Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
వాస్తు శాస్త్రం ప్రకారం, ఉత్తరం అనేది సంపదల దైవం కుబేరుడి దిశ. ఉత్తరం వైపు ఉన్న గృహాలు శ్రేయస్సునీ, సమృద్ధినీ ఆకర్షిస్తాయని నమ్ముతారు. ఉత్తర ధ్రువం నుండి వెలువడే అయస్కాంత శక్తి ఇంట్లోకి సానుకూలతనీ, శక్తినీ ప్రసారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కారణాల వల్ల చాలా మంది ప్రజలు తమ ఇంటికి ఉత్తరం వైపు ఉన్న ఇంటి ప్లాన్‌ను ఎంచుకుంటారు.
ఇంటి శక్తికి ప్రవేశ ద్వారం, ఉత్తరం వైపు ఉన్న ఇంటి ప్రవేశ ద్వారం, ఆదర్శంగా ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. సానుకూల శక్తి ఇంట్లోకి స్వేచ్ఛగా ప్రవహించే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ఇది పరిగణించబడుతుంది. వర్ణపరంగా ఆకుపచ్చ లేదా నీలం వంటి శక్తివంతమైన రంగులను ఉపయోగించడం ద్వారా ప్రవేశ ద్వారం శుభాన్ని పెంచుతుంది.
ఈశాన్య మూల అనేది ఉత్తరం వైపు ఉన్న ఇంట్లో లివింగ్ రూమ్‌కి ఉత్తమమైన ప్రదేశం, ఎందుకంటే ఈ దిశ మానసికంగా స్పష్టతతో ఉండేటట్లు చేస్తుంది, సామాజిక సమావేశాలకు వీలుగా ఉంటుంది. ఉత్తరం వైపున ఉన్న ఇంటి వాస్తులో మీరు గదిలో పశ్చిమ లేదా నైరుతి మూలలో ఫర్నిచర్ పెట్టేలా చూడండి. ఇది స్థిరత్వాన్ని పెంచడానికీ, ఇది లివింగ్ ఏరియా వినియోగాన్ని పెంచుతుంది. సాఫ్ట్ పేస్టల్స్, మట్టి రంగులు సంతులితమైన, సామరస్యపూరితమైన వైబ్స్‌ని క్రియేట్ చేస్తాయి.
ఆగ్నేయ మూల వంటగదికి అనువైనది, ఎందుకంటే ఇది అగ్ని లేదా పంచభూతాల్లో అగ్ని ఉండాల్సిన స్థానం. వంట చేసేటప్పుడు, ఎక్కువ ప్రయోజనాల కోసం వ్యక్తి తూర్పు ముఖంగా ఉండాలి. రిఫ్రిజిరేటర్ స్థానం నైరుతిలో ఉండాలి; నీరు, నిప్పు ఒకదానికొకటి వ్యతిరేకం కాబట్టి సింక్, స్టవ్ వేర్వేరు చోట్ల ఉండాలి. అగ్నిని ప్రతిబింబించే పసుపు, నారింజ లేదా ఎరుపు వంటి ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించండి.
శాంతి గ్రౌండింగ్‌ని నిర్ధారించడానికి మీ పడకగది దక్షిణ దిశ లేదా నైరుతి దిశలో ఉండడం చాలా మంచిది. పడుకునేటప్పుడు, తల దక్షిణం వైపు ఉండే విధంగా మంచం వేయాలి. సాధారణంగా ఉత్తరం వైపు ఉండే ఇంటి వాస్తు కోసం ఒక ఇంటి ప్లాన్‌లో, పడకగదిలో తటస్థంగా గానీ లేదా మట్టి రంగులు గానీ వేస్తే ప్రశాంతంగా ఉంటుంది, అది ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదం చేస్తుంది.
బాత్‌రూమ్ లేదా టాయిలెట్ ఇంటి పశ్చిమ లేదా వాయువ్య భాగంలో ఉండాలి, అయితే అది నేరుగా ఈశాన్య మూలలో లేదని నిర్ధారించుకోవాలి, ఎందుకంటే ఇది సానుకూల శక్తిని దూరం చేస్తుంది. ఇంటి నుండి ప్రతికూల శక్తుల ప్రవాహాన్ని సులభతరం చేస్తూ డ్రైనేజీ లేదా వాటర్ అవుట్‌లెట్‌లను ఈశాన్య దిశలో ఉంచాలి.
ప్రాపర్టీలో ఈశాన్య భాగం తోటకి సరైనది, ఎందుకంటే ఇది ఉషోదయ సూర్యకాంతిని ఇంట్లోకి పంపించడానికి సహాయపడుతుంది. అదృష్టాన్ని తెస్తుందని నమ్మే తులసి లేదా వెదురు వంటి వాస్తు మొక్కలను సెలెక్ట్ చేసుకోండి. ఉత్తరం తూర్పు దిశల్లో పెద్ద చెట్లు లేకుండా చూసుకోవడం మంచిది, ఎందుకంటే అవి సానుకూల శక్తిని హరిస్తాయి.
పొరపాటు: ప్రధాన ప్రవేశ ద్వారం ఉండకూడని స్థానంలో ఉండడం లేదా దానికి ఆటంకం ఉండడం
దిద్దుబాటు: చిందరవందరగా ఉన్న ప్రాంతాన్ని క్లియర్ చేసి ఉత్తరం లేదా ఈశాన్యంలో ఉండేలా చూడడానికి అవసరమైతే ప్రవేశ ద్వారాన్ని తిరిగి పెట్టండి.
పొరపాటు: ప్రవేశం భౌతికంగా గానీ లేదా కనిపించకుండా నిరోధించబడింది.
