమ్‌లపై వన్-వే స్లాబ్‌లు, రిబ్బెడ్ స్లాబ్‌లు, వేఫెల్ స్లాబ్‌లు, ఫ్లాట్ ప్లేట్లు, బబుల్ డెక్ స్లాబ్‌లు మరియు మరిన్ని వంటి అనేక రకాల స్లాబ్‌లు నిర్మాణంలో ఉపయోగించబడతాయి. ప్రతి స్లాబ్ కీ ఉన్న అద్భుతమైన ఫీచర్లు మరియు ప్రయోజనాలూ ఇలా అన్నింటిని గురించీ తెలుసుకుందాం, మరియు వివిధ రకాల భవనాల్లో వాటి ప్రత్యేక అప్లికేషన్‌లను తెలుసుకోండి. ఇది హాయిగా ఉండే నివాస గృహమైనా లేదా బాగా ఎత్తుగా ఉండే వాణిజ్యపరమైన పెద్ద బిల్డింగ్ అయినా, ప్రతి స్లాబ్‌కీ దానివైన సొంత ఉపయోగాలు మరియు ఆచరణాత్మకమైన ఉపయోగాలూ ఉంటాయి.






నిర్మాణంలో స్లాబ్ అంటే ఏమిటి?

నిర్మాణ సందర్భంలో, స్లాబ్ అనేది అంతస్తులు, సీలింగ్ లు, రూఫ్ లను రూపొందించడానికి ఉపయోగించే సమానంగానూ, అడ్డంగానూ, విలక్షణమైన తీరులో పరిచే రీఇన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ పదార్థాన్ని సూచిస్తుంది. స్లాబ్‌లు భవన నిర్మాణంలో ముఖ్యమైన భాగాలలో ఒకటి మరియు గోడలు, నిలువు వరుసలు, బీమ్స్ వంటి ఇతర భవన నిర్మాణ అంశాలకు సపోర్టు చేయడానికి గట్టిదైన, స్థిరమైన ఆధారాన్ని అందిస్తుంది.

నిర్మాణంలో స్లాబ్ రకాలు

నిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించే వివిధ రకాలు, స్లాబ్ పరిధి (స్పాన్), అది మోసే భారాలు, అందుబాటులో ఉన్న పదార్థాలు మరియు వనరులతో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ, అనేక రకాల స్లాబ్‌లు ఉన్నాయి:

  • 1) బీమ్స్ పై వన్-వే స్లాబ్‌లు:

  • ఈ రకమైన స్లాబ్ చిన్న రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ T-బీమ్స్ శ్రేణిని కలిగి ఉంటుంది, క్రమమైన వ్యవధిలో ఖాళీలు మరియు నిలువు వరుసలు లేదా గోడలచే సపోర్ట్ చేయబడుతుంది. T-బీమ్స్ పక్కటెముకలు వలె పని చేస్తాయి, అదనపు దృఢత్వాన్ని అందిస్తాయి, అలాగే అవసరమైన కాంక్రీటు మొత్తాన్ని తగ్గిస్తాయి. బీమ్స్ మధ్య ఖాళీని తేలికపాటి కాంక్రీటు లేదా బోలు బ్లాకులతో నింపవచ్చు, ఇది నిర్మాణం మొత్తం బరువును తగ్గిస్తుంది.
  • 2) వన్-వే జోయిస్ట్ స్లాబ్ (రిబ్డ్ స్లాబ్):

  • ఈ రకమైన స్లాబ్ చిన్న రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ T-బీమ్స్ శ్రేణిని కలిగి ఉంటుంది, క్రమమైన వ్యవధిలో ఖాళీలు మరియు నిలువు వరుసలు లేదా గోడలచే సపోర్ట్ చేయబడుతుంది. T-బీమ్స్ పక్కటెముకలు వలె పని చేస్తాయి, అదనపు దృఢత్వాన్ని అందిస్తాయి, అలాగే అవసరమైన కాంక్రీటు మొత్తాన్ని తగ్గిస్తాయి. బీమ్స్ మధ్య ఖాళీని తేలికపాటి కాంక్రీటు లేదా బోలు బ్లాకులతో నింపవచ్చు, ఇది నిర్మాణం మొత్తం బరువును తగ్గిస్తుంది.
  • 3) వేఫెల్ స్లాబ్ (గ్రిడ్ స్లాబ్):

