కాంక్రీటు విషయంలో హనీకోంబింగ్ అనేది ఫార్మ్‌వర్క్‌ని అసంపూర్తిగా నింపడం వల్ల లేదా కాంక్రీటు కుదింపు సరిగా చేయని కారణంగా గట్టిపడిన కాంక్రీటులో మిగిలిపోయిన ఖాళీలు లేదా కావిటీలను సూచిస్తుంది. కాంక్రీటులో హనీకోంబింగ్ కాంక్రీటు నిర్మాణ సమగ్రతను బలహీనపరుస్తుంది. ఈ ప్రదేశంలోకి నీరు చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది, అది రీఇన్‌ఫోర్స్‌మెంట్ తుప్పు పట్టడానికీ, ఇతర మన్నిక సమస్యలకీ దారితీస్తుంది.
అయినప్పటికీ, హనీకోంబింగ్‌ని నిరోధించడానికి మీరు చేయగల అనేక విషయాలు ఉన్నాయి. ఈ బ్లాగ్‌లో, హనీకోంబింగ్‌కి సంబంధించిన ప్రతిదానికీ, దాని కారణాల నుండి దాని మరమ్మత్తు వరకు, దానిని పరిష్కరించే మార్గాల వరకు మనం పరిశీలిద్దాం. ముందుగా కారణాలను పరిశీలిద్దాం.
కాంక్రీటులో హనీకోంబింగ్ ఏర్పడటానికి కారణాలు:
కాంక్రీటులో హనీకోంబింగ్ సాధారణంగా క్రింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారకాల వల్ల సంభవిస్తుంది: సరైన సంపీడనం (కంపాక్షన్) లేకపోవడం:
1. సరిగా లేని కంపాక్షన్
ఇది ట్రాప్డ్ ఎయిర్ వాయిడ్స్ (బలవంతంగా ఏర్పడ్డ గాలి ఖాళీల)కి దారి తీస్తుంది, ఇది హనీకోంబింగ్ ఏర్పడటానికి కారణమవుతుంది. ఇది సాధారణంగా కాంక్రీటు ప్లేస్‌మెంట్ కుదింపు సమయంలో తగినంత వైబ్రేషన్ ఇవ్వకపోవడం దీనికి కారణంగా ఉంటుంది.
2. సరిగా లేని మిక్స్ నిష్పత్తి
తప్పుగా కలిపిన మిక్స్ నిష్పత్తిని ఉపయోగించడం వలన కాంక్రీటులో హనీకోంబింగ్ ఏర్పడుతుంది. ఉదాహరణకు, మిక్స్‌లో ఎక్కువ నీటిని ఉపయోగించడం వలన కాంక్రీటు మరింత జారుడుగా తయారవుతుంది, ఇది గట్టిగా ఉండే కంకరని వేరుచేస్తుంది, ఆ విధంగా అది వేరే చోట సెటిల్ అవడానికి దారితీస్తుంది.
3. ఫార్మ్‌వర్క్ సమస్యలు
పేలవంగా నిర్మించబడిన ఫార్మ్‌వర్క్ కూడా హనీకోంబింగ్‌కి దారి తీస్తుంది. ఫార్మ్‌వర్క్ సరిగ్గా మూసివేయబడకపోతే లేదా గట్టిగా సరిపోకపోతే, కాంక్రీటు బయటకు రావచ్చు, ఫలితంగా పని అంతా పూర్తయిపోయిన తర్వాత ప్రొడక్ట్‌లో ఖాళీలు, అసమానతలు ఏర్పడతాయి. దీన్ని నివారించడానికి, షట్టరింగ్ సాధారణం. నిర్మాణంలో షట్టరింగ్ అనేది కాంక్రీటు సెట్ చేయబడే వరకు సపోర్ట్‌ని అందించడానికి నిర్మాణంలో ఉపయోగించే తాత్కాలిక నిర్మాణం.
4. సరిగా చేయని క్యూరింగ్
కాంక్రీటు సరిగ్గా క్యూర్ చేయకపోతే, అది హనీకోంబింగ్‌తో సహా పగుళ్లు, ఖాళీలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాంక్రీటు బలాన్నీ, మన్నికనీ పొందేలా చేయడానికి సరైన క్యూరింగ్ అవసరం.
5. కాంక్రీట్ పోసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు
చాలా దూరం నుండి కాంక్రీట్ పోయడం లేదా తప్పు పరికరాలను ఉపయోగించడం వంటి తప్పు ప్లేస్‌మెంట్ పద్ధతులు కూడా హనీకోంబింగ్ ఏర్పడటానికి కారణమవుతాయి. కట్టడం పూర్తయ్యేసరికి ఆ నిర్మాణం దీర్ఘకాల మన్నిక కలిగి ఉండడానికి కాంక్రీటులో హనీకోంబింగ్ మూల కారణాలను గుర్తించడం, అలాగే వాటిని నివారించడం చాలా ముఖ్యం.