వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి



దక్షిణం వైపు ఇంటి కోసం వాస్తు ప్లాన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు

దక్షిణం వైపు ఉన్న ఇంటి వాస్తు మార్గదర్శకాలను అర్థం చేసుకోవడం ద్వారా సామరస్యత, సమృద్ధి కోసం ముఖ్యాంశాల్ని తెలుసుకోండి. ప్రతి అంశం మీ నివాస స్థలంలో సమతుల్యత, సానుకూలత, శ్రేయస్సుని ఎలా ఆహ్వానిస్తుందో తెలుసుకోండి.

Share:


ముఖ్యంగా చూడాల్సిన విషయాలు

 

  • దక్షిణం వైపు ఉన్న ఇళ్ళు అశుభకరమైనవి కావు; సరైన ఆర్కిటెక్చర్  అప్లికేషన్‌తో, అవి ఇతర దిశల్లోని ఇళ్ల మాదిరిగా సంపన్నవంతంగానూ ఆనందంగానూ ఉంటారు.
 
  • దక్షిణం వైపు గోడకు కుడి వైపున ప్రధాన ద్వారం ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది, శాంతినీ  శ్రేయస్సునీ ప్రోత్సహిస్తుంది.
 
  • ఆస్తి ఈశాన్య భాగంలో భూగర్భ నీటి ట్యాంక్‌ను ఉంచడం వల్ల ఇంట్లో సంపద, సమృద్ధి వైబ్రేషన్లు గణనీయంగా పెరుగుతాయి.
 
  • దక్షిణ, పడమర దిశల్లో గోడలను మందంగానూ ఎత్తుగానూ నిర్మించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి ఇంటిని రక్షణ లభిస్తుంది, నిర్మాణానికి స్థిరత్వం, దృఢత్వం లభ్యమవుతాయి. 
 
  • ఆగ్నేయంలో వంటగదిని పెట్టడం వల్ల పంచభూతాల్లో అగ్నిని సమర్ధవంతంగా వినియోగించుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం, శక్తి లభ్యమవుతాయి. అయితే నైరుతిలో ఉన్న మాస్టర్ బెడ్‌రూమ్ స్థిరత్వానికీ, ప్రశాంతమైన నిద్రకీ, సంబంధాల సామరస్యతకీ అనుకూలత కల్పిస్తాయి. 
 
  • దక్షిణం, ఆగ్నేయ ముఖంగా ఉన్న ఇళ్ల విషయంగా ఉన్న అపోహలను తొలగించడం, సమృద్ధీ, శ్రేయస్సూ ఉండేలా చూసేందుకు దిశ మాత్రమే కాకుండా సరైన వాస్తు అమరిక కూడా ప్రముఖమైందనే అంశాన్ని హైలైట్ చేస్తుంది.


కాల పరీక్షకి నిలిచి గెలిచిన వాస్తు శాస్త్ర సూత్రాలు, తమ ఇళ్లకి అన్వయించుకుని సంతోషకరమైన జీవితం గడపేందుకు ప్రజలకి మంచి మార్గాన్ని చూపించడానికి సహాయపడతాయి. దక్షిణం వైపున ఉన్న ఇళ్లు ఉన్నవారికి ఒక శుభవార్త: సరైన డిజైన్‌తో ఉంటే మీ ఇల్లు కూడా ఇతర ఇళ్ల మాదిరిగానే ఆనందానికీ, విజయానికీ ఆలవాలంగా ఉంటుంది!

దక్షిణం వైపు ఉన్న ఇళ్ళు అశుభమనే అపోహ ఒకటి ఉంది, కానీ ఇది నిజం కాదు. మీరు దక్షిణం వైపు ఉన్న ఇంటికి దక్షిణ దిశగా పని చేసే వాస్తు సూత్రాల్ని ఉపయోగిస్తే ఈ ఇల్లు కూడా ఆనందంతో నిండి ఉంటుంది. ఈ బ్లాగ్‌లో, దక్షిణం వైపున ఉన్న ఇంటిని వాస్తుకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మేము మీకు చూపుతాము, గది ఉండాల్సిన ప్రదేశం నుంచి తలుపుల వరకు ప్రతిదీ మీకు మీ కుటుంబం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది.

 

 


దక్షిణ ముఖంగా ఉన్న ఇంటి వాస్తు అంటే ఏమిటి దానిని ఎలా అర్థం చేసుకోవాలి?



మనం దక్షిణం వైపు ఇళ్లకి వాస్తు గురించి చర్చించినప్పుడల్లా, అది మీ ఇంటి గురించి మాత్రమే కాదనీ, మానవ జీవితానికి ప్రకృతిసిద్ధమైన పంచభూతాలను ఒకచోట చేర్చే విధానమనీ గుర్తుంచుకోవాలి. దక్షిణం వైపు ఉన్న ఇంటికి వాస్తు లక్ష్యం సాధారణంగా ఈ దిశకి సంబంధించి తప్పుగా అర్థం చేసుకున్న అపోహల్ని తొలగించి ప్రతికూల శక్తిని సానుకూల సామరస్య శక్తిగా మార్చడం. రహస్యం ఏమిటంటే, ప్రతి దిశలో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయని అర్థం చేసుకోవడం, సరిగ్గా ఉపయోగించినప్పుడు, దక్షిణం వైపు ఉన్న గృహాలతో సహా ఏ ఇంటికి అయినా శ్రేయస్సునీ ఆనందాన్నీ కలిగిస్తుంది.