  • వేఫెల్ స్లాబ్ని గ్రిడ్ స్లాబ్ అని కూడా పిలుస్తారు, ఇది చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకార విరామాలతో కూడిన రెండు వైపులా రీన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ స్లాబ్ గా ఉంటుంది, ఇది వేఫెల్ స్లాబ్ లేదా గ్రిడ్ నమూనాను పోలి ఉంటుంది. ఈ ఖాళీలు లేదా శూన్యాలు దాని బలాన్నీ, దృఢత్వాన్నీ కొనసాగించేటప్పుడు స్లాబ్ బరువును తగ్గిస్తాయి. ఖాళీల మధ్య బీమ్స్ స్టిఫెనర్స్ గా పనిచేస్తాయి, బరువుని నిలువు వరుసలకు బదిలీ చేస్తాయి.
  • 4) ఫ్లాట్ ప్లేట్లు:

  • ఫ్లాట్ ప్లేట్ స్లాబ్ అనేది నిలువు వరుసలు లేదా గోడలపై నేరుగా వచ్చే వన్-వే లేదా టూ-వే రీఇన్‌ఫోర్స్డ్ కాంక్రీట్ స్లాబ్. స్లాబ్ సాధారణంగా సన్నగా ఉంటుంది, అలాగే బీమ్స్ లేదా రిబ్స్ ఉండవు. బరువుల్ని నిరోధించడానికి రెండు దిశలలోనూ రీఇన్‌ఫోర్స్డ్ చేయబడుతుంది. ఫ్లాట్ ప్లేట్ స్లాబ్‌లు నిర్మించడం తేలిక, పైగా తక్కువ ఖర్చుతో సరిపోతుంది.
  • 5) ఫ్లాట్ స్లాబ్‌లు:

  • ఫ్లాట్ స్లాబ్‌లు, ఫ్లాట్ ప్లేట్ స్లాబ్‌ల మాదిరిగానే ఉంటాయి. కానీ స్లాబ్ బలాన్నీ, దృఢత్వాన్నీ పెంచడానికి నిలువు వరుసల చుట్టూ డ్రాప్ ప్యానెల్స్ ఉంటాయి. రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ రెండు దిశలలో అందించబడుతుంది. అలాగే స్లాబ్ నేరుగా నిలువు వరుసలు లేదా గోడలపై మద్దతు ఇస్తుంది.
  • 6) బీమ్స్ పై టూ-వే స్లాబ్‌లు:

  • ఈ స్లాబ్‌లు రెండు దిశలలోని బీమ్స్ ద్వారా సపోర్ట్ చేస్తాయి, రెండు దిశలలో బరువుల్ని నిరోధించడానికి రూపొందించబడ్డాయి. రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ రెండు దిశలలో అందించబడుతుంది. స్లాబ్ సాధారణంగా వన్-వే స్లాబ్‌ల కంటే మందంగా ఉంటుంది.
  • 7) హాలో కోర్ స్లాబ్:

  • హాలో కోర్ స్లాబ్ అనేది స్లాబ్ పొడవు గుండా నడిచే హాలో (బోలు) కోర్స్ తో కూడిన ప్రీకాస్ట్ కాంక్రీట్ స్లాబ్. హాలో కోర్స్ సులభంగా హ్యాండిల్ చేయగలిగేలానూ, రవాణా చేయగలిగేలాగానూ చేసి స్లాబ్ యొక్క బరువును తగ్గిస్తాయి. స్లాబ్ బీమ్స్ లేదా గోడలచే మద్దతు ఇవ్వబడుతుంది మరియు రెండు దిశలలో రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ అందించబడుతుంది.
  • 8) హార్డీ స్లాబ్:

  • హార్డీ స్లాబ్, ప్రొఫైల్డ్ స్టీల్ షీట్ స్లాబ్ అని కూడా పిలుస్తారు, ఇది స్టీల్ షీట్ మరియు కాంక్రీట్ టాపింగ్‌తో తయారు చేయబడిన మిశ్రమ స్లాబ్. స్టీల్ షీట్ నిర్మాణ సమయంలో ఫార్మ్ వర్క్ గానూ, అలాగే కాంక్రీటు గట్టిపడిన తర్వాత టెన్సైల్ (తన్యత) రీఇన్‌ఫోర్స్‌మెంట్‌గానూ పనిచేస్తుంది. కంపోజిట్ స్లాబ్ అధిక బలం- నుంచి-బరువు నిష్పత్తిని కలిగి ఉంటుంది.
  • 9) బబుల్ డెక్ స్లాబ్:

  • బబుల్ డెక్ స్లాబ్ అనేది ఒక రకమైన రెండు వైపులా వేసే కాంక్రీట్ స్లాబ్, ఇది స్లాబ్‌లో చేర్చబడిన బోలు ప్లాస్టిక్ బంతులు లేదా బుడగలు కలిగి ఉంటుంది. ఈ ప్లాస్టిక్ బంతులు రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేయబడతాయి, స్లాబ్‌లో మ్యాట్రిక్స్ నమూనాలో పెట్టబడతాయి. బుడగలు స్లాబ్‌లో అవసరమైన కాంక్రీటు పరిమాణాన్ని తగ్గిస్తాయి. దీనితో స్లాబ్ మరింత తేలికగానూ, మరింత తక్కువ ఖర్చుతోనూ పూర్తవుతుంది. బుడగలు సృష్టించిన ఖాళీలు ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కండ్యూట్‌ల వంటి సేవలకు కూడా ఉపయోగించవచ్చు.
  • 10) కంపోజిట్ స్లాబ్:

  • ఒక కంపోజిట్ స్లాబ్ అనేది అవసరమైన బలాన్నీ, దృఢత్వాన్నీ అందించడానికి కలిసి పనిచేయగల రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కలిపి తయారుచేయబడింది. ఒక విలక్షణమైన కంపోజిట్ స్లాబ్‌లో స్టీల్ డెక్, స్టీల్ రీన్‌ఫోర్స్‌మెంట్, ఇంకా కాంక్రీట్ టాపింగ్ ఉంటాయి. స్టీల్ డెక్ ఒక ఫార్మ్ వర్క్ గానూ, తన్యత రీఇన్‌ఫోర్స్‌మెంట్‌గానూ పనిచేస్తుంది. అయితే కాంక్రీట్ టాపింగ్ కుదింపు (కంప్రెషన్) బలాన్ని అందిస్తుంది.
  • 11) ప్రీకాస్ట్ స్లాబ్:

  • ప్రీకాస్ట్ స్లాబ్‌లు ముందుగా నిర్మించిన కాంక్రీట్ మూలకాలు (ఎలిమెంట్స్). ఇవి ఫ్యాక్టరీలో తయారు చేయబడి నిర్మాణ ప్రదేశానికి రవాణా చేయబడతాయి. ఈ స్లాబ్‌లు వన్-వే లేదా టూ-వే, ఇంకా వివిధ ఆకారాలూ, పరిమాణాలను కలిగి ఉంటాయి. ప్రీకాస్ట్ స్లాబ్‌లు సాధారణంగా బీమ్స్ లేదా గోడలచే సపోర్టు ఇవ్వబడతాయి. అలాగే జాయింటింగ్ సిస్టమ్‌ల ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడతాయి.

 

భవనం డిజైను మరియు నిర్మాణ పరిశ్రమలో పాల్గొనే ఎవరికైనా నిర్మాణంలో ఉపయోగించే వివిధ రకాల స్లాబ్‌లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

 

నిర్మాణంలో స్లాబ్ యొక్క విధులు

భవనాల నిర్మాణంలో స్లాబ్‌లు ఒక ముఖ్యమైన భాగం మరియు అవి వివిధ విధులను నిర్వహిస్తాయి, వీటిలో:

  • ఇతర నిర్మాణ అంశాలకు మద్దతుగా స్థిరమైన ఆధారాన్ని అందించడం.
  • భవనం బరువునీ, దాని కంటెంట్స్ నీ పునాది అంతటా సమానంగా పంపిణీ చేయడం.
  • అంతస్తులు, సీలింగ్ లు మరియు రూఫ్ ల కోసం ఒక స్థాయి ఉపరితలాన్ని(లెవల్ సర్ఫేస్) సృష్టించడం.
  • నేలకీ, గోడ ఫినిష్ లకీ బలమైన స్థిరమైన పునాదిని అందించడం.


ఇది నిర్మాణంలో ఉపయోగించే వివిధ రకాల స్లాబ్‌ల గురించి లోతైన పరిశీలన. ఇది స్లాబ్ అంటే ఏమిటి, అలాగే ఇతర నిర్మాణ అంశాలకు స్థిరమైన పునాదిని అందించడంలో ఇది ఎంత కీలకమైనదో వివరిస్తుంది. ఏదైనా నిర్మాణ ప్రాజెక్ట్ కు సరైన స్లాబ్ టైప్ ని ఎంచుకోవడం చాలా అవసరం. అలాగే స్పాన్, బరువు, బడ్జెట్, నిర్మాణ పద్ధతితో సహా పరిగణించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. ఈ గైడ్ స్లాబ్‌ల గురించి సమగ్ర అవగాహనను పొందడానికీ, అలాగే మీ తర్వాతి ప్రాజెక్ట్ కోసం ఆదర్శవంతమైన స్లాబ్ టైప్ ని ఎంచుకోవడానికి తగిన సమాచారం మీకు తెలియడానికి ఇది సహాయపడుతుంది.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....