Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


బ్రిక్ మాసనరీ లో రకాలు, ఇంకా నిర్మాణంలో ఉపయోగించే సాధనాలను అర్థం చేసుకోవడం

బ్రిక్ మాసనరీతో నిర్మాణం అంటే వివిధ రకాల ఇటుకలలో ఖాళీలను పూరించడానికి నిర్మాణంలో ఉపయోగించే ఒక పద్ధతి. ఇంటి నిర్మాణంపై మీ అవగాహనను పెంచుకోవడానికి వివిధ రకాల బ్రిక్ మాసనరీ తో చేసే నిర్మాణం గురించిన పూర్తి వివరాలతో మీ గైడ్ ఇక్కడ ఉంది.

Share:


బ్రిక్ మాసనరీ తో తయారు చేయబడే నిర్మాణం, బలానికీ, మన్నికకీ, అందానికీ ప్రసిద్ధి చెందిన పురాతన నిర్మాణ పద్ధతికి చెందినది. ఇది ఇటుకలను జాగ్రత్తగా పేర్చి, వాటిని మోర్టార్‌తో బిగిసేలా చేసే పని విధానం. కాలం గడిచే కొద్దీ వివిