ఎర్ర ఇటుక అంటే ఏమిటి?
ఎర్ర ఇటుక, మట్టి ఇటుక అని కూడా పిలుస్తారు, ఇది సహజమైన బంకమట్టితో తయారు చేయబడిన ఒక రకమైన నిర్మాణ సామగ్రి, ఇది దీర్ఘచతురస్రాకార ఆకారాలుగా తయారు చేసిన తర్వాత వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద బట్టీలో కాల్చడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే అత్యంత ప్రాచీన సాంప్రదాయ నిర్మాణ సామగ్రిలో ఒకటి
ఫ్లై యాష్ బ్రిక్స్ vs రెడ్ బ్రిక్స్
రెండు రకాల ఇటుకలకు వాటి స్వంత ప్రయోజనాలు అప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఫ్లై యాష్ ఇటుకలు ఎర్ర ఇటుకలలో చాలా పెద్ద వ్యత్యాసం ఉంది.
1. కూర్పు (కంపోజిషన్)
ఫ్లై యాష్ ఇటుకలను పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు, ఫ్లై యాష్ ప్రధానంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుండి పొందిన బూడిద. ఈ వ్యర్థ పదార్థాన్ని సిమెంట్, ఇసుక నీటితో కలిపి పేస్ట్ గా తయారు చేస్తారు, తర్వాత దానిని అచ్చు ఇటుకలను తయారు చేయడానికి సిద్దం చేస్తారు. మరోవైపు, ఎర్ర ఇటుకలను మట్టితో తయారు చేస్తారు, ఇది అనేక ప్రాంతాలలో సమృద్ధిగా లభించే సహజ వనరు. మట్టిని నీటిలో కలిపి, ఇటుక ఆకారాలుగా మలిచి, వాటిని గట్టిపడేలా బట్టీల్లో కాల్చుతారు.
2. ఇన్సులేషన్
ఫ్లై యాష్ ఇటుకలు పరిమిత థర్మల్ ఇన్సులేషన్ లక్షణాలను కలిగి ఉంటాయి చల్లని వాతావరణంలో వేడిని సమర్థవంతంగా నిలుపుకోలేవు. దీనికి విరుద్ధంగా, ఎర్ర ఇటుకలు వాటి అధిక సాంద్రత, తక్కువ ఉష్ణ వాహకత కారణంగా ధ్వని, ఉష్ణ - ఈ రెండు రకాల ఇన్సులేషన్ నీ అందిస్తాయి. ఉష్ణోగ్రత నియంత్రణ శబ్దం తగ్గింపు ముఖ్యమైన అంశాలుగా ఉండే పరిసరాలకు ఇది ఎర్ర ఇటుకలను ఉత్తమ ఎంపికగా చేస్తుంది.
3. ఉపరితలం
ఫ్లై యాష్ ఇటుకలు మృదువైన ఉపరితల ముగింపును అందిస్తాయి, ప్లాస్టరింగ్ అవసరాన్ని తొలగిస్తాయి. వాటి నునుపైన ఆకారం అందంగానూ, ఆకర్షణగానూ ఉంటుంది. నిర్మాణ సమయంలో అయ్యే మొత్తం వ్యయాన్ని బాగా తగ్గిస్తుంది. అయితే, ఎర్ర ఇటుకల విషయంలో సాధారణంగా నునుపుగా ఉండే సంపూర్ణ రూపాన్ని అందించడానికి ప్లాస్టరింగ్ అవసరం.
4. సాంద్రత
ఎర్ర ఇటుకలతో పోలిస్తే ఫ్లై యాష్ ఇటుకలు తేలికైనవి. తేలికైన పదార్థం అయిన ఫ్లై యాష్‌ని తయారీ ప్రక్రియలో చేర్చడం వల్ల ఫ్లై యాష్ ఇటుకల మొత్తం సాంద్రత తగ్గుతుంది. ఈ తేలికైన స్వభావం నిర్మాణ సమయంలో వాటిని నిర్వహించడానికి, రవాణా చేయడానికి ఇన్‌స్టాల్ చేయడానికి సులభతరం చేస్తుంది. కానీ, ఉపయోగించిన మట్టి కారణంగా ఎర్ర ఇటుకలు భారీగానూ, దట్టంగానూ ఉంటాయి. ఎర్ర ఇటుకల అధిక సాంద్రత వల్ల వాటిని ఉపయోగించిన నిర్మాణాలకు అదనపు బలాన్నీ, నిలకడదనాన్నీ అందిస్తాయి.
5. సంపీడన బలం
ఎర్ర ఇటుకలు వాటి బలం మన్నికకు ప్రసిద్ధి చెందాయి. ఫ్లై యాష్ బ్రిక్స్‌తో పోలిస్తే ఇవి అధిక సంపీడన (కంప్రెసివ్) బలాన్ని కలిగి ఉంటాయి, ఇవి బరువులు మోసే సందర్భంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. ఎర్ర ఇటుకలకి ఉండే అధిక బలం వాటి రూపాన్ని చెడిపోకుండానూ, అవి బరువులు మోయడంలో ఎన్నడూ విఫలం కాకుండానూ చేసి, భారీ బరువుల్ని తట్టుకునేలా చేస్తుంది. ఎర్ర ఇటుకలతో పోలిస్తే ఫ్లై యాష్ ఇటుకలు తక్కువ సంపీడన శక్తిని కలిగి ఉంటాయి, కానీ అవి ఇప్పటికీ అనేక నిర్మాణ ప్రయోజనాల కోసం వాడేందుకు తగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
6. నీటి శోషణ
ఎర్ర ఇటుకలతో పోలిస్తే ఫ్లై యాష్ ఇటుకలు అధిక నీటి శోషణ రేటును కలిగి ఉంటాయి. ఫ్లై యాష్ ఇటుకల్లో ఉండే సన్నని రంధ్రాల వల్లా, కణాలన్నీ సరియైన స్థితిలో ఉండడం వల్లా, నీటి శోషణ గుణం పెరుగుతుంది. ఈ అధికంగా నీటి శోషణ స్వభావం కలిగిన ఫ్లై యాష్ ఇటుకలను సరిగా కాపాడుకోకపోతే లేదా వాటర్‌ప్రూఫ్ చేయకపోతే ఎఫ్లోరేసెన్స్ మరియు స్పాలింగ్ వంటి తేమ-సంబంధిత సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎర్ర ఇటుకలు, వాటి బలమైన నిర్మాణంతో సాధారణంగా నీటి శోషణ రేటు తక్కువగా ఉంటుంది. తేమ సంబంధిత సమస్యలకు తక్కువ అవకాశం ఉంటుంది.
7. సొంత బరువు
ఎర్ర ఇటుకల కంటే ఫ్లై యాష్ ఇటుకలు చాలా తేలికగా ఉంటాయి. ఫ్లై యాష్ బ్రిక్స్ కి ఉండే తేలికపాటి స్వభావం నిర్మాణ సమయంలో వాటిని నిర్వహించడానికీ, రవాణా చేయడానికీ ఇన్‌స్టాల్ చేయడానికీ బాగా వీలు ఉంటుంది. ఎర్ర ఇటుకలు, బరువైనవి, రవాణా, సంస్థాపన (ఇన్‌స్టలేషన్) కోసం మరింత పని, శ్రమ అవసరం. ఫ్లై యాష్ బ్రిక్స్ కీ, రెడ్ బ్రిక్స్ కీ మధ్య బరువు పరంగా చూస్తే ఫ్లై యాష్ బ్రిక్స్ ని ఎంచుకోవడమే తెలివైన పని.
ఈ వివరణలు ఫ్లై యాష్ ఇటుకలు ఎర్ర ఇటుకల మధ్య తేడాల గురించి లోతైన అవగాహనను అందిస్తాయి, వాటి లక్షణాలు, రూపాలు నిర్మాణ ప్రాజెక్టులలో వచ్చే అవకాశం ఉన్న చిక్కులను హైలైట్ చేస్తాయి.