వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి



కాంక్రీట్ సిమెంట్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం

కాంక్రీటు మరియు సిమెంట్ పదాల్ని తరచుగా ఒకదానికొకటి వాడుతుంటాం. కానీ అవి వాస్తవానికి ప్రత్యేకమైన లక్షణాలు, ప్రయోజనాలు కలిగిన వేర్వేరు పదార్థాలు. ఈ బ్లాగ్‌లో కాంక్రీట్ కీ సిమెంట్ కీ మధ్య వ్యత్యాసం, వాటి లక్షణాలు, నిర్మాణ ప్రాజెక్టులలో వాటి పాత్ర గురించి మనం తెలుసుకుందాం.

Share:


నిర్మాణం విషయానికి వస్తే, ప్రజలు తరచుగా "కాంక్రీటు"కి బదులు "సిమెంట్" అనీ "సిమెంట్" కి బదులు "కాంక్రీటు" అనీ వాడుతుంటారు. కానీ అవి ఒకటి కావు. సిమెంట్ అనేది సున్నపురాయి, మట్టి, షెల్స్, ఇసుక వంటి మెటీరియల్ ని ఒకదానితో ఒకటి బలంగా పట్టుకోవడానికి ఉపయోగించే జిగురు లాంటిది. అయితే కాంక్రీట్, ఇసుక, కంకర, నీరు, సిమెంట్ మిశ్రమంతో తయారుచేయబడిన బలమైన పదార్థం. ఇది ప్రాథమిక వ్యత్యాసం. కాంక్రీటుకీ, సిమెంట్ కీ మధ్య గల వ్యత్యాసాన్ని పరిశీలిద్దాం, తద్వారా మీరు నిబాండింగ్ లను బాగా అర్థం చేసుకోవచ్చు.



సిమెంట్ అంటే ఏమిటి?



కాంక్రీటు మరియు సిమెంట్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి ముందు సిమెంట్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. సిమెంట్ అనేది దాని బైండింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన నిర్మాణ సామాగ్రి. ఇది రాళ్ళు, ఇటుకలు, టైల్స్ వంటి వివిధ నిర్మాణ భాగాలు బలంగా కలిసి ఉండేలా చేస్తుంది. ఇది ప్రధానంగా సున్నపురాయి (కాల్షియం సమృద్ధిగా ఉంటుంది), ఇసుక లేదా మట్టి వంటి సిలికా అధికంగా ఉండే మెటీరియల్స్, బాక్సైట్, ఇనుప ఖనిజం వంటి అల్యూమినియం మూలకాలు, కొన్నిసార్లు షెల్స్, సుద్ద, మార్ల్, షేల్ వంటి అదనపు మూలకాలను కలిగి ఉంటుంది.

 

తయారీ ప్రక్రియలో సిమెంట్ ప్లాంట్లలో ఈ పదార్ధాలను ప్రాసెస్ చేయడం వాటిని అధిక ఉష్ణోగ్రతలకు గురి చేయడం, ఫలితంగా ఘన పదార్థం ఏర్పడుతుంది. ఈ గట్టిపడిన పదార్థం కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఫైన్ పౌడర్ గా మార్చడం జరుగుతుంది. నీటితో కలిపినప్పుడు, సిమెంట్ ఒక రసాయన ప్రతిచర్యకు లోనవుతుంది, చివరికి ఘనీభవించే పేస్ట్‌ ని ఏర్పరుస్తుంది, విభిన్న నిర్మాణ సామగ్రిని సమర్థవంతంగా బాండింగ్  చేస్తుంది.

 

కాంక్రీటు సిమెంట్ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నప్పుడు, సిమెంట్ వల్ల నిర్మాణాలకు బలాన్నీ, మన్నికనీ అందించే సామర్థ్యంతో సహా అనేక ప్రయోజనాలు అందిస్తుందని అర్థం చేసుకోవాలి. వివిధ నిర్మాణ అప్లికేషన్లలో దాని వైవిధ్యత, మంటలు, విపరీత ఉష్ణోగ్రతలకు నిరోధకత వంటి లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఇది మన ఆధునిక ప్రపంచానికి వెన్నెముకగా ఉండే భవనాలు, రోడ్లు, వంతెనలు, ఇలా లెక్కలేనన్ని ఇతర నిర్మాణాలను నిర్మించడంలో ఇది అనివార్యంగా ఉపయోగించబడుతుంది.

 

 

కాంక్రీటు అంటే ఏమిటి?



సిమెంట్ ఉపయోగానికి కీలకమైన అంశం, నీటితో కలిసినప్పుడు ప్రతిస్పందించే సామర్థ్యం. నీటితో కలిపినప్పుడు, సిమెంట్ ఒక పేస్ట్‌ లా తయారవుతుంది. ఇతర పదార్థాలతో కలిసి ఈ పేస్ట్ కాలక్రమేణా గట్టిపడుతుంది. ఇది ఘన ద్రవ్యరాశి (సాలిడ్ మాస్)గా రూపాంతరం చెందుతుంది. ఇది ఇసుక, కంకర వంటి మిశ్రమాలతో తయారై వాటిని కలిపి ఉంచి గట్టి బాండింగ్ చేసే కాంక్రీట్ అవుతుంది.

 

కాంక్రీటుకీ సిమెంట్ కీ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నప్పుడు, కాంక్రీటు అనేది సిమెంట్, ఇసుక, కంకర నీటి మిశ్రమంతో తయారైన మిశ్రమ పదార్థం అని అర్థం చేసుకోవడం చాలా అవసరం. దాని బలం, మన్నిక, వైవిధ్యత కారణంగా ఇది అత్యంత విస్తృతంగా ఉపయోగించే నిర్మాణ సామాగ్రిలో ఒకటి. కాంక్రీటు, నిర్మాణాత్మక భారాలను తట్టుకునే సామర్థ్యం, దాని అగ్ని నిరోధకత, దాని మెయింటెనెన్స్ అవసరాలు తక్కువగా ఉండడం, దాని సుదీర్ఘ జీవితకాలం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. 

 

ఇది రహదారులు, సముద్ర నిర్మాణం, భవనాలు, మౌలిక సదుపాయాలు, ఆకర్షణీయమైన అలంకరణ, రవాణా వంటి అంశాల్లో విభిన్న అప్లికేషన్లను కలిగి ఉంటుంది.


సిమెంట్ - కాంక్రీటు

 

1. కంపోజిషన్ 

కాంక్రీటుకీ సిమెంట్ కీ మధ్య ముఖ్యమైన వ్యత్యాసం వాటి కంపోజిషన్ లో ఉంది. కాంక్రీటులో సిమెంట్ ప్రధాన భాగం, ఇది సున్నపురాయి, మట్టి, షెల్స్, సిలికా ఇసుక కలయికతో తయారు చేయబడుతుంది. ఈ మెటీరియల్స్ ని గ్రైండ్ చేసి, అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసి పౌడర్ గా తయారు చేస్తారు. అయితే కాంక్రీటు, సిమెంట్, కంకర (ఇసుక మరియు కంకర), నీటి మిశ్రమంతో తయారైన మిశ్రమం. కాంక్రీటుకీ, సిమెంట్ కీ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలలో ఇది ఒకటి.

 

2. పని

ఈ పదార్థాల పని విధానం కూడా కాంక్రీటు సిమెంట్ మధ్య కీలక వ్యత్యాసం. సిమెంట్‌ను నీటితో కలిపి పేస్ట్‌ గా తయారు చేస్తారు, ఇది కంకరలను కలిపి ఉంచే బైండర్‌గా పనిచేస్తుంది. సిమెంట్ కీ నీటి కీ మధ్య జరిగే ప్రతిచర్యని ఆర్ద్రీకరణ అని పిలుస్తారు, పేస్ట్ గట్టిపడటానికి పటిష్టమైన నిర్మాణాన్ని సృష్టించడానికి కారణమవుతుంది. కాలక్రమేణా, కాంక్రీటు మిశ్రమం గట్టిపడి దీర్ఘకాలికంగా మన్నుతుంది.

 

3. ఉపయోగాలు

కాంక్రీటుకీ సిమెంట్ కీ మధ్య మరొక వ్యత్యాసం వాటి వినియోగం.  సిమెంట్ ప్రధానంగా కాంక్రీటు ఉత్పత్తిలో ఉపయోగించబడుతుంది. ఇది నిర్మాణ పరిశ్రమలో అనేక అప్లికేషన్లని కలిగి ఉంది. కాంక్రీటు సాధారణంగా పునాదులు, గోడలు, అంతస్తులు, రోడ్లు, వంతెనలు ఇతర నిర్మాణాలను నిర్మించడానికి ఉపయోగిస్తారు. సిమెంట్ కూడా మోర్టార్ ఉత్పత్తిలో ఇటుకలు, రాళ్లు పలకలకు బాండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించబడుతుంది. ఇది మట్టిని స్టెబిలైజ్ చేయడానికీ, నిర్మాణ మరమ్మతులకు ఉపయోగించవచ్చు.

 

4. రకాలు

చివరగా, కాంక్రీటుకీ సిమెంట్ కీ మధ్య వ్యత్యాసం కూడా వాటి రకాల్లో ఉంటుంది. సిమెంట్ రకాలు నిర్మాణంలో ఉపయోగించే పోర్ట్‌ ల్యాండ్ సిమెంట్, బ్లెండెడ్ సిమెంట్, నిర్మాణ ప్రాజెక్టులలో ఉపయోగించే వైట్ సిమెంట్ డ్యామ్‌లు పునాదుల కోసం తక్కువ వేడి సిమెంట్ వంటి రకాలు ఉన్నాయి. కాంక్రీటు రకాలు లైమ్ కాంక్రీట్, సిమెంట్ కాంక్రీట్ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ నుండి ఉంటాయి. ఈ రకాలు, వాటి మెటీరియల్స్ లోనూ ప్రయోజనంలోనూ విభిన్నంగా ఉంటాయి.



సారాంశంలో, సిమెంట్ మరియు కాంక్రీటు విభిన్నమైనవి, కానీ దగ్గరి సంబంధం ఉన్న నిర్మాణ వస్తువులు. సిమెంట్ పదార్థాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచుతుంది, అయితే కాంక్రీటు సిమెంట్, కంకర నీటిని మిళితం చేస్తుంది. కాంక్రీటు వైవిధ్యంగా ఉంటుంది. ఇది పునాదులు, గోడలు, రోడ్లు మరిన్నింటిలో ఉపయోగించబడుతుంది. సిమెంట్ రకాల్లో పోర్ట్ ల్యాండ్, బ్లెండెడ్, వైట్, వేగవంతమైన గట్టిపడటం, తక్కువ వేడిని కలిగి ఉండేవి ఉంటాయి. కాంక్రీటుకీ, సిమెంట్ మధ్య ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం భవిష్యత్ నిర్మాణ నిర్ణయాలకు ఉపయోగపడుతుంది.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....