వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి



ఈ తూర్పు ముఖంగా ఉన్న ఇళ్ల వాస్తు ప్లాన్‌లతో సౌభాగ్యవంతమైన ఇంటిని నిర్మించండి.

మన జీవితాల్లో శాంతినీ, సమతుల్యతనీ తీసుకురావడానికి వాస్తు కీలకమైనది. తూర్పు ముఖంగా ఉండే ఇంటి వాస్తు ప్లాన్‌ని రూపొందించడంలో పనికి వచ్చే చిట్కాలను తెలుసుకోండి. ఈ ప్లాన్, రంగు, అద్దాలు పెట్టాల్సిన చోటు, పంచభూతాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇంటి శక్తినీ, సామరస్యతనీ మరింతగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Share:


వాస్తుకి సంబంధించి తూర్పుదిక్కుకి ఉండే ఇల్లు అనేది కేవలం ఒక భౌగోళిక దిశకు సంబంధించిన అంశం కాదు; ఇది ఒక నివాస స్థలంలో శక్తి, శ్రేయస్సునీ, శాంతినీ పెంపొందించడానికి పునాది. ముఖ్యమైన దిశలలో, అందులోనూ ప్రత్యేకించి వాస్తు శాస్త్రం, ప్రాచీన జ్ఞానాన్ని అనుసరించి రూపొందించినప్పుడు తూర్పు ముఖంగా ఉండే గృహాలు ప్రత్యేకంగా ఉంటాయి.

 

ఈ బ్లాగ్ వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా ఉండే ఇంటి ప్లాన్‌ల ప్రత్యేకతలను లోతుగా పరిశీలిస్తుంది. శతాబ్దాల నాటి సూత్రాల ప్రకారం, సహజ ప్రపంచం, సమృద్ధి, ఆశీర్వాదాలతో ఇంట్లో నివసించే వ్యక్తుల కోసం అలాంటి దిశలను ఎలా ఆప్టిమైజ్ చేయవచ్చో ప్రతిపాదిస్తుంది.

 

 



ముఖ్యంగా చూడాల్సిన విషయాలు

 

  • తూర్పు ముఖంగా ఉన్న ఇళ్ళు సూర్యుని ప్రారంభ కాంతిని వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా ఉంచబడ్డాయి, ఆరోగ్యం, శ్రేయస్సు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించే శక్తినీ, సమృద్ధమైన వాతావరణాన్నీ అందిస్తుంది.

 

  • వాస్తు ప్రకారం ఇంటి లేఅవుట్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేయడం వల్ల ఇంట్లో సానుకూలత బాగా పెరుగుతుంది.

 

  • ఉండవలసిన పరిస్థితులన్నీ కూడా, సమతుల్యతను కాపాడుకోవడానికి సానుకూలతను ఆహ్వానించడానికి వాస్తు రంగులు, వ్యూహాత్మక అద్దాల ప్లేస్‌మెంట్‌లు సహజ అంశాలను చేర్చడం వంటి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. 

వాస్తు శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం

వాస్తు శాస్త్రం అనేది ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రం అంతరిక్ష ప్లాన్‌, ఇది ప్రకృతికి అనుగుణంగా భవనాల డిజైన్‌ నిర్మాణానికి మార్గనిర్దేశం చేస్తుంది. దీని సూత్రాలు దిశలు, జ్యామెట్రీ, సిమెట్రీల  ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. వాస్తు  ప్రధాన లక్ష్యం, సానుకూలత, శ్రేయస్సుతో అలరారే ప్రదేశాల్ని క్రియేట్ చేయడానికి రూపం ఎనర్జీ మధ్య డైనమిక్ సమతుల్యతని క్రియేట్ చేయడం. 


తూర్పు ముఖంగా ఉండే ఇంటి వాస్తు ప్లాన్ కి సంబంధించిన ముఖ్యమైన ఫీచర్లు

వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా ఉండే ఇంటిని డిజైన్ చేయడంలో ప్రతి ఎలిమెంట్ కూడా ఈ ప్రాచీన జ్ఞానానికీ, సూత్రాలకీ అనుగుణంగా ఉండేలా అత్యంత ఖచ్చితమైన ప్లాన్‌ని కలిగి ఉంటుంది. తూర్పు ముఖంగా ఉండే ఇళ్ల కోసం వాస్తులో పరిగణించవలసి అంశాలు ఇక్కడ ఉన్నాయి:

 

1) ప్రవేశ ద్వారం మరియు ప్రధాన ద్వారం



ప్రధాన ద్వారం తూర్పు వైపు ఐదవ పాదం (భాగం)లో ఆదర్శంగా ఉంచాలి. ఇక్కడ ఉంటే ప్రధాన ద్వారం శ్రేయస్సునీ ఆనందాన్నీ తెస్తుంది.

