వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి



వేర్వేరు రకాల వాటర్ ట్యాంకుల్లో సరైనదాన్ని ఎంచుకోవడానికి ఒక గైడ్

ఒక వాటర్ ట్యాంక్‌ కొనాలని చూస్తున్నప్పటికీ, మీ అవసరాలకు ఏ రకమైన నీటి నిల్వ ట్యాంకులు మంచివో మీకు తెలియడం లేదా? మరింకేమీ చూడకండి. ఈ గైడ్‌లో, మనం అందుబాటులో ఉన్న వివిధ రకాల వాటర్ ట్యాంకుల్ని చూద్దాం. మీ కోసం సరైనదాన్ని నిర్ణయించడంలో మేం మీకు సహాయపడతాము.

Share:


వివిధ నివాస, వాణిజ్య మరియు పారిశ్రామిక అమరికలలో నీటిని నిల్వ చేయడానికి మరియు సంరక్షించడానికి నీటి ట్యాంకులు అవసరం. మీరు వర్షపునీటిని సేకరించాలనీ, నీటిపారుదల ప్రయోజనాల కోసం నీటిని నిల్వ చేయాలనీ అనుకుంటున్నారా లేదా బ్యాకప్ నీటి సరఫరా ఉండేలా చూడాలనుకుంటున్నారా, అందుకు సరైన టైప్ లో ఉన్న నీటి ట్యాంక్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మార్కెట్లో విస్తృత శ్రేణి ఎంపికలు అందుబాటులో ఉన్నందున, మీ అవసరాలకు ఏది బాగా సరిపోతుందో నిర్ణయించడం చాలా ఎక్కువ. ఈ గైడ్ వేర్వేరు వాటర్ ట్యాంక్ రకాలను గురించి తెలియజేసి, మీ అవసరాలకు అనువైన ట్యాంక్‌ను ఎన్నుకునేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యాంశాలను హైలైట్ చేయడం ద్వారా సమాచారం మీకు సరిగ్గా అందజేసి, సరైన నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది.



ఏ రకమైన నీటి నిల్వ ట్యాంక్ మీకు సరైనది?



మీ అవసరాల కోసం వివిధ రకాల నీటి ట్యాంకుల్లో దేన్ని ఎంపిక చేసుకునే విషయానికి వస్తే, ఆ ట్యాంక్  రకం, లక్షణాలు, ప్రయోజనాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇక్కడ, మనం వివిధ వాటర్ ట్యాంక్ ల రకాలు, వాటి నిర్దిష్ట లక్షణాలు, ప్రయోజనాలు, వాటిని వాడుకోవలసిన విధానాలని తెలుసుకుందాం.

 

 

1. ప్లాస్టిక్ ట్యాంకులు

ప్లాస్టిక్ ట్యాంకులు, ముఖ్యంగా పాలిథిన్‌తో తయారు చేయబడినవి, వాటి వైవిధ్యత, ధరలు అందుబాటులో ఉండడం, ఇన్స్టలేషన్ కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవి ఇళ్ల కోసం తయారుచేయబడిన వాటర్ ట్యాంకుల రకాలు. ఇవి వివిధ నిల్వ సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ ఆకారాల్లోనూ, సైజుల్లోనూ  వస్తాయి. ప్లాస్టిక్ ట్యాంకులకి ఉండే కొన్ని ముఖ్య లక్షణాలు, ప్రయోజనాలు, వాటిని ఎక్కడ బాగా ఉపయోగించగలమో తెలుసుకుందాం:

 

  • తేలికగా ఉంటాయి, ఇన్‌స్టాల్ చేయడం సులభం
  • తుప్పు మరియు క్షీణించకుండా నిరోధకత
  • తక్కువ నిర్వహణ అవసరాలు
  • వివిధ పరిమాణాలు మరియు ఆకారాలలో లభిస్తుంది
  • పై-గ్రౌండ్ మరియు భూగర్భ సంస్థాపన రెండింటికీ అనువైనది