 

దక్షిణ దిశ హిందూ పురాణాలలో మరణాన్ని సూచించే యమధర్మరాజుతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ అనుబంధం ఫలితంగా దక్షిణం వైపు ఉన్న గృహాలు ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయనే దురదృష్టకర భావన ఏర్పడింది, ఈ భావన తరచుగా ప్రజలను జాగ్రత్తలు తీసుకునేలా చేస్తుంది. అయితే, సరిగ్గా గమనించినట్లయితే, దక్షిణం వైపు ఉన్న ఇంటి వాస్తు ద్వారా, దక్షిణ దిశ కూడా ఇతర దిశల వలె సానుకూల శక్తిని అందించగలదని మనం అర్థం చేసుకోవచ్చు.


దక్షిణం వైపు ఉన్న ఇంటికి వాస్తు నియమాలు



 

1. ప్రధాన ద్వారం ఉండాల్సిన ప్రదేశం

వాస్తు శాస్త్రంలో దక్షిణం వైపు ఉన్న గృహాల కోసం, ప్రధాన ద్వారం స్థానం తరచుగా దక్షిణ ద్వారం వాస్తు అని పిలుస్తారు, ఎందుకంటే ఇది మీ నివాస స్థలంలోకి శక్తి ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది. దక్షిణం వైపు గోడకు కుడి వైపున ఉంచడం ద్వారా కుడి వైపున లోపలికి తెరవడం ద్వారా, మీరు సానుకూల ప్రయోజనకరమైన శక్తులను అనుమతించి, శాంతి, శ్రేయస్సుతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తారు.

 

2. భూగర్భ నీటిని నిల్వ చేసే చోటు

భూగర్భ నీటి ట్యాంక్ లేదా నిల్వ సాధారణంగా మీ ఆస్తి  ఈశాన్య భాగంలో ఉండాలి. వాస్తు ప్రకారం నీరు సంపదకీ, సమృద్ధికీ చిహ్నం. అందువల్ల ఈ ప్రాంతంలో వాటర్ స్టోరేజి ఉంచడం వల్ల మీ ఇంట్లో సానుకూల, ధనాకర్షణ శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది.

 

3. గోడల మందం

దక్షిణం వైపు ఉన్న ఇంటి వాస్తులో గోడల మందం కూడా ముఖ్యమైనది. మీ ఇంటి దక్షిణ, పడమటి గోడలను మందంగా ఎత్తుగా చేయడం ద్వారా, మీరు మీ ఇంటిని ప్రతికూల శక్తి నుండి బాగా రక్షించుకోవచ్చు. మందపాటి గోడలు నిర్మాణానికి స్థిరత్వాన్నీ, బలాన్నీ కూడా జోడిస్తాయి.

 

4. వంటగది స్థలం

వాస్తు శాస్త్ర ప్రకారం దక్షిణం వైపు ఉన్న గృహాలకు వంటగది ఆగ్నేయ ప్రాంతంలో ఉండాలి. అగ్ని ఇక్కడ ప్రముఖమైనది. వంటగదిని ఈ దిశలో ఉంచడం అంటే ఈ అగ్నిని వివేచనతో ఉపయోగించడం. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మీ ఇంట్లో శక్తిని నింపుతుంది.

 

5. పడకగది దిశ

మాస్టర్ బెడ్‌రూమ్ నైరుతి దిశలో ఉండాలి, ఎందుకంటే ఈ దిశ స్థిరత్వాన్ని అందిస్తుంది, ప్రశాంతమైన నిద్రను కలగజేస్తుంది. ఇది సంబంధాలను బలపరుస్తుందనీ సామరస్యాన్ని కూడా నిర్ధారిస్తుందనీ నమ్ముతారు. అయితే, దక్షిణం వైపు ఉన్న ఇంటి వాస్తు ప్రకారం, పడకగది ఎప్పుడూ ఈశాన్యంలో ఉండకూడదు, ఎందుకంటే ఇది అశాంతినీ ఆరోగ్య సమస్యలనీ కలిగిస్తుంది.


ఆగ్నేయ ముఖంగా ఉన్న ఇళ్ల గురించి కొన్ని ప్రముఖ వాస్తు అపోహలు

 

అపోహ 1: ఆగ్నేయ ముఖంగా ఉండే ఇళ్ళు అశుభం

ఆగ్నేయ ముఖంగా ఉన్న ఇళ్లు దురదృష్టమనీ, అవి మనకి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయని ఒక సాధారణ అపోహ. నిజమేమిటంటే, దక్షిణాభిముఖంగా ఉన్న గృహాలలో ప్రధాన ద్వారం సరైన స్థితిలో పెట్టి వాస్తు సూత్రాలను సరిగ్గా పాటిస్తే ఈ గృహాలు ఇతర దిశల్లో ఉన్న ఇళ్ల మాదిరిగానే సామరస్యంగా  సంపన్నంగా ఉంటాయి. 

 

అపోహ 2: ఆర్థిక లోటు అనివార్యం

మరొక అపోహ ప్రకారం ఆగ్నేయ ముఖంగా ఉన్న ఇంట్లో నివసించడం, ఆర్థిక అస్థిరతకీ నష్టాలకీ దారి తీస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఆర్థిక ఫలితాలు ఇల్లు ఏ ముఖంగా ఉందా అనేదానిపై కాకుండా, దక్షిణాభిముఖ గృహ వాస్తు సూత్రాలకి ఎంత అనుగుణంగా ఉందో దాన్ని బట్టీ, అలాగే ఆ వ్యక్తి చేసే పనులకు మరింత దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి.    

 

అపోహ 3: ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం

ఆగ్నేయ ముఖంగా ఉన్న ఇంటిలో నివసించే వ్యక్తులు మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారనే భావన అపోహ. ఆరోగ్యం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అగ్ని ఈ దిశలో ప్రబలంగా ఉంటుంది, అయితే దక్షిణం ముఖంగా చేయాల్సిన వాస్తు సర్దుబాట్ల ద్వారా పంచభూతాల్నీ సమతుల్యం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

 

గుర్తుంచుకోండి: ఈ అపోహల్లో ప్రతి ఒక్కటి వాస్తు  పనితీరుపై అవగాహన లేకపోవడం వల్ల వచ్చింది. నిపుణుడితో సంప్రదించి దక్షిణం వైపు వాస్తు ప్లాన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మీరు దక్షిణం వైపు ఉన్న ఇళ్ల కోసం సరైన వాస్తు సూత్రాలను అనుసరించి మీ ఇంటిని సంతోషానికీ, సమృద్ధికీ ఆలవాలంగా మార్చుకోవచ్చు. 


దక్షిణం ముఖంగా ఉన్న ఇంటి వాస్తు ప్లాన్‌లో కొన్ని చేయకూడని పనులు

 

మీరు ప్రామాణిక వాస్తు ప్రణాళికకు కట్టుబడి ఉన్నా లేదా ప్రత్యేకంగా దక్షిణం వైపున ఉన్న ఇంటి వాస్తు ప్లాన్ 30x40ని అనుసరిస్తున్నా, మీరు ఏమి చేయకూడదనే దానిపై శ్రద్ధ పెట్టడం కూడా అంతే ముఖ్యం. 

 

1. ప్రధాన ద్వారం తప్పు చోట పెట్టకూడదు

ప్రధాన ద్వారం నైరుతి దిశలో ఉండకూడదు ఎందుకంటే ఇది ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తుంది. 

 

2. దక్షిణాన నీటి స్థానం ఉండకూడదు

దక్షిణ దిశలో స్విమ్మింగ్ పూల్ లేదా వాటర్ ట్యాంక్ పెట్టడం వల్ల ఎనర్జీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది ఆర్థిక లేదా ఆరోగ్య సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.

 

3. ఇంటి ముందు పెరట్లో చెట్లని పెంచకండి

దక్షిణం వైపు ఉన్న ఇంటి ముందు పెద్ద చెట్లు ఉంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటాయి.

 

4. దక్షిణం వైపున ఎలాంటి చెత్తా ఉండకూడదు

మీ ఇంటి దక్షిణ భాగంలో చెత్త ఉండడం వల్ల సానుకూల శక్తి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుంది, ఇంట్లో ఉన్నవారు అశాంతిగా ఉంటారు.

 

5. ఆగ్నేయ దిశలో పడక గదులు ఏర్పాటు చేయవద్దు

ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉన్న పడక గదులు ఈ దిశలో ఉన్న బలమైన అగ్ని మూలకాల కారణంగా విభేదాల్నీ,  ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. నైరుతి దిశలో పడక గదులు మంచివి.



 

దక్షిణ ముఖంగా ఉన్న గృహాలు తరచుగా అనేక అపోహలకీ, అనవసరమైన ఆందోళనలకీ గురవుతాయి. తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, వాస్తు సూత్రాల ప్రకారం దక్షిణం వైపున ఉన్న ఇంటిని సరిగ్గా ప్లాన్ చేయడం వల్ల ఏ స్థలాన్నైనా సామరస్యంగానూ సమతుల్యంగానూ చేయవచ్చు. ప్రధాన ద్వారం కావచ్చు, వంటగది ఉన్న ప్రదేశం లేదా పడకగది దిశ ఏదైనా కావచ్చు, దక్షిణం వైపున ఉన్న ఇళ్ల కోసం వాస్తుని సరిగ్గా అమర్చినట్లయితే, ఇంటిని సానుకూల శక్తితో శ్రేయోదాయకంగా చేయవచ్చు.




సంబంధిత కథనాలు



సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....