Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

గృహ నిర్మాణ దశలు

మీ ఇంటిని నిర్మించుకోవడమన్నది మీరు మీ జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి. కాబట్టి మీ ఇంటి నిర్మాణంలో ప్రతి అడుగులులో ఏం చేయాలనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంటి నిర్మాణ ప్రయాణంలోని వివిధ దశలను మీరు తెలుసుకోవడం ముఖ్యం, దీనివల్ల మీరు మీ ఇంటి నిర్మాణాన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు మరియు జాడ తెలుసుకోగలుగుతారు.

logo

Step No.1

బలమైన మరియు గట్టి పునాది వేయడానికి మీ ఇంటిని నిర్మించడానికి మొదటి చర్య. మొదటగా, స్థలంలో రాళ్ళు రప్పలు మరియు శిథిలాలు లేకుండా చూడాలి. తవ్వకం ప్రారంభించే ముందు, లేఅవుట్ మార్కింగ్లు ప్లాన్ ప్రకారం ఉన్నాయని నిర్థారించుకోవాలి. మీ నిర్మాణ టీమ్ సైట్ని చదును చేస్తుంది, మరియు పునాది వేసేందుకు రంధ్రాలు మరియు కందకాలు చేస్తుంది.

కాంక్రీట్ని పోయగానే, దీనిని సెట్ అయ్యేందుకు వదిలేయాలి మరియు బాగా క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ చేసిన తరువాత, వాటర్ప్రూఫింగ్ మరియు చెదలు నిరోధక చికిత్స చేయడం ఉత్తమంగా ఉంటుంది. డ్యాంప్ప్రూఫ్ కోర్సు పరవడానికి అల్ట్రాటెక్ ILW+ అనువైనది. తరువాత, బురదతో పునాది గోడల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మీ టీమ్ బ్యాక్ఫిల్ చేస్తుంది.

Step No.2

పునాది సెట్ అయితే, తదుపరి చర్య ఇంటి నిర్మాణం చేయడమే. తలుపులు మరియు కిటికీలకు ఫ్రేమ్లతో పాటు ప్లింత్లు, బీమ్లు, కాలమ్స్, గోడలు, రూఫ్ స్లాబ్లను ఇన్స్టాల్ చేయడం దీనిలో ఉంటుంది. కొత్తగా నిర్మించిన మీ ఇల్లు కచ్చితంగా ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తూ గదులను విభజించడం జరుగుతుంది. ఇంటి చుట్టూ ఉన్న బీమ్స్ మరియు కాలమ్స్ని రాసిపెట్టుకోండి, ఎందుకంటే స్ట్రక్చర్లో అత్యధిక భారాన్ని మోసేది అవే. నిర్మాణంలో ఇది అత్యంత ముఖ్యమైన దశ, ఎందుకంటే ఇది మీ ఇంటి దృఢత్వం మరియు స్ట్రక్చర్ని నిర్ణయిస్తుంది. కాబట్టి కొత్తగా నిర్మించిన మీ ఇంటికి పర్యవేక్షణ కీలకం.

Step No.3

మీ ఇంటి యొక్క కాంక్రీట్ నిర్మాణం సిద్ధమైన తరువాత, మీరు ప్లంబింగ్ మరియు ఎలక్ట్రికల్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడం మీరు ప్రారంభించవచ్చు. గృహ ప్రవేశం చేసిన తరువాత ఎలక్ట్రికల్‌ బోర్డులు మరియు స్విచ్‌లు ఎలాంటి అవాంతరం లేకుండా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. దాచివుంచిన ఎలక్ట్రికల్‌ పని కోసం, వైర్‌ల పైపులు గల పివిసి కండ్యూట్‌ని ప్లాస్టర్‌కి ముందు గోడల లోపల పెట్టాలి. ఇది అందంగా కనిపించడమే కాకుండా, వైర్‌లను తేమ, ఉష్ణోగ్రత మరియు ఎలుకల నుంచి రక్షిస్తుంది. ఒకసారి ఈ పని చేయగానే, గోడలకు ప్లాస్టర్‌ చేయాలి.

Step No.4

వాల్ ఫినిష్తో గోడలకు ప్లాస్టర్ చేస్తే, తలుపులు మరియు కిటికీలు బిగించాలి. కిటికీలు మరియు తలుపులు ఇన్సులేషన్ మరియు వెంటిలేషన్ అందిస్తాయి, కాబట్టి ఉపయోగించవలసిన సరైన మెటీరియల్స్ గురించి మీ కాంట్రాక్టరుతో మాట్లాడండి.

Step No.5

చివరిగా, మీ నిర్మాణ టీమ్‌ టైల్స్‌ పరుస్తుంది, ఎలక్ట్రికల్‌ బోర్డులు, క్యాబినెట్‌లు, కిచెన్‌లో కావలసినవి ఏర్పాటు చేస్తుంది. భాగాలన్నిటినీ ఇన్‌స్టాల్‌ చేసిన మీదట,మీ ఇంటికి వాల్‌పేపర్‌లతో పెయింట్‌ లేదా ప్లాస్టర్ చేయవచ్చు. మీ ఇంటికి ఫినిషింగ్‌ డెకరేషన్‌ గురించి మీ కుటుంబ సభ్యులను సంప్రదించండి.

కథనాన్ని భాగస్వామ్యం చేయండి :


సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....