 

ఎ) పాలిథిలిన్ ట్యాంకులు

పాలిథిన్ ట్యాంకులు తేలికైనవి అయినప్పటికీ బాగా మన్నుతాయి, వాటిని తుప్పు పట్టకుండా, క్షయానికి గురి కాకుండా నిరోధకతను కలిగి ఉంటాయి. అవి UV-స్టెబిలైజ్డ్ అయి ఉంటాయి. ఎండలో ఉన్నప్పుడు కూడా దీర్ఘ కాలం మన్నుతాయి. పాలిథిన్ ట్యాంకులు భూమ్మీద వాతావరణంలో గానీ, భూగర్భంలో గానీ ఇన్స్టలేషన్స్ కి అనుకూలంగా ఉంటాయి. వీటిని నివాస, వ్యవసాయ, చిన్న-స్థాయి వాణిజ్య అప్లికేషన్లకు అద్భుతమైన ఎంపికగా ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా వర్షపు నీటి సంరక్షణ, నీటిపారుదల, నీటి నిల్వ కోసం పోర్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ముఖ్యమైన ప్రదేశాలలో ఉపయోగించే వాటర్ ట్యాంకుల రకాలు.

 

 

2. కాంక్రీట్ ట్యాంకులు

కాంక్రీట్ ట్యాంకులు వాటి బలం మన్నికకు ప్రసిద్ధి చెందాయి. ఈ ట్యాంకులు సాధారణంగా రీన్‌ఫోర్స్డ్ కాంక్రీటును ఉపయోగించి ఆన్-సైట్‌లో నిర్మించబడతాయి, ఇది పటిష్టంగా, దీర్ఘకాలం నిల్వ ఉండే పరిష్కారాన్ని అందిస్తాయి. వ్యవసాయం, అగ్నిమాపక, పురపాలక అవసరాల కోసం నీటి నిల్వతో సహా పెద్ద ఎత్తున వాణిజ్య లేదా పారిశ్రామిక అప్లికేషన్ల కోసం వీటిని సాధారణంగా ఉపయోగిస్తారు.

కాంక్రీట్ ట్యాంకుల కొన్ని ముఖ్య లక్షణాలు ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:

 

  • అనేక దశాబ్దాల పాటు దీర్ఘకాలిక మన్నిక
  • అద్భుతమైన అగ్ని నిరోధకత, స్థిరత్వం
  • పెద్ద ఎత్తున వాణిజ్య లేదా పారిశ్రామిక నీటి నిల్వకు అనువైనది
  • ఉష్ణోగ్రత మార్పులకు ఇన్సులేషన్ ని అందిస్తుంది
  • పెద్ద ఎత్తున వాణిజ్య లేదా పారిశ్రామిక నీటి నిల్వకు అనువైనది

 

3. స్టీల్ ట్యాంకులు

స్టీల్ ట్యాంకులు వాటి బలం, విశ్వసనీయత, వైవిధ్యతకి ప్రసిద్ధి చెందాయి. వివిధ రకాల స్టీల్ మెటీరియల్స్ నీ, టెక్నిక్స్ నీ ఉపయోగించి వాటిని నిర్మించవచ్చు. ప్రతి దానికీ దానివైన సొంత విశేషాలు ఉంటాయి. స్టీల్ తో తయారు చేయబడిన కొన్ని విభిన్న రకాల నీటి ట్యాంకులను అన్వేషిద్దాం:

 

a) కార్బన్ వెల్డెడ్ స్టీల్ ట్యాంకులు

కార్బన్ వెల్డెడ్ స్టీల్ ట్యాంకులు స్టీల్ ప్లేట్‌లను కలిపి వెల్డింగ్ చేయడం ద్వారా తయారు చేయబడతాయి. అవి చాలా మన్నికైనవి, తుప్పు పట్టకుండా ఉంటాయి నిర్దిష్ట నిల్వ అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించబడతాయి. అవి పరిమాణం ఆకృతిలో వైవిధ్యంగా ఉండి వివిధ నిల్వ సామర్థ్యాలకు అనుగుణంగా ఉంటాయి. కార్బన్ వెల్డెడ్ స్టీల్ ట్యాంకులు భద్రతనీ,  విశ్వసనీయమైన కంటైన్మెంట్ నీ అందిస్తూ త్రాగునీరు, మురుగునీరు, రసాయనాలు పెట్రోలియం ఉత్పత్తులను నిల్వ చేయడానికి విస్తృతంగా ఉపయోగించబడతాయి. 

