కాంక్రీట్ సెగ్రిగేషన్ కారణాలు
కాంక్రీటు సెగ్రిగేషన్ ని ప్రభావితం చేసే అనేక కారణాలూ, కారకాలూ ఉన్నాయి.
1. కాంక్రీట్ పదార్థాల అసమాన నిష్పత్తి:
కాంక్రీట్ మిశ్రమంలోని పదార్ధాల నిష్పత్తి ఒకే రకంగా లేకుంటే, అది సెగ్రిగేషన్ కి దారి తీస్తుంది. ఎక్కువ నీరు-సిమెంట్ నిష్పత్తితో నీటికి గల హెచ్చు బరువు కారణంగా కంకర క్రిందికి దిగిపోవడానికి కారణమవుతుంది.
2. కాంక్రీటు మిక్సింగ్ కి తగినంతసేపు సమయం ఇవ్వకపోవడం:
కాంక్రీటు అంతటా బాగా కలపబడకపోతే, మిశ్రమం కొన్ని ప్రాంతాలలో ఎక్కువగానూ లేదా ప్రాంతాల్లో తక్కువగానూ నిర్దిష్ట పదార్థాలు ఉండవచ్చు, ఇది సెగ్రిగేషన్ కి దారి తీస్తుంది.
3. కాంక్రీట్ మిశ్రమాన్ని నిర్వహించడం:
కాంక్రీట్ మిశ్రమాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం కూడా సెగ్రిగేషన్ కి కారణమవుతుంది. మీరు కాంక్రీటును మాన్యువల్‌గా మిక్స్ చేస్తే, మిక్సింగ్ ప్రక్రియలో అసమానతలు ఉండవచ్చు, ఇది సెగ్రిగేషన్ కి దారి తీస్తుంది.
4. కాంక్రీట్ మిశ్రమాన్ని ఉంచడం:
కాంక్రీట్ సెగ్రిగేషన్ కి కాంక్రీటు రవాణా బాగా దోహదపడుతుంది. కాంక్రీటును ఎక్కడ వేస్తున్నారా అనేది చాలా ముఖ్యం. కాంక్రీటు ఎత్తు నుండి పోసినా లేదా ఎక్కువ దూరం రవాణా చేయాల్సి ఉన్నా, అది బరువైన కంకరని క్రిందికి తోసేస్తుంది కాబట్టి మిగిలిన మిశ్రమం నుండి అది వేరుపడడానికి కారణమవుతుంది.
5. కాంక్రీటు కంపనం:
కంపనం సాధారణంగా కాంక్రీటు నుండి గాలి పాకెట్‌లను స్థిరీకరించడానికీ, వాటిని తొలగించడానికి ఉపయోగించబడుతుంది, అధిక కంపనం మొత్తం మిశ్రమాన్ని స్థిరపరచడానికీ, మిగిలిన మిశ్రమం నుండి వేరు చేయడానికి కారణమవుతుంది.