Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


పగిలిన ఫ్లోర్ టైల్‌ను ఎలా రిపేర్ చేయాలి?

అది మీ వంటగదిలో, బాత్రూమ్‌లో లేదా ఏదైనా ఇతర టైల్‌లు వేసిన ప్రదేశంలో అయినా, పగిలిన ఫ్లోర్ టైల్ సౌందర్యాన్ని దూరం చేయడమే కాకుండా గాయం అయ్యే ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. ఈ దశల వారీ గైడ్‌లో, పగిలిన ఫ్లోర్ టైల్‌ను రిప్లేస్ చేసే ప్రక్రియ ద్వారా మనం మీ స్థలానికి ఫ్రెష్ గా మెరుగులు దిద్దిన రూపాన్ని తీసుకురావచ్చు.

Share:


• భద్రతను మెరుగుపరచడానికి, సౌందర్య ఆకర్షణను సంరక్షించడానికి పగిలిన ఫ్లోర్ టైల్స్ సమస్యని పరిష్కరించడం చాలా ముఖ్యం.

 

• చక్కగా రిపేర్ చేయడం కోసం అడ్హెసివ్, రీప్లేస్‌మెంట్ టైల్స్, సేఫ్టీ గేర్‌తో సహా అవసరమైన సాధనాలను సేకరించండి.

 

• మరమ్మతు ప్రక్రియలో సమీపంలోని ప్రాంతాలను కవర్ చేయడం రక్షణ గేర్‌లను ధరించడం ద్వారా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి.

 

• క్లీనింగ్ నుండి గ్రౌటింగ్ వరకు దశల వారీ ప్రక్రియను అనుసరించండి, నష్టాన్ని నివారించడానికి ప్రతి దశలోనూ  చేయండి.

 

• చివరి గ్రౌటింగ్‌తో రిపేరుని ముగించండి, రిప్లేస్ చేయబడిన టైల్‌కు స్థిరత్వం, గ్యాప్ లేని ఫినిష్‌నీ అందించండి.

 


మీరు కొత్త ఇంట్లోకి మారుతున్నా లేదా ఇంటిని మార్చుకుంటున్నా, ఫర్నిచర్ తరలించడం వల్ల నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో బరువైన పాన్ పడినప్పుడు లేదా మీరు సింక్ పైపును బిగిస్తున్నప్పుడు, అప్పుడప్పుడు దుర్ఘటనలు జరగవచ్చు. దాంతో ఫ్లోర్ టైల్స్ విరగడం, పగలడం జరగవచ్చు. ఇలా పగిలిన లేదా విరిగిన టైల్ భద్రతకు హాని కలిగించవచ్చు. పగిలిన టైల్‌ను ఎలా రిపేర్ చేయాలో తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి వీలైనంత త్వరగా దాన్ని పరిష్కరించాలి.

 

మొత్తం టైల్స్‌ను రిప్లేస్ చేయకుండా కేవలం విరిగిన ఫ్లోర్ టైల్‌ వరకే ఎలా రిప్లేస్ చేయాలనే మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చి మీకు సహాయం చేయడానికి మేం ఇక్కడ ఉన్నాం. పగిలిన ఫ్లోర్ టైల్‌ను రిప్లేస్ చేయడానికి ఈ సరళమైన, అనుకూలమైన గైడ్ ని అర్థం చేసుకోవడం సులభం. నిపుణుడి అవసరం లేకుండానే మీరు ఈ సలహాలు పాటించవచ్చు.


మీరు ఏమి కలిగి ఉండాలి?



విరిగిన ఫ్లోర్ టైల్‌ను తిరిగి అతకడంలో మీకు సహాయపడటానికి సరైన పరికరాలతో మొదట ప్రారంభిద్దాం:


 

1. మెటీరియల్స్

దీనికి మీకు మొట్టమొదటిగా అడ్హెసివ్ అవసరమవుతుంది. మీరు అనుకున్న ప్రత్యేక టైల్ రకం, అలాగే మీరు పని చేస్తున్న ఉపరితలం కోసం తగిన అధిక-నాణ్యత అడ్హెసివ్‌ని ఎంచుకోండి. మరొక ముఖ్యమైన మెటీరియల్ కొత్త టైల్. యూనిఫాం రూపాన్ని నిర్వహించడానికి ఇప్పటికే ఉన్న టైల్స్ పరిమాణం, రంగు, టెక్స్చర్‌కి సరిపోయే రీప్లేస్‌మెంట్ టైల్‌ను ఎంచుకోండి. కొత్త టైల్ వేసిన తర్వాత టైల్స్ మధ్య ఖాళీలను పూరించడానికి మీకు గ్రౌట్ కూడా అవసరం. గ్రౌట్ రంగు, గ్యాప్‌ లేని ఫినిషింగ్‌ కోసం ఇప్పటికే ఉన్న గ్రౌట్‌తో సరిపోలుతుందని నిర్ధారించుకోండి. చివరగా, మాస్కింగ్ టేప్ ప్రక్కనే ఉన్న టైల్స్ ను కాపాడడంలోనూ సరైన అలైన్‌మెంట్‌ని మార్గనిర్దేశం చేయడంలోనూ అదనపు అడ్హెసివ్  మెటీరియల్‌ని నిర్వహించడంలోనూ శుభ్రమైన గ్రౌట్ లైన్‌లను మెయింటెయిన్‌ చేయడంలోనూ సహాయపడుతుంది.

 

2. ఉపకరణాలు

టైల్స్ మధ్య నుండి పాతబడిన, పోయిన గ్రౌట్‌ను సమర్థవంతంగా తొలగించడానికి గ్రౌట్ రిమూవర్‌ను ఉపయోగించవచ్చు. పైగా కలప, లోహం, రాతితో సహా వివిధ రకాల మెటీరియల్‌తో డ్రిల్లింగ్ చేయడానికి కాంబి డ్రిల్ ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఉలి, సుత్తి కాంబినేషన్‌ని ఉపయోగిస్తారు. ఇది టైల్స్, మోర్టార్ లేదా ఇతర మెటీరియల్‌ చిప్ చేయడానికి తొలగించడానికి ఒక సాధనం. గ్రౌట్ స్ప్రెడర్ అనేది టైల్స్ మధ్య గ్రౌట్‌ను సమానంగా వర్తింపజేయడానికి ఉపయోగించే సాధనం. ఇది చక్కగా ఏకరీతిలో గ్రౌట్ అప్లికేషన్‌ వచ్చేలా చేయడానికి సహాయపడుతుంది. టైల్స్ మధ్య ఖాళీలు తగినంతగా నింపబడిందని నిర్ధారిస్తుంది. మరొక ముఖ్యమైన సాధనం టైల్ స్పేసర్లు. ఇది స్థిరమైన అంతరాన్ని మెయింటెయిన్ చేస్తుంది.  టైల్స్ మధ్య ఏకరూపతను నిర్ధారిస్తుంది. గ్రౌటింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. 2-3 అంగుళాల బ్లేడ్ రీప్లేస్‌మెంట్ బ్లేడ్‌లతో కూడిన కత్తి, టైల్, గ్రౌట్ లేదా అడ్హెసివ్ మెటీరియల్‌ని కట్ చేయడానికీ, కావలసిన ఆకృతిని ఇవ్వడానికీ ఉపయోగపడుతుంది. పనిముట్లను శుభ్రపరచడానికీ, ఉపరితలాలను తుడిచివేయడానికీ టైల్ ఇన్‌స్టలేషన్ సమయంలో అదనపు గ్రౌట్ లేదా అడ్హెసివ్ మెటీరియల్‌ని మేనేజ్ చేయడానికి బకెట్ నీరు, స్పాంజ్ అవసరం. స్పాంజ్‌తో మనం కంట్రోల్డ్‌గా కావలసినంత మేరకే ఖచ్చితంగా శుభ్రపరిచేందుకు వీలుంటుంది.

 

3. భద్రతా సామాగ్రి

అస్తమానూ అవసరం లేనప్పటికీ, చేతి తొడుగులు ధరించడం వల్ల మీ చేతులను పదునైన అంచులు టైల్ రిప్లేస్ సమయంలో ఉపయోగించే మెటీరియల్ నుండి రక్షించుకోవచ్చు. టైల్ రిప్లేస్‌మెంట్ ప్రక్రియ జరిగేటప్పుడు సేఫ్టీ గ్లాసెస్ కళ్లకి పెట్టుకోవడం ద్వారా శిధిలాలు, పదునైన అంచులు మీ కళ్ళకు తాకకుండా కాపాడుకోవచ్చు. పగిలిన టైల్‌ను రిపేర్ చేసేటప్పుడు డస్ట్ మాస్క్ ఒక విలువైన రక్షణ పరికరం. ఇది మీ శ్వాసకోశానికి ఎలాంటి హానీ కలగనీయదు. ఆ విధంగా మాస్క్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రమైన, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది.


పగిలిన ఫ్లోర్ టైల్‌ను రిప్లేస్ చేసే ప్రక్రియ



ముందుగా మొదటి విషయాలు, మీకు అవసరమైన అన్ని భద్రతా గేర్‌లు ఉన్నాయని నిర్ధారించుకోండి. పగిలిన ఫ్లోర్ టైల్‌ను ఎలా రిపేర్ చేయాలో ఇప్పుడు చర్చిద్దాం.

 

1. పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేయండి

చెత్తగా ఉన్న ప్రాంతం ఫిక్సింగ్ కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. మీరు క్లీన్ సెటప్‌తో ప్రారంభించేలా చూసుకోండి. చుట్టుపక్కల ప్రాంతాన్ని సాఫ్ట్ క్లాత్‌తో తుడిచి ఆరేలా చేయండి. విరిగిన/పగిలిన టైల్‌ను సరిచేయడం వలన దుమ్ము పేరుకుపోతుంది కాబట్టి మీరు పనిని ప్రారంభించే ముందు డస్ట్ షీట్‌ను వేయవచ్చు. మీకు సమీపంలో ప్లగ్‌హోల్స్ ఉంటే, ప్లగ్ పాయింట్‌లకు దుమ్ము అడ్డుకోకుండా వాటిని కవర్ చేయండి. టైల్ క్రాక్ రిపేర్‌ ఎలా చేయాలో చూడడానికి కొన్ని ప్రాథమిక ప్రారంభ పాయింట్లు ఇవి.

 

2. గ్రౌట్ తొలగించండి

పగిలిన టైల్ గ్రౌట్‌ని లూజ్ చేసేందుకు సహాయం చేయడానికి గ్రౌట్ రిమూవర్‌ని ఉపయోగించండి. టైల్‌లో పగుళ్లను ఎలా పరిష్కరించాలో గుర్తించే ప్రక్రియలో మీరు చుట్టుపక్కల ఉన్న టైల్స్ ను పాడుచేయకుండా చూసుకోండి. దెబ్బతిన్న టైల్ మధ్యలో మాస్కింగ్ టేప్‌ను ఉపయోగించండి. తద్వారా మీరు పొరపాటున జారిపోకుండనూ, మరొక టైల్‌ని పగులగొట్టకుండానూ ఉంటారు.

 

గ్రౌట్‌ను తొలగించడం చాలా ముఖ్యమైన పని, ఎందుకంటే టైల్స్  మధ్య ఏదైనా గ్రౌట్ వదిలివేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న టైల్స్ పై కుదింపు పగుళ్లకు దారితీస్తుంది.

 

3. టైల్‌ని వదులు చేయడం 

పగిలిన టైల్‌లో రంధ్రం ఏర్పాటు చేయడానికి డ్రిల్ యంత్రాన్ని ఉపయోగించండి. మీరు చాలా వేగంగా వెళ్లకూడదని నిర్ధారించుకోండి, ఎందుకంటే మీరు క్రింద వేయబడిన ఏవైనా పైపులు లేదా కేబుల్‌లను పాడు చేయవచ్చు. విరిగిన టైల్ మధ్యలో ఉన్న టేప్‌లోకి నెమ్మదిగా డ్రిల్లింగ్ చేయడం ప్రారంభించండి.

 

రంధ్రం చేసిన తర్వాత, మీరు లోతుగా డ్రిల్ చేయడానికి వేగంగా మూవ్ చేయవచ్చు.

 

4. పాడైన టైల్ అవశేషాలను ఉలితో బయటకు తీయండి

విరిగిన టైల్‌ను ఎలా తొలగించాలో అర్థం చేసుకోవడానికి ఈ దశ మీకు సహాయం చేస్తుంది. డ్రిల్లింగ్ చేసేటప్పుడు మీరు పెట్టిన రంధ్రాల నుండి టైల్ ముక్కలను తొలగించడం ప్రారంభించడానికి ఉలిని ఉపయోగించండి.

 

చాలా మొరటుగానూ, అసహనంగానూ ఉండకండి. టైల్ మధ్యలో నుండి పక్క వైపులకు వెళ్లడం ప్రారంభించండి. ముక్కల పక్కన ఉన్న టైల్స్‌ని పాడవకుండా జాగ్రత్త వహించండి.

 

ఏదైనా అడ్హెసివ్  మిగిలి ఉంటే, ట్రిమ్మింగ్ నైఫ్‌తో తొలగించండి.

 

5. రీప్లేస్‌మెంట్ టైల్‌ను సెట్ చేయండి

చిప్డ్ ఫ్లోర్ టైల్స్‌ను ఎలా సరిచేయాలనే ప్రక్రియలో ఇది అత్యంత కీలకమైన దశల్లో ఒకటి. ముందుగా రీప్లేస్‌మెంట్ టైల్ సరిగ్గా సరిపోతుందని నిర్ధారించుకోవడానికి ఎటువంటి అడ్హెసివ్  మెటీరియల్‌ని ఉపయోగించకుండా ఉంచడానికి ప్రయత్నించండి. ఇది మిగిలిన ఫ్లోర్/గోడ టైల్స్  నుండి బయటకు పొడుచుకు వచ్చినట్లయితే, కొత్త టైల్‌లో అమర్చడానికి ముందు మీరు అదనపు అడ్హెసివ్ వాటిని తీసివేయవలసి ఉంటుంది.

 

మీరు సెట్టింగ్‌తో సంతోషంగా ఉన్న తర్వాత, గ్రౌట్ స్ప్రెడర్‌ని ఉపయోగించి మీ రీప్లేస్‌మెంట్ టైల్ వెనుక భాగాన్ని అడ్హెసివ్‌లా రాయండి. కొత్త టైల్‌ను మీ మిగిలిన ఫ్లోర్/గోడలో సజావుగా ఉండేలా గట్టిగా ఉంచండి.

 

6. కొత్త టైల్‌ను భద్రపరచండి

విరిగిన ఫ్లోర్ టైల్‌ను ఎలా రిపేర్ చేయాలనే మీ ప్రయత్నంలో మీరు విజయవంతమై, కొత్త టైల్‌ను అమర్చిన తర్వాత, టైల్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి మీరు దానిని గ్రౌట్ చేయాలి. ఇలా చేయడానికి, ముందుగా, టైల్ స్పేసర్‌లను అమర్చండి, గ్రౌట్ సరిపోయేలా స్థలాన్ని నిర్వహించడానికి అడ్హెసివ్  ఆరిపోయే ముందు టైల్ జారిపోకుండా చూసుకోండి.

 

ఒక రోజు తర్వాత, మీరు స్పేసర్‌లను తీసివేసి, రీప్లేస్‌మెంట్ టైల్ చుట్టూ ఉన్న ఖాళీలోకి కొత్త గ్రౌట్‌ను జోడించవచ్చు.





ఫ్లోర్ టైల్స్ పగుళ్లు ట్రైనింగ్ రిపేర్ చేయడంలో ఈ సహాయక దశల వారీ అవసరం సమయాల్లో ఉపయోగపడుతుంది. టూల్స్, సేఫ్టీ గేర్ పగిలిన ఫ్లోర్ టైల్‌ను ఫిక్సింగ్ చేసే ప్రక్రియ గురించి మీకు ఇప్పుడు తెలుసు. పగిలిన ఫ్లోర్ టైల్‌ను ఎలా రిపేర్ చేయాలనే దానిపై ఈ విస్తృతమైన గైడ్‌తో, పగిలిన టైల్‌ను రిప్లేస్ చేయడం మీ టైల్డ్ ఉపరితలాల షేప్‌ని సరిచేసే పని చేయడానికి మీకు పూర్తి అవగాహన కలిగి ఉంటుంది.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....