 

బి) బోల్టెడ్ స్టీల్ ట్యాంకులు

బోల్టెడ్ స్టీల్ ట్యాంకులు ముందుగా తయారుచేసిన స్టీల్ ప్యానెల్‌లను బోల్ట్ చేయడం ద్వారా నిర్మించబడతాయి. అవి సైజు పరంగా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, వాటిని సులభంగా విస్తరించవచ్చు లేదా స్థలమార్పిడి చేయవచ్చు. ఈ ట్యాంకులు హెవీ-డ్యూటీకి చెందినవి, గణనీయమైన బరువు మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటిని కోరుకునే పారిశ్రామిక లేదా వాణిజ్య అప్లికేషన్లకు అనుకూలంగా ఉంటాయి. వాననీటిని భద్రపరచడం, మురుగునీటి శుద్ధీకరణ, త్రాగునీటి నిల్వతో సహా వాణిజ్య పారిశ్రామిక నీటి నిల్వ అవసరాల కోసం వీటిని తరచుగా ఉపయోగిస్తారు.

 

సి) ముడతలు పెట్టిన ఉక్కు ట్యాంకులు

కొర్రుగేటెడ్ స్టీల్ ట్యాంకులు కొర్రుగేటెడ్ డిజైన్‌తో గాల్వనైజ్డ్ స్టీల్ ప్యానెల్‌లతో తయారు చేయబడతాయి. అవి నిర్మాణ బలాన్ని అందిస్తాయి. బాహ్య బలాలను ప్రతిఘటిస్తాయి. నేల కంటే ఎత్తు మీద ఇన్స్టలేషన్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. కొర్రుగేటెడ్ స్టీల్ ట్యాంకులు సాధారణంగా పశువులకు నీరు త్రాగడం, నీటిపారుదల వంటి వ్యవసాయ అవసరాలకూ, అలాగే అగ్ని ప్రమాదాల నుంచి రక్షించే సిస్టమ్స్ కోసం ఉపయోగిస్తారు.



డి) స్టెయిన్లెస్ స్టీల్ నీటి నిల్వ ట్యాంకులు

స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులు అసాధారణమైన మన్నిక, తుప్పు పట్టకుండా ఉంటాయి. అవి త్రాగునీరు, ఆహారం, పానీయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, అధిక స్థాయి పరిశుభ్రత అవసరమయ్యే వివిధ లిక్విడ్స్ ని నిల్వ చేయడంలో విస్తారమైన ఉపయోగాన్ని అందిస్తాయి. అంతే కాక స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంకులు సముద్ర వాతావరణంలో ఉపయోగించడానికీ లేదా మురుగునీటి శుద్ధీకరణ సౌకర్యాల వంటి తీవ్రతరమైన వాతావరణ పరిస్థితులకి బాగా సరిపోతాయి. నీటి నాణ్యతను నిర్వహించడం, బాహ్య బలాలను నిరోధించడం, దీర్ఘకాలికంగా విశ్వసనీయమైన మన్నిక కలిగి ఉండడం వంటి కారణాలతో  గొప్ప సామర్థ్యం, అధిక-నాణ్యత కలిగి ఉండే నిల్వ పరిష్కారాలను కోరుకునే పరిశ్రమలకు వాటిని గొప్ప ఎంపికగా చేస్తుంది.

 

 

4. ఫైబర్ గ్లాస్ ట్యాంకులు

ఫైబర్ గ్లాస్ ట్యాంకులు తేలికైనవే గానీ బలంగా ఉంటాయి, దీర్ఘకాలిక మన్నికని కలిగి ఉంటాయి. వీటిని ఫైబర్ గ్లాస్ మరియు రెసిన్ పొరలను ఉపయోగించి నిర్మించడం జరుగుతుంది. తుప్పు, రసాయన నష్టాన్ని ఇవి అద్భుతంగా అడ్డుకుంటాయి. ఫైబర్ గ్లాస్ తో తయారు చేయబడిన రెండు సాధారణ రకాల వాటర్  ట్యాంకులు ఇక్కడ ఉన్నాయి:

 

a) భూగర్భ ఫైబర్ గ్లాస్ ట్యాంకులు

అండర్‌గ్రౌండ్ ఫైబర్‌గ్లాస్ ట్యాంకులు సర్ఫేస్ క్రింద డిస్క్రీట్ వాటర్ స్టోరేజి కోసం ఇంజినీరింగ్ చేయబడ్డాయి, ఇవి భంగపరచని పరిష్కారాల్ని అందిస్తాయి. తుప్పు పట్టని అసాధారణమైన లక్షణాలు, భూ రసాయనాలకు నిరోధకత కలిగిన ఈ ట్యాంకులు దీర్ఘకాలిక మన్నికనీ, నీటి నాణ్యత నిర్వహణనీ కలిగి ఉంటాయి. ఇవి నివాస, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు అనువైనవి. ఈ ట్యాంకులు వర్షపు నీటి సంరక్షణ, నీటిపారుదల సెప్టిక్ సిస్టమ్స్ కి బాగా పని చేస్తాయి. సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థని అందిస్తాయి.

 

బి) భూమికి ఎత్తు మీద ఫైబర్ గ్లాస్ నిల్వ ట్యాంకులు

భూమికి ఎత్తు మీద ఫైబర్ గ్లాస్ ట్యాంకులు నిర్దిష్ట అవసరాలకు సులభంగా సరిపోయే వైవిధ్యాన్ని అందిస్తాయి. వీటి తేలికపాటి నిర్మాణం, ఇన్శ్టలేషన్, రవాణా  సులభంగా జరగడం అనే అంశాలు వీటిని మరింత అందుబాటులోకి తెచ్చాయి. విశ్వసనీయత, నిర్మాణ సమగ్రత ఉండడం వల్ల ఈ ట్యాంకులు పారిశ్రామిక ప్రక్రియలు, రసాయన నిల్వలు, నీటి శుద్ధి వంటి అప్లికేషన్లలో విస్తారంగా ఉపయోగిస్తారు.  తుప్పు పట్టకుండా ఉండే ఉన్నతమైన లక్షణం కలిగి ఉండడం, విభిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఉండడం, విలువైన పదార్థాలని అత్యంత సురక్షితంగా ఉంచడం సాధ్యం కావడం వల్ల భూమి కంటే ఎత్తు మీద నిల్వ అవసరాలకు వీటికి ప్రాధాన్యతనిస్తారు.



మీ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి నమ్మకమైన నీటి సరఫరాను నిర్ధారించడానికి సరైన నీటి నిల్వ ట్యాంక్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మన్నిక, ఖర్చు, నిర్వహణ అవసరాలు ఉద్దేశించిన వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా, వివిధ రకాల వాటర్ ట్యాంక్ రకాలను ఎంచుకోవడం చాలా సులభం అవుతుంది. ఈ కారకాలను అంచనా వేయగలిగితే మీరు మీ అవసరాలను తీర్చగల ఖచ్చితమైన వాటర్ ట్యాంక్‌ను ఎంచుకోగలుగుతారు. అలాంటి వాటర్ ట్యాంకులు దీర్ఘకాలిక మన్నికతో బాటు మనశ్శాంతిని కూడా అందిస్తాయి.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....