 

2) లివింగ్ రూమ్



ఇంటిలో కమ్యూనికేషన్ సంబంధాలను మెరుగుపరచడానికి ఈశాన్య విభాగంలో లివింగ్ రూమ్‌ను ఏర్పాటు చేయండి.

 

3) వంటగది



ఆగ్నేయ మూలలో వంటగదికి ఖచ్చితంగా సరిపోతుంది, ఎందుకంటే ఇది అగ్ని  ద్వారా నిర్వహించబడుతుంది.

 

4) మాస్టర్ బెడ్ రూమ్



స్థిరత్వాన్నీ, బలాన్నీ కలుగజేయడానికి ఇంటి నైరుతి ప్రాంతంలో మాస్టర్ బెడ్ రూమ్ ఉండాలని సిఫార్సు చేయబడింది.

 

5) పిల్లల గది



వాయువ్యంలో పిల్లల పడక గదులు ఉండడం వల్ల వారి ఏకాగ్రతకీ, విజయానికీ దోహదపడుతుంది.

 

6) పూజా గది/ధ్యానం కోసం స్థలం



ఈశాన్యం అత్యంత నిర్మలమైన స్వచ్ఛమైన ప్రాంతం, పూజ గదికి లేదా ధ్యానం చేయడానికి అనువైన ప్రదేశం.


వివిధ ప్లాట్ సైజుల కోసం తూర్పు ముఖంగా ఉండే ఇంటి వాస్తు ప్లాన్

వివిధ ప్లాట్ పరిమాణాలకు వాస్తు అనుకూలత, దాని సూత్రాలకు కట్టుబడి డిజైన్‌లో ఫ్లెక్సిబిలిటీకి వీలు కల్పిస్తుంది. వాస్తు అనుకూలత గల ఇంటిని తయారుచేయడానికి వివిధ ప్లాట్ కొలతలు ఎలా ఉపయోగిస్తాయో చూద్దాం.

 

1) 30x40 తూర్పు ముఖంగా ఉండే ఇంటి వాస్తు ప్లాన్

30x40 తూర్పు ముఖంగా ఉన్న ఇంటి వాస్తు ప్లాన్ విస్తారమైన నివాస స్థలంతో కాంపాక్ట్‌నెస్‌ను బ్యాలెన్స్ చేస్తుందని గృహ యజమానులు దీన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. వాస్తు నిర్దేశించిన విధంగా ప్రధాన ద్వారం, నివాస స్థలాలు, ప్రైవేట్ క్వార్టర్‌లు ప్రధాన దిక్కుల (కార్డినల్ డైరెక్షన్స్) కు అనుగుణంగా ఉండేలా లేఅవుట్‌ను రూపొందించడం కీలకం.

 

2) 30x60 తూర్పు ముఖంగా ఉండే ఇంటి వాస్తు ప్లాన్

సాపేక్షంగా సన్నగా పొడవాటి ప్లాట్లు ఉన్నవారికి, 30x60 హౌస్ ప్లాన్ తూర్పు ముఖంగా విస్తరించిన లేఅవుట్‌ను అందిస్తుంది, ఇది విశాలమైన ముందు యార్డ్ లేదా గార్డెన్‌ను వీలు కల్పిస్తుంది. వాస్తుకు అనుగుణంగా, ప్రధాన ద్వారం, వంటగది, మాస్టర్ బెడ్‌రూమ్ వంటి గదులు సానుకూల వైబ్రేషన్స్ తో తీర్చిదిద్దబడేలా చూసుకోండి.

 

3) 40x60 తూర్పు ముఖంగా ఉండే ఇంటి వాస్తు ప్లాన్

40x60 హౌస్ ప్లాన్ తూర్పు ముఖంగా పెద్ద, విలాసవంతమైన ఇంటిని నిర్మించాలనుకునే వారికి బాగా సరిపోతుంది. వాస్తు జ్ఞానంతో, అటువంటి గొప్ప ప్రదేశాలు కూడా ప్రశాంతత, సంపద మంచి ఆరోగ్యాన్ని పెంపొందించగలవు, ప్రవేశద్వారం నుండి పెరడు వరకు ప్రతి ప్రాంతమూ ఒక నిర్దిష్ట ప్రయోజనాన్నీ, దిశనీ దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది.


వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా ఉన్న ఇంటి కోసం చేయవలసినవీ, చేయకూడనివీ

 

తూర్పు ముఖంగా ఉండే ఇంటి ప్లాన్‌ కి చేయవలసినవి 

 

  • ప్రధాన ద్వారం ఇంట్లో ఉండే అన్ని తలుపుల్లోకీ అతి పెద్దగా ఉండే ద్వారంగా ఉండేలా చూడండి.
  • సూర్యరశ్మి లోపలికి రావడానికి తూర్పు వైపున ఎక్కువగా కిటికీలు అమర్చండి.
  • దైవిక శక్తి ప్రవాహాన్ని నిర్ధారించడానికి ఈశాన్యం మూల ఎలాంటి చెత్తా లేకుండా చూడండి, వాటిని తెరిచి ఉంచండి.

 

తూర్పు ముఖంగా ఉండే ఇంటి ప్లాన్‌లో చేయకూడనివి

 

  • వంటగదిని నేరుగా ఈశాన్యంలో పెట్టకుండా చూడండి, ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
  • ఈశాన్య మూలలో మెట్లు ఉండకూడదు, అది ఆర్థిక నష్టాలకు దారి తీస్తుంది.
  • ఆరోగ్యంపైనా, శ్రేయస్సుపైనా ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈశాన్యం, నైరుతి మూలల్లో టాయిలెట్లు పెట్టకండి.

వాస్తు శాస్త్రంలో తూర్పు ముఖంగా ఉన్న ఇంటి ప్రాముఖ్యత

వాస్తు శాస్త్రంలో తూర్పు ముఖంగా ఉన్న ఇళ్ళు సూర్యుని తొలి కిరణాలు ప్రసరించే దిశగా ఉండడం వల్ల శుభప్రదంగా పరిగణించబడతాయి. తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ద్వారం సానుకూల శక్తి, విజయాన్నీ సంపదనీ ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఉషోదయపు సూర్యకాంతిలో పుష్కలంగా లభించే విటమిన్ డి, సమస్త గృహానికీ అందుతుంది, ఇంట్లో నివసించేవారి ఆరోగ్యం, శ్రేయస్సు బాగుంటుంది. తూర్పు ముఖంగా ఉన్న ఇంటి వాస్తు ప్లాన్‌ని కలిగి ఉండటం వల్ల ఇంట్లో నివసించే వారికి ప్రయోజనం చేకూరుతుంది:

 

1) వివేచన చిహ్నం

తూర్పు దిశ సూర్యోదయంతో ముడిపడి ఉంటుంది. ఇది కాంతి, జ్ఞానం ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతీక. తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లు ఈ శక్తిని ఉపయోగించుకుంటాయని నమ్ముతారు, ఈ ఇళ్లల్లో నివసించేవారి శక్తి పెరుగుతుంది, అవి మంచి జ్ఞానంతో, స్పష్టతతో మెలిగేందుకు ఇది దోహదం చేస్తుంది.

 

2) పాజిటివ్ ఎనర్జీ తెచ్చే విషయం

వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు ముఖంగా ఉన్న ప్రవేశాలు శుభప్రదమైనవిగా భావించబడుతున్నాయి, ఇంటికి సానుకూల వైబ్‌లను ఆహ్వానిస్తాయి. ఇది పాక్షికంగా ఉదయాన్నే సూర్య కిరణాల వల్ల వస్తుంది, ఇది ఇంటిలోపలి వాతావరణాన్ని శుద్ధి చేస్తుందనీ, సానుకూలతను తీసుకువస్తుందనీ నమ్ముతారు.

 

3) ఆరోగ్యానికీ, శ్రేయస్సుకీ ప్రవేశద్వారం

తూర్పు ముఖంగా ఉన్న ఇంటిలోకి ప్రవేశించే ఉదయపు సూర్యకాంతి కేవలం కాంతి మాత్రమే కాదు; ఇందులో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది, ఇంట్లో నివసించేవారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది కీలకమైనది. అంతే కాకుండా మంచి కాంతినిచ్చే ప్రకాశవంతంగా ఉండే లైట్ ధైర్యాన్నీ, ఉత్పాదకతనీ, ఆర్థిక విజయాన్నీ మరింతగా పెంచుతుందని అందరూ నమ్ముతారు.

 

4) సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం

తూర్పు దిశ కూడా సామాజిక సంబంధాలతో ముడిపడి ఉంది. ఈ దిశను ఎదుర్కొంటున్న గృహాలు నివాసితుల మధ్య వారి విస్తృత కమ్యూనిటీతో సామరస్యాన్ని పెంపొందించుకుంటాయి, సామాజిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయి.

 

5) పెరుగుతున్న కుటుంబాలకు అనుకూలమైనది

తూర్పు ముఖంగా ఉండే ఇల్లు మంచి ఎదుగుదల, జీవశక్తికి అనుబంధం ఉన్నందున యువ జంటలు లేదా పెరుగుతున్న కుటుంబాలకు తరచుగా సిఫార్సు చేయబడుతుంది. దాని యువ సభ్యుల అభివృద్ధికీ, శ్రేయస్సుకీ సానుకూలంగా ఉంటుంది.


వాస్తు సవాళ్లను అధిగమించడం

స్థలం పరిమితంగా ఉండే నిర్దిష్ట వాతావరణాలలో మీ ఇంటిని వాస్తు శాస్త్రం ప్రకారం సంపూర్ణంగా అమర్చడం ఎల్లప్పుడూ సాధ్యపడదు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఇప్పటికీ కొన్ని సర్దుబాట్లతో మీ నివాస స్థలంలో సామరస్యతనీ, సానుకూల శక్తినీ ఆహ్వానించవచ్చు:

 

1) వాస్తు అనుకూల వర్ణాలు ఎంచుకోండి

ప్రశాంతతను తీసుకురావడానికీ, వాస్తు వైబ్రేషన్స్‌ని నిరంతరం పనిచేసేలా ఉంచడానికీ, ఇంటి ఇంటీరియర్స్ కోసం నీలం, ఆకుపచ్చ తెలుపు వంటి లేత రంగులను ఎంచుకోండి.

 

2) వ్యూహాత్మకంగా ఉండాల్సిన అద్దం స్థానం 

ఉత్తర తూర్పు గోడలపై అద్దాలను వేలాడదీయండి. ఇది ఖాళీ ఉన్నట్టు భ్రమని సృష్టించగలదు. మీ ఇంటి ద్వారా ప్రసరించే సానుకూల శక్తిని ఇది మరింతగా పెంచుతుందని నమ్ముతారు.

 

3) ప్రకృతిని కూడా కలుపుకోండి

ఈశాన్య మూలలో మొక్కలు, చిన్న ఫౌంటెన్ వంటి వాటర్ ఫీచర్స్‌ పెడితే మీ పట్టణ నివాసాన్ని వాస్తు సూత్రాలకు అనుగుణంగా ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

 

ఈ సూక్ష్మమైన నివారణలు స్థలాన్నీ, శక్తినీ గణనీయంగా ప్రభావితం చేయగలవు. పట్టణంలో ఉండే చాలా ఇళ్లు కూడా వాస్తుని అందించడానికి ఉద్దేశించిన సమతుల్యతని నిర్ధారిస్తుంది.



వీలైనంత ఎక్కువగా తూర్పు ముఖంగా ఉన్న ఇంటి వాస్తు ప్లాన్‌లను అనుసరిస్తే, మీకు అనేక విధాలుగా మంచి జరిగేలా మీకు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారని అర్థం. ఉదయాన్నే సూర్యరశ్మిని పొందడం నుండి సానుకూల వైబ్రేషన్లను ఆహ్వానించడం వరకు మీ ఇంటిని నివసించడానికి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన ప్రదేశంగా మార్చడం వాస్తు సలహాను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మీరు మీ తూర్పు ముఖంగా ఉన్న ఇంటిని ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు మూలంగా మార్చుకోవచ్చు.



సంబంధిత కథనాలు



సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....