Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


బాల్కనీ వాస్తు: మీ అవుట్‌డోర్ స్పేస్‌లో సానుకూల తరంగాలను సృష్టించడం

సమృద్ధి, ఆనందం ఉండేలా చూసుకోవడానికి గృహ ప్రణాళికలో వాస్తు శాస్త్రం ప్రాముఖ్యత చాలా సాధారణం. మీ బాల్కనీ వాస్తుకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Share:


వాస్తు శాస్త్రం ప్రకారం నివాస ప్రదేశాల్లోకి సానుకూల శక్తి రావాలంటే, ప్రకృతి సహజ బలాలైన పంచభూతాలూ, వాస్తు శాస్త్ర అనుకూలత అవసరమని నొక్కి చెబుతుంది. చాలా మంది ఇళ్ల కోసం వాస్తు చిట్కాల గురించి తెలుసుకోవడంపై దృష్టి సారిస్తుండగా, ఈ సూత్రాలను బాల్కనీల వంటి బయటికి కనిపించే ప్రదేశాలకు విస్తరించడం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది. అప్పుడు ఇల్లు మరింత ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారుతుంది, మసిలే చోటు మరింత విస్తరిస్తుంది. వాస్తు సూత్రాల ప్రకారం ఇంటి నిర్మాణం గురించి మీరు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారా? చింతించకండి, మేము మీకు ఈ విషయాలన్నీ తెలియజేస్తాము.



ఈ బ్లాగ్‌లో, మేము బాల్కనీ వాస్తు వివిధ అంశాలను సానుకూల ప్రకంపనలను అందిస్తూ మీ ఔట్‌డోర్‌ పవిత్ర ప్రదేశాన్ని ఎంత సరళంగా మెరుగుపరచవచ్చో విశ్లేషిస్తాము.

 

 



బాల్కనీ కోసం వాస్తు చిట్కాలు

వాస్తు శాస్త్రం ప్రకారం, బాల్కనీతో సహా మీ ఇంటిలో పంచభూత శక్తి ప్రవాహం సమగ్ర శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. మీ ఇంట్లోనూ, బయటి ప్రాంతంలోనూ సామరస్యపూరితమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ఇక్కడ కొన్ని బాల్కనీ వాస్తు చిట్కాలు ఉన్నాయి:

 

1. వాస్తు ప్రకారం స్థానం బాల్కనీ దిశ



మీ బాల్కనీ దిశ, అది ఆకర్షించే శక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దక్షిణం వైపు ఉన్న బాల్కనీ రోజంతా సూర్యరశ్మిని పొందుతుంది, ఇది నులివెచ్చనైన ఉల్లాసభరితమైన చోటుని ఏర్పరస్తుంది. పశ్చిమాభిముఖంగా ఉండే బాల్కనీ మధ్యాహ్నం విశ్రాంతికి అనువైనది, అయితే నైరుతి ముఖంగా ఉండే బాల్కనీ సూర్యకాంతితో బాటు ప్రశాంతతని కూడా అందిస్తుంది. ఈ దిశలు విశ్రాంతి, ధ్యానం లేదా చిన్న సమావేశాలు ఏర్పరుచుకునేందుకు బాల్కనీ ప్రదేశాలకు వీలు కల్పిస్తాయి.

 

2. రూఫింగ్



మీ బాల్కనీ రూఫ్‌ పరిస్థితి నేరుగా దాని వాస్తుని ప్రభావితం చేస్తుంది. బాగా మెయింటెయిన్ చేయబడిన, లీక్ లేకుండా ఉండే రూఫ్‌తో చక్కగా ఆహ్వానం పలికే మంచి వాతావరణానికీ, మెరుగైన బాల్కనీ వాస్తుకీ వీలు కల్పిస్తుంది. అడ్డుపడే లేదా దెబ్బతిన్న రూఫ్‌ శక్తికి అడ్డుకట్ట వేస్తుంది, దీన్ని తప్పకుండా నివారించాల్సి ఉంటుంది. రూఫ్‌ని శుభ్రంగానూ, చెత్త లేకుండానూ ఉంచుకోవాలి.

 

3. బాల్కనీలో లైట్లు



సరైన లైటింగ్ మీ బాల్కనీ ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం కల్పిస్తుంది. ప్రశాంతంగానూ, వెచ్చదనాన్నిచ్చే లైట్లు ఆహ్లాదకరమైన ఆహ్వానించదగిన వాతావరణాన్ని సృష్టిస్తాయి, సాయంత్రం వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి బాల్కనీని సరైన ప్రదేశంగా మారుస్తాయి. మిరుమిట్లు గొలిపే వెలుతురునిచ్చే లైట్లు లేదా కంటికీ మనసుకీ ఇబ్బంది కలిగించే లైట్లను వాడకండి, ఎందుకంటే అవి ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. సోలార్ లేదా పర్యావరణానికి అనుకూలమైన లైటింగ్ ఎంపికలు, ఎనర్జీ-ఎఫిషియంట్‌ గానూ, వాస్తుకు అనుగుణంగానూ ఉంటాయి.

 

4. వాస్తు ప్రకారం బాల్కనీ రంగు



రంగుల ఎంపిక బాల్కనీ శక్తి సంతులనాన్ని ప్రభావితం చేస్తుంది. ఆకుపచ్చ, లేత గోధుమరంగు లేదా లేత పసుపు వంటి మట్టి రంగులు అభివృద్ధినీ, సానుకూలతనీ, సమతుల్యతనీ ప్రతిబింబిస్తాయి. ఈ రంగులు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి, మీ బాల్కనీని విశ్రాంతికీ, చక్కగా ఆలోచించుకోవడానికీ అనువైన ప్రదేశంగా మారుస్తుంది. మీ ఇల్లు బాల్కనీ వాస్తుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి మీరు ఫర్నిచర్, కుషన్స్‌ లేదా వాల్ కలర్స్‌తో సహా మీ డెకార్‌లో ఈ షేడ్స్‌ని చేర్చవచ్చు.

 

5. ఫర్నిచర్



సామరస్యపూరితమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ బాల్కనీలో ఫర్నిచర్ సరైన అలైన్‌మెంట్‌ మరియు ఎంపిక  అవసరం.  ఆ చోటుకి తగ్గట్టు అందంగా ఉండే సౌకర్యవంతమైన, మన్నికైన ఫర్నిచర్ ని ఎంపిక చేసుకోండి. ఎనర్జీ ఫ్లో సులభతరంగా అయ్యేలా చేసి, హాయినీ, ఆహ్లాదాన్నీ పొందే  డిజైన్లను ఎంచుకోండి. మీరు మీ ఇంటి ఔట్‌డోర్‌, ఇన్‌డోర్‌ ఇంటీరియర్స్‌  రెండింటినీ ఆనందించే విధంగా మీ ఫర్నిచర్‌ని ఏర్పాటు చేసుకోండి.

 

బాల్కనీ కోసం అదనపు వాస్తు చిట్కాలు

పైన పేర్కొన్న చిట్కాలతో పాటు, మీ బాల్కనీ సౌందర్యంలో వాస్తు సూత్రాలను చేర్చడానికి ఇక్కడ మరి కొన్ని ఇతర పద్ధతులు ఉన్నాయి:

 

1. పచ్చదనం



మీ బాల్కనీలో మొక్కలు ఏర్పాటు చేసుకోండి, ఇది అందాన్నీ, ఆకర్షణనీ మెరుగుపరచడమే కాకుండా గాలిని శుద్ధి చేస్తుంది, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. మీ బాల్కనీలోకి ఎండ వచ్చే దిశని చూసి అక్కడ పెరిగే మొక్కలను ఎంచుకోండి.

 

2. చిందరవందరగా ఉండే బాల్కనీ



మీ బాల్కనీని శుభ్రంగా ఉంచుకోండి, చిందరవందరగా ఉంచకండి. అనవసరమైన వస్తువులు లేదా పాడై పోయిన వస్తువుల వల్ల శక్తి ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. మీ బాల్కనీలో పాడైన వస్తువుల్ని క్రమం తప్పకుండా తీసి పారేస్తూ ఉండండి, ఒక క్రమ పద్ధతిలో దాన్ని మెయింటెయిన్ చేయండి.

 

3. విండ్ చైమ్స్



మీ బాల్కనీలో ప్రత్యేకించి, అది ఉత్తరం లేదా ఈశాన్య ముఖంగా ఉంటే విండ్ చైమ్స్‌ని వ్రేలాడదీయండి. అవి సృష్టించే సున్నితమైన, శ్రావ్యమైన శబ్దాలు సానుకూల శక్తులను ఆకర్షిస్తాయనీ పర్యావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయనీ నమ్ముతారు.

 

4. వ్యక్తిగత ఇష్టాలకి ప్రాధాన్యత

మీ బాల్కనీని ఆర్ట్‌వర్క్, శిల్పాలు లేదా మీకు సానుకూల ప్రాముఖ్యతనిచ్చే చిహ్నాలు వంటి అర్థవంతమైన అలంకరణ వస్తువులతో మీకు ఇష్టమైన రీతిలో అలంకరించుకోండి.  ఇవి సానుకూల ప్రకంపనల్ని పెంచుతాయి.

 

5. రెగ్యులర్ క్లీన్సింగ్

ప్రతికూల శక్తులను తొలగించడానికి, మెరుగైన బాల్కనీ వాస్తు కోసం తాజాగా, సానుకూలంగా ఉండే వాతావరణాన్ని మెయింటెయిన్ చేయడానికి మీ బాల్కనీని సైంధవ లవణంతో గానీ, అగరవత్తి ధూపంతో గానీ ఎప్పటికప్పుడు శుభ్రపరచండి.

 

వాస్తు ప్రకారం మీ బాల్కనీని ఏర్పాటు చేసుకుంటే మీరు దానిని ప్రశాంతమైన, సానుకూలమైన ప్రదేశంగా మార్చుకోవచ్చు. అది మీకు సంపూర్ణ సమృద్ధిని కలిగిస్తుంది, మిమ్మల్ని ప్రకృతికి సంబంధించిన పంచభూతాల శక్తితో అనుసంధానం చేస్తుంది.  బాల్కనీ వాస్తు కోసం ఉండే అనేక చిట్కాలలో ఇవి కొన్ని మాత్రమే. ఎప్పుడైనా నిపుణుల వద్దకు వెళ్లడం మంచిది, తద్వారా ఈ సూత్రాల్ని మీ ఇంటి ప్రత్యేకతలకు అనుగుణంగా అనుసరించడానికి వీలుంటుంది.



 

మీ బాల్కనీకి వాస్తు సూత్రాలను వర్తింపజేయడం వలన సానుకూలమైన ప్రశాంతమైన ఔట్‌డోర్ రిట్రీట్‌ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రదేశంలో శక్తి ప్రవాహాన్ని ఎలివేట్ చేయడానికి దిశ, రంగులు, లైటింగ్ ఫర్నిచర్ ప్లేస్‌మెంట్ వంటి అంశాలపై దృష్టి పెట్టండి. ఈ వాస్తు చిట్కాలు మీ బాల్కనీని ఆహ్లాదకరమైన విశ్రాంతి ప్రదేశంగానూ, పునరుత్తేజం కలిగించే ప్రదేశంగానూ, సామరస్యపూరితమైన అభయారణ్యంగానూ మార్చడానికి మీకు మార్గనిర్దేశం చేస్తాయి, ప్రకృతి సమృద్ధితో మిమ్మల్ని కలుపుతాయి. ఈ బాల్కనీ వాస్తు చిట్కాలను మీ ఇష్టం మరియు సౌలభ్యం ప్రకారం అనుసరించవచ్చు. మీరు అలాంటి వాస్తు సూత్రాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, మా ఇంటి వాస్తు చిట్కాలు బ్లాగులో చూడండి.



సంబంధిత కథనాలు



సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....