Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


వాల్ టైలింగ్ & ఇన్‌స్టలేషన్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ

ఒక ఇంటికి కొత్తగా మార్పులు చేర్పులు చేసే ప్రాజెక్ట్‌ లేదా కొత్త స్థలంలో భవన నిర్మించడం అనేది తరచుగా జీవించే చోటుకి సంబంధించిన సౌందర్యం, మన్నిక, ఫంక్షనాలిటీని మెరుగుపరిచే ఎంపికలను కలిగి ఉంటుంది. మీ ఇంటి గోడలను మార్చే విషయానికి వస్తే, టైల్స్‌ ఎంపిక, గోడలపై టైల్స్‌ ని సరిగ్గా ఎలా పెట్టాలో నేర్చుకోవడం అనే విషయాలు మీ మొత్తం స్థలం రూపాన్నీ, అనుభూతినీ చాలా బాగా ప్రభావితం చేస్తాయి.

Share:


వాల్ ల్స్‌ ఇన్‌స్టలేషన్ అనేది ఇంటి యజమానులకు ఇంటీరియర్‌పై ఆసక్తిని కలిగించే అంశం. మీ నివాసంలో వాల్ టైల్ ఇన్‌స్టలేషన్, మీరు నివసించే స్థలం చక్కదనాన్ని మెరుగుపరుస్తుంది, మీ ఇంటి సౌందర్యానికి మరింత సొబగుని చేరుస్తుంది, అంతే కాకుండా, డ్రైవాల్, ఇంకా ఇతర మెటీరియల్స్‌ తో పోలిస్తే మరింత మన్నికైన వైవిధ్యభరిత మెటీరియల్‌ గా కూడా ఉపయోగపడుతుంది. వాల్ టైల్స్‌ ఇన్‌స్టలేషన్ తేమను నిరోధించగలదు, గోడ నిర్మాణానికి ఉపయోగించే ఇతర మెటీరియల్స్‌ తో పోలిస్తే చాలా సులభంగా అప్రయత్నంగా స్క్రబ్బింగ్‌ ని హ్యాండిల్ చేయగలదు. మీరు మీ ఇంటి ఇంటీరియర్ నిర్మాణ ప్రక్రియలో మీకు సహాయం చేసే నిపుణుడిని కలిగి ఉన్నప్పటికీ, గోడలపై టైల్‌ ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మీరు తెలుసుకోవాలి. ఇది మీ స్థలంలో వాల్ టైల్ ఇన్‌స్టలేషన్ ప్రక్రియని సజావుగా, సమర్థవంతంగా జరిగేలా చూడడంలో మీకు సహాయం చేస్తుంది.

 

 



  • వాల్ పై టైల్స్‌ని ఇన్‌స్టాల్ చేయడం మీ ఇంటి సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది, అదనపు పనితీరుని అందిస్తుంది.
 
  • సిమెంట్, ఇసుక, టైల్ అడ్హెసివ్ నుండి ప్రొడక్టివ్ గ్లోవ్స్, సరైన సాధనాలు, ఎపాక్సీ, గ్రౌట్, కరెక్ట్ మెటీరియల్స్‌ వరకు ఒక చక్కటి ఇన్‌స్టలేషన్ ప్రక్రియ జరిగేలా చూస్తాయి.
 
  • టైల్ వేయడం కోసం గోడని సిద్ధం చేయడం, లోపాలున్నాయేమో చెక్‌ చేయడం, సరైన ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేయడం, టైలింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు లేఅవుట్‌ని ప్లాన్ చేయడం చాలా ముఖ్యం.
 
  • మోర్టార్‌ని కలపడం, అప్లై చేయడం నుండి టైల్స్‌ వేయడం, గ్రౌటింగ్ వరకు, ప్రతి స్టెప్‌లోనూ విజయవంతమైన వాల్ టైల్ ఇన్‌స్టలేషన్ కోసం నిర్దిష్ట పద్ధతులు అవసరం.
 
  • ఒకే రకమైన లైన్లు ఉండేలా చూసుకోవడం, తేలికపాటి ఒత్తిడిని మెయింటెయిన్ చేయడం, ఇన్‌స్టలేషన్ సమయంలో ఖచ్చితమైన అలైన్‌మెంట్‌, ఒక చక్కటి గోడ ఆకారాన్ని తీసుకొస్తుంది.

వాల్ టైల్స్‌ ఇన్‌స్టలేషన్ కోసం అవసరమైన మెటీరియల్స్‌



గోడలపై టైల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో నేర్చుకునేటప్పుడు, టైలింగ్ కోసం గోడను సిద్ధం చేయడానికి మీ నివాసంలో అందంగా ఆకర్షణీయంగా ఉన్న మన్నికైన గోడ ప్రదేశాన్ని రూపొందించడానికి మీకు ఈ క్రింది మెటీరియల్స్‌ అవసరం.

 

1. సిమెంట్

సిమెంటుని పొడి ప్రదేశంలో పెట్టాలని గుర్తుంచుకోండి; మోర్టార్ తయారుచేయడానికి మీకు ఈ మెటీరియల్ అవసరం.

 

2. ఇసుక

సిమెంట్‌ని నీటితో కలపడం ద్వారా మోర్టార్ చేయడానికి మీకు ఈ పదార్థం అవసరం.

 

3. టైల్ అడ్హెసివ్

మీరు మీ వాల్ టైల్ ఫిట్టింగ్ కోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రెడీమేడ్ టైల్ అడెసివ్‌లను ఉపయోగించవచ్చు.

 

4. టైల్స్‌ 

వాల్ టైల్ ఇన్‌స్టలేషన్ మీ ప్రాంతపు సౌందర్యానికి సరిపోయే ఉత్తమ నాణ్యత గల టైల్స్‌ ని ఎంచుకోండి.

 

5. చేతి తొడుగులు

రక్షిత చేతి తొడుగులు ధరించడం వల్ల సిమెంట్ కాలిన గాయాలు వాల్ టైల్స్‌ ఇన్‌స్టలేషన్ కోసం ఉపయోగించే అడ్హెసివ్ చికాకు నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

 

6. ఎపోక్సీ గ్రౌట్

టైల్ ఖాళీల మధ్య టచ్ సీల్‌ని రూపొందించడానికి వాల్ టైలింగ్ ప్రక్రియలో ఈ మెటీరియల్ అవసరం. 

 

7. గ్రౌట్ ఫ్లోట్

వాల్ టైల్స్‌ ఇన్‌స్టాలేషన్ కోసం ఎపోక్సీ గ్రౌట్, చక్కటి అప్లికేషన్ కోసం ఈ సాధనం అవసరం.

 

8. స్పాంజ్

మీ తాజాగా పూర్తయిన వాల్ టైల్ ఇన్‌స్టలేషన్ నుండి అదనపు గ్రౌట్‌ ని శుభ్రం చేయడానికి శుభ్రమైన, తడిగా ఉన్న స్పాంజ్ అవసరం.

 

9. కొలిచే టేప్

గోడపై ల్స్‌ ఇన్‌స్టలేషన్‌ చేయడానికి మీరు ఆ ఏరియాని కొలతల ప్రకారం కొలుచుకుని సరైన మొత్తంలో మెటీరియల్‌ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఈ సాధనం అవసరం.

 

10. డైమండ్ కట్టర్

మీ అవసరాలకు అనుగుణంగా టైల్స్‌ ని కట్‌ చేయడానికి ఈ సాధనం అవసరం.

 

11. బాటెన్స్

నేల నుండి కొన్ని అంగుళాల ఎత్తులో టైల్స్‌ ని ఉంచడానికి మీకు బ్యాటెన్ అవసరం.

 

12. తాపీ (ట్రోవెల్)

వాల్ ల్స్‌ ఇన్‌స్టలేషన్ కోసం మీరు తయారు చేసిన మోర్టార్ మిక్స్‌ని అప్లై చేయడానికి ఈ సాధనం అవసరం.

 

వాల్ టైలింగ్ కోసం దశల వారీ పద్ధతి

 

 

మీ ఇంటి అలంకరణలో అందమైన, మన్నికైన వాల్ ల్స్‌ ఇన్‌స్టాలేషన్ ని రూపొందించడానికి ఈ వాల్ టైల్  ఇన్‌స్టలేషన్ దశలను అనుసరించండి.



నేల నుండి కొన్ని అంగుళాల ఎత్తులో ల్స్‌ ని ఉంచడానికి మీకు బ్యాటెన్ అవసరం.

 

1. కాంక్రీట్, క్యూర్డ్ మోర్టార్ బెడ్లు, మాసనరీ , అలాగే టైల్ వేయాల్సిన ప్లైవుడ్ ఉపరితలాలు ఫ్లాట్‌గానూ, పొడిగానూ, నిర్మాణపరంగా చక్కగా ఉండి, బాగా శుభ్రంగానూ ఉండాలి.

 

2. ఇసుక వేయడం, స్క్రాప్ చేయడం  బహుశా చిప్పింగ్ చేయడం ద్వారా లేదా PRO-STRIP SEALER & ADHESIVE రిమూవర్ ని ఉపయోగించడం ద్వారా అన్ని కాలుష్య కారకాలను తప్పనిసరిగా తీసివేయాలి. ఏవైనా లోపాలుంటే సరిచేయాలి.

 

3. గోడ టైలింగ్ ఉపరితలంపై తేమ, పగుళ్లతో పాడైన ప్రాంతాలు ఉంటాయేమో చూడాలి, ఎందుకంటే పగుళ్లు గోడ బలహీనంగా ఉందనీ దానిని మార్చాల్సిన అవసరం ఉందనీ సూచిస్తుంది.

 

4. మీరు గోడ మెత్తబడిందేమో చూడడానికి గోడ మీద, అందునా ప్రత్యేకంగా స్టడ్స్ దగ్గర, నొక్కడం ద్వారా గోడను చెక్‌ చేయవచ్చు.  ఇది మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే, దానికి మరి కొంత పని అవసరపడవచ్చు.

 

5. మీరు ల్స్‌ ని నేరుగా డ్రైవాల్‌ మీద ఉంచే బదులు పెద్ద ఉపరితల వైశాల్యాన్ని టైల్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే, టైలింగ్ బోర్డుని బ్యాకర్‌గా ఉపయోగించడం మంచిదని గుర్తుంచుకోండి.  టైలింగ్ బోర్డ్ డ్రైవాల్ కంటే ఎక్కువ నీటి-నిరోధక పదార్థం. మీ వాల్ టైల్ ఇన్‌స్టలేషన్ పగుళ్లు లేదా వంగడం వంటివి లేకుండా చూస్తుంది.

 

2) ఉష్ణోగ్రత చెక్‌ చేయడం 

 

వాల్ ల్స్‌ ఇన్‌స్టలేషన్ పూర్తయిన తర్వాత 24 గంటల ముందు  48 గంటల పాటు గదిని, మీ మొత్తం వాల్ టైలింగ్ మెటీరియల్స్‌ ని  అడ్హెసివ్‌లను 10° - 21° మధ్య ఉంచాలని మీరు గుర్తుంచుకోవాలి.

 

3) లేఅవుట్ ప్లానింగ్



  • కొలిచే టేప్ మరియు చాక్‌ పీస్‌ని ఉపయోగించి, వాల్ టైల్స్‌ ఇన్‌స్టలేషన్ ఉపరితలం యొక్క మధ్య-రేఖలను (నిలువుగా, అడ్డంగా, రెండు రకాలుగానూ) గుర్తించండి. ఇది మీ వాల్ టైల్స్‌ ని నిటారుగా పెట్టడంలో ఆ ఏరియాని టైలింగ్ సెక్షన్లుగా విభజించడంలో మీకు సహాయం చేస్తుంది.
 
  • మీ వాల్ టైల్స్‌ దాదాపుగా మీరు అనుకున్న విధంగానే ఉన్నాయని నిర్ధారించుకోవడానికి డ్రై ఫిట్ చేయండి.
 
  • ఇప్పుడు మీరు అదెలా కనిపిస్తోందో చూసి సంతృప్తి చెందితే, టైల్స్‌ మీ గోడ ఉపరితలంపై అంచులు మరియు మూలలు ఎలా కలుస్తాయో ఒక ప్లాన్ వేసుకోండి.
 
  • మీరు ఇన్‌స్టలేషన్‌కి టైల్స్‌ సైజుని కూడా ప్లాన్ చేయాలి. మీరు గోడకు పెద్ద టైల్స్‌  వేయాలా లేదా చిన్న టైల్స్‌  వేయాలా అనే విషయం నిర్ధారించుకోవడంతో మొదలు పెట్టండి, ప్రతి అడ్డు వరుసకు మీ వాల్ టైలింగ్ ఎంత ఏరియా అవసరమో మీరు కొలవవచ్చు.
 
  • చివరగా డైమండ్ కట్టర్ ని ఉపయోగించి టైల్స్‌ ని దానికి అనుగుణంగా కట్ చేయండి.

 

4) లెవలింగ్



1. తాత్కాలిక వుడ్ బ్యాటెన్ అనేది ఒక లెవల్ అనీ, మీ మొదటి వరుస టైల్ పైన ఉంచబడేటట్లు చూడండి.

 

2. మీరు వుడ్ బ్యాటెన్ పైన వాల్ టైలింగ్ పూర్తి చేసిన తర్వాత, మీరు తాత్కాలిక బ్యాటెన్‌ని తీసివేసి, దిగువ వరుసలో టైల్స్‌ ని పెట్టడం ప్రారంభించవచ్చు.

 

5) మిక్సింగ్

మీ గోడ టైల్స్‌ ని అమర్చడానికి మీకు పలుచని మోర్టార్ సెట్ అవసరం. మోర్టార్ చేయడానికి, తయారీదారు సూచనలను అనుసరించమని సూచించినప్పుడు, మీరు జనరల్‌ థంబ్‌ రూల్‌ని పాటించవచ్చు - ఒక బకెట్‌లోకి పౌడర్ రూపంలో ఉన్న పదార్థాలను (సిమెంట్ మరియు ఇసుక) తీసుకోండి, వాటిని మొత్తంగా పైకీ కిందికీ కలుపుతూ నెమ్మదిగా నీరు పోయండి. గుర్తుంచుకోండి, సరైన వాల్ టైల్ ఫిట్టింగ్ కోసం మోర్టార్ పీనట్ బటర్‌ వంటి అనుగుణ్యతను కలిగి ఉండాలి. మీరు దీన్ని మొదటిసారిగా కలిపిన తర్వాత "స్లేక్" అయ్యే సమయం ఇవ్వాలి, అంటే మీరు దానిని మళ్లీ కదిలించే ముందు కనీసం 10-15 నిమిషాల సమయం ఇవ్వాలి.

 

6) మోర్టార్ ని అప్లై చేయడం  



1. మీరు ఉపరితలం మీద తాపీ ఫ్లాట్ సైడ్ తో మోర్టార్ ని అప్లై చేయడం ద్వారా పని ప్రారంభించవచ్చు.

 

2. దీని తరువాత, మీరు 45° కోణంలో సూచించబడిన నాచ్ తాపీతో ఒక రిడ్జ్డ్ నమూనాలో మోర్టార్ ని సమానంగా పరచవచ్చు.

 

3. ఒక తిన్ననైన విధానంలో ఉపరితలంపై సుదీర్ఘంగా పరుస్తూ వెళ్లేలా   మోర్టార్ ని అప్లై చేయడం కొనసాగించండి.

 

7) టైల్ వేయడం



కొంచెం ట్విస్ట్ చేసి వాల్ టైల్‌ని మోర్టార్‌లోకి నొక్కండి, వాల్ టైల్‌ని పెట్టే ప్రక్రియ అంతటా యూనిఫాం లైన్స్‌ లో ఉండేలా చేయండి.

 

టైల్స్‌ ఫిక్సింగ్ చేసేటప్పుడు, తేలికపాటి ఒత్తిడి ఇవ్వాలి, తేలికపాటి  అలైన్‌మెంట్‌ ఇవ్వాలి.

 

8) గ్రౌటింగ్



 

1. 24 గంటల తర్వాత, టైల్స్‌ జాయింట్లకి గ్రౌట్‌ని అప్లై చేయండి, టైల్ ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచండి.

 

2. 45° కోణంలో గ్రౌట్ ఫ్లోట్‌ని ఉపయోగించి ఎపోక్సీ గ్రౌట్‌ని పరచండి,  గ్రౌట్‌ని ఖాళీలలోకి నెట్టడానికి డయాగ్నల్ స్వైప్స్‌ని ఉపయోగించండి.

 

3. టైల్స్‌ ఏదైనా అదనపు గ్రౌట్‌ని తొలగించడానికి గ్రౌట్ ఫ్లోట్‌ని ఉపయోగించండి, దానిని 20 నిమిషాల పాటు క్యూర్ అయ్యేందుకు సమయం ఇవ్వండి.

 

4. పూర్తయిన తర్వాత, టైల్స్‌ నుండి మిగిలిన అదనపు గ్రౌట్‌ని తొలగించడానికి శుభ్రమైన, తడిగా ఉన్న స్పాంజితో టైల్స్‌ ని తుడవండి.

 

5. గ్రౌట్ సీలర్ ని ఉపయోగించి టైల్స్‌ ని సీల్ చేయండి, ఇది ఖాళీలలో  ఫంగస్ పెరుగుదలని నిరోధిస్తుంది.




 

గోడలపై టైల్స్‌ ని చక్కగా ఎలా అమర్చాలో బాగా అర్థం చేసుకోవడానికి, మీరు మా యూట్యూబ్ వీడియో, ‘వాల్ టైల్స్‌ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?’ ని చూడవచ్చు మీరు మీ వాల్ ల్స్‌ ఇన్‌స్టాలేషన్ కోసం ఉత్తమ నాణ్యత గల ఎపోక్సీ గ్రౌట్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, అల్ట్రాటెక్ సిమెంట్ వారి స్టైల్ ఎపోక్సీ గ్రౌట్‌ను చూడండి.



సంబంధిత కథనాలు



సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....