Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


మీ నిర్మాణ స్థలంలో సిమెంట్ నిల్వ కోసం ముఖ్యమైన చిట్కాలు

మీ నిర్మాణ స్థలంలో సిమెంట్ సరైన నిల్వ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సిమెంట్ నిల్వ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా, మీరు మీ పెట్టుబడిని రక్షించుకోవచ్చు. విజయవంతమైన ప్రాజెక్ట్ ల కోసం మీ సిమెంట్ నాణ్యతను మెయింటెయిన్ చేయవచ్చు.

Share:


సిమెంట్ తాజాదనం నాణ్యతను నిర్వహించడానికి సైట్ లో సిమెంట్ ని సరిగ్గా నిల్వ చేయాలి. సిమెంట్ హైగ్రోస్కోపిక్ తేమను గ్రహించినప్పుడు గట్టిపడుతుంది. సిమెంట్ సరిగ్గా నిల్వ చేయకపోతే, అది ముద్దగా, గట్టిగా నిర్మాణ అవసరాలకు ఉపయోగించలేనిదిగా మారుతుంది. సిమెంటు చెడిపోకుండా వర్షం, తేమ, గాలి, సూర్యుడు మొదలైన వాతావరణ పరిస్థితుల నుండి సరిగ్గా నిల్వ చేసుకుని భద్రపరుచుకోవాలి. సిమెంట్ నిల్వ కోసం సరైన ఏర్పాట్లు చేసుకుంటే భవిష్యత్తులో నిర్మాణానికి అవసరమైన బలాన్ని సంరక్షించుకోవడమే అవుతుంది. సైట్‌లో సిమెంటును ఎలా నిల్వ చేయాలో దానిని జాగ్రత్తగా ఎలా నిర్వహించాలో ఇక్కడ ఉంది.



సిమెంట్ సంచులను ఎలా నిల్వ చేయాలి?



1. తేమ నుండి రక్షించండి

తేమ సిమెంట్ నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సిమెంట్ నేల మరియు వాతావరణంలోని తేమ నుండి రక్షించబడాలి. తేమ శోషణను నిరోధించడానికి, తేమ సోకని (డ్యాంప్ ప్రూఫ్), ఎత్తైన ప్రదేశంలో సిమెంటును నిల్వ చేయండి. ముఖ్యంగా వర్షాకాలంలో బ్యాగులను 700-గేజ్ పాలిథిన్ షీట్లతో కప్పండి. సిమెంట్ నిల్వ కోసం గాలి చొరబడని సంచులను తప్పనిసరిగా అమర్చాలి. తద్వారా వాతావరణ ప్రభావం దానికి సోకకుండా ఉంటుంది. పరిసరాల్లో నీరు చేరకుండా లోపలికి ప్రవేశించకుండా నిరోధించడానికి నిల్వ స్థలం లేదా గిడ్డంగి సమీపంలోని ప్రదేశాల కంటే ఎక్కువగా ఉండాలి. వాటిని ఎల్లప్పుడూ నేల నుండి 150-200 మి.మీ. ఎత్తు మీద చెక్క పలకలు వేసి గానీ లేదా ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌లపై గానీ పెట్టండి.

 

2. సిమెంట్ గోడౌన్‌లో సిమెంట్ సంచులను సరిగ్గా పేర్చండి

సిమెంట్ సంచుల అమరిక సులభంగా స్టాకింగ్ తొలగించడానికి అనుకూలంగా ఉండాలి. సిమెంట్ సంచులను విడివిడిగా పేర్చిన పైల్స్ మధ్య కనీసం 600 మిమీ పాసేజ్ స్పేస్ ఉండేలా పేర్చాలి. అలాగే, గాలి ప్రసరణను తగ్గించడానికి సిమెంట్ సంచులను ఒకదానికొకటి దగ్గరగా ఉంచండి. ఒత్తిడిలో గడ్డకట్టడాన్ని నివారించడానికి స్టాక్ ఎత్తును గరిష్టంగా 10 బ్యాగ్‌లకు పరిమితం చేయండి. సైట్‌లో సిమెంట్ సంచుల నిల్వ తప్పనిసరిగా చేయాలి, తద్వారా స్టాక్ వెడల్పు నాలుగు సంచుల పొడవు లేదా 3 మీటర్లకు మించకూడదు. బోల్తా పడకుండా ఉండటానికి, 8 బ్యాగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న స్టాక్‌లను ఒకదానితో ఒకటి కట్టి, పొడవు గానూ, అడ్డంగానూ ఆల్టర్నేటివ్ గా అమర్చాలి.

 

3. సిమెంట్ సంచులను జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి

సిమెంట్ సంచులను ఒక్కసారిగా క్రింద పడేయడం లేదా వాటిని చివరల నుండి ఎత్తడం చేయకండి. అలాగే, మధ్యలో విడిపోవడం, కుంగిపోవడం జరగకుండా చేయడానికి దిగువ భాగంలో సపోర్టుని అందించాలి. విడిపోకుండా ఉండటానికి, కంటెంట్‌లను విప్పడానికి ఎత్తే ముందు బ్యాగ్‌లను చుట్టండి. వాటిని క్రింద పరిచేటప్పుడు, బ్యాగ్‌లు వెడల్పుగా ఉన్న వైపు క్రిందికి ఉండాలి.



4. సిమెంట్ బ్యాగ్‌ని ఎత్తడానికి లేదా స్టాగ్ చేయడానికి ఎప్పుడూ హుక్‌ని ఉపయోగించవద్దు

సిమెంట్ సంచులను ఎత్తడానికి లేదా పేర్చడానికి హుక్స్ ఉపయోగించడం వలన అనేక రకాల నష్టాలు ఉంటాయి. హుక్స్ బ్యాగ్‌లను పంక్చర్ చేయవచ్చు లేదా చింపివేయవచ్చు, ఇది దుమ్మునీ, తేమనీ సంచుల లోపలికి చొచ్చుకుపోయేలా చేస్తుంది, ఇది సిమెంట్ నాణ్యతను క్షీణింపజేస్తుంది. మీ పెట్టుబడిని మీ మెటీరియల్స్ సమగ్రతను కాపాడుకోవడానికి ఫోర్క్ లిఫ్ట్ లు, ప్యాలెట్ జాక్‌లు లేదా లిఫ్టింగ్ స్ట్రాప్స్ వంటి సిమెంట్ హ్యాండ్లింగ్ కోసం నిర్మించిన సాధనాలను ఎంచుకోండి. ఈ సాధనాలతో సిమెంట్ ని సురక్షితంగానూ, ఎలాంటి డేమేజి లేకుండానూ హ్యాండిల్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సిమెంట్ ఉత్తమ స్థితిలో ఉండేలా మీకు అవసరమైనప్పుడు నిర్మాణానికి సిద్ధంగా ఉండేలా చూస్తుంది.

 

5. సిమెంట్ సంచులను విడిగా నిల్వ చేయండి

నాణ్యతను ప్రభావితం చేసి, రాబోయే రోజుల్లో ఎలాంటి కాలుష్యమైనా జరగకుండా నివారించడానికి ఇతర మెటీరియల్స్ తో కాకుండా వివిధ రకాల సిమెంట్‌లను విడి విడిగా నిల్వ చేయడం చాలా అవసరం. మీ సిమెంట్ పాడవకుండా బాగా ఉండేలా చూడడానికి సిమెంట్ సంచులను తప్పనిసరిగా ఎరువులు వంటి ఇతర ఉత్పత్తులకు దూరంగానూ, వేరుగానూ, ప్రత్యేక నిల్వ ప్రాంతంలో నిల్వ చేయాలి.

 

6. పాతవాటిని ముందుగా ఉపయోగించండి

సిమెంట్ సంచులను ఉపయోగించడంలో ఫస్ట్-ఇన్, ఫస్ట్-అవుట్ సిస్టమ్‌ను ప్రాక్టీస్ చేయండి. ముందుగా పాత సంచులను ఉపయోగించాలి. సిమెంట్ సంచుల ప్రతి స్టాక్‌పై రసీదు తేదీని చూపించే లేబుల్ సిమెంట్ వయస్సును నిర్ణయించడంలో సహాయపడుతుంది. గిడ్డంగిలో సిమెంట్ నిల్వ చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాగులు అందుకున్న క్రమంలో వాటిని తొలగించడానికి వీలు కల్పించే విధంగా అమర్చండి.

 

7. మిగిలిపోయిన సిమెంట్‌ను జాగ్రత్తగా నిల్వ చేయండి

మిగిలిపోయిన సిమెంట్ ని తప్పనిసరిగా సగం ఖాళీ సంచులలో నిల్వ చేయాలి, దాన్ని ముందుగా ఉపయోగించాలి. మీ వద్ద మిగిలిపోయిన సిమెంట్ ఉంటే, వాటిని రీబ్యాగ్ చేయడానికి హెవీ-డ్యూటీ ప్లాస్టిక్ సంచులను ఉపయోగించండి. రంధ్రాలను నివారించడానికి బ్యాగ్‌ల ఓపెనింగ్స్ తప్పనిసరిగా డక్ట్ టేప్ లేదా స్ట్రింగ్‌లతో మూసివేయబడాలి.



సిమెంట్‌ను దానికై ఉద్దేశించిన పనికి వినియోగించడం కోసం తేమ, ప్రత్యక్ష సూర్యకాంతి, వర్షం, వేస్టేజి మొదలైన వాటి నుండి రక్షించడం చాలా ముఖ్యం. కాబట్టి సిమెంట్ సంచులను సరైన నిల్వ చేయడం చాలా ముఖ్యం. నిర్మాణం జీవితానికి అవసరమైన కాంక్రీటు, మోర్టార్ మొదలైనవాటిని సిద్ధం చేయడానికి సిమెంట్ ఉపయోగించబడుతుంది. అందువల్ల, సిమెంట్ నాణ్యతను నిర్వహించడానికి సరైన మార్గంలో సిమెంట్‌ను ఎలా నిల్వ చేయాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం. సిమెంట్‌ను ఉపయోగించి నిర్మించిన నిర్మాణాల జీవితకాలాన్ని పెంచే మంచి నాణ్యమైన సిమెంట్‌ని నిర్ధారించడానికి సిమెంట్ నిల్వ కోసం పై దశలను అనుసరించండి.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....