దిద్దుబాటు: ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగించే ఏవైనా అడ్డంకుల్ని తొలగించండి.
పొరపాటు: ఈశాన్యం వంటి వాస్తుకు అనుగుణంగా లేని ప్రాంతాల్లో వంటగదిని ఉంచారు.
దిద్దుబాటు: వంటగదిని ఇంటి ఆగ్నేయ భాగానికి అనుగుణంగా ఉంచండి, వంట చేసే సమయంలో వంట చేసే వ్యక్తి తూర్పు వైపు ఉండేలా చూడండి.
పొరపాటు: ఉండకూడని చోట ఉన్న బాత్‌రూమ్ మరియు టాయిలెట్ ప్రతికూల శక్తిని విడుదల చేయవచ్చు.
దిద్దుబాటు: సానుకూలత ప్రవాహాన్ని నిర్వహించడానికి వీటిని పశ్చిమ లేదా వాయువ్య దిశల్లో ఏర్పాటు చేయడానికి వాస్తును అనుసరించండి.
పొరపాటు: వాస్తు సూత్రాలకు అనుగుణంగా లేని రంగులను ఉపయోగించడం.
దిద్దుబాటు: సానుకూల శక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడానికి వాస్తు-సిఫార్సు చేసిన నీలి లేదా ఆకుపచ్చ వంటి రంగులతో గోడలను పెయింట్ చేయండి.
ఈ సాధారణ తప్పులను కొంచెం ఆలోచించి సరిదిద్దితే, ఉత్తరం వైపు ఉండే ఇంటి ప్లాన్, సామరస్యపూర్వకంగా ఉండే జీవన వాతావరణాన్ని ఏర్పరచి వాస్తు సూత్రాలతో మెరుగ్గా అలైన్ చేయగలదు.
మీ ఇంటిని ఉత్తరం వైపు ఉన్న ఇంటి వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసేటప్పుడు, మీ ప్లాట్ సైజు స్థలం, లేఅవుట్ అరేంజ్‌మెంట్‌ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. వాస్తు శాస్త్రానికి కట్టుబడి వివిధ ప్లాట్ సైజుల కోసం సమర్ధవంతంగా ఎలా ప్లాన్ చేయాలో ఇక్కడ ఇవ్వబడింది:
ప్లాట్ సైజుతో సంబంధం లేకుండా, ఉత్తరం వైపు వాస్తు కోసం ఒక ఇంటి ప్లాన్ ప్రధానంగా ప్రవేశ ద్వారం ప్రదేశంపై దృష్టి పెట్టాలి. ఇది ఈశాన్య జోన్‌లో సానుకూలంగా ఉందని నిర్ధారించుకోండి.
ఉత్తరాభిముఖంగా ఉన్న ఒక ప్రామాణిక 30x40 ఇంటి ప్లాన్ కోసం, స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం కీలకమైన అంశం. డిజైన్‌లో ఈశాన్యంలో బాగా వెలుతురు ఉండే లివింగ్ ఏరియా, దక్షిణ, పడమర దిశల్లో పడక గదులు ఉండాలి, స్థలం వృథా కాకుండా ఉండేందుకు చిన్న కారిడార్లు ఏర్పాటు చేసుకోవాలి.
40x50 హౌస్ ప్లాన్ నార్త్-ఫేసింగ్ ప్లాట్‌లో క్లిష్టమైన డిజైన్ ఎలిమెంట్స్ కోసం ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. ఇంటిని సమర్థవంతంగా విభజించడానికి వాస్తును ఉపయోగించవచ్చు, దీనిలో ఈశాన్యంలో విశాలమైన ప్రాంగణాలు లేదా తోటలు వేసుకోచవచ్చు, నైరుతిలో భారీ నిర్మాణాలను నిర్మించవచ్చు.
కాంపాక్ట్ 30x30 హౌస్ ప్లాన్‌లు ఉత్తరం వైపు ఉన్న ప్లాట్‌లలో, స్పేస్ యుటిలిటీని పెంచే నిర్మాణ అంశాలపై దృష్టి కేంద్రీకరించబడింది. సానుకూలతను పెంచుకోవడానికి ఈశాన్య మూలను ధ్యానం లేదా పూజ గదికి అనువుగా చేయండి, మల్టీ ఫంక్షనల్ ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవడానికి చూడండి.
ఉత్తరం వైపు వాస్తు కోసం ఈ ఇంటి ప్లాన్ సమతుల్య వాస్తు లేఅవుట్‌కు పుష్కలమైన అవకాశాన్ని అందిస్తుంది. మీరు ఉత్తర దిశలో ఆకర్షణీయమైన ప్రవేశాన్ని ప్లాన్ చేసుకోవచ్చు, వాస్తు మార్గదర్శకాల ప్రకారం లివింగ్ మరియు నిద్రించే గదులను ఏర్పాటు చేసుకోవచ్చు, సరైన ఎనర్జీ ఫ్లో జరగడానికి వంటగదిని ఆగ్నేయ దిశలో ఉంచవచ్చు.
చివరిగా చెప్పేదేమంటే, వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఉత్తరం వైపు ఇంటిని సిద్ధం చేయడం అనేది సానుకూలత, సామరస్యత, శ్రేయస్సును ప్రసరింపజేసే నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా వేసే ఒక ముందడుగు. ఉత్తరం వైపు ఉన్న ఇంటికి ఈ వాస్తు మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా ఎటువంటి పొరపాట్లూ జరగకుండా నివారించడం ద్వారా, మీరు మీ ఇంటిని సానుకూల శక్తితో నిండిన ప్రదేశంగా మార్చవచ్చు, ప్రతి ప్రదేశంలోనూ శ్రేయస్సు చేకూరేలా చూసుకోవచ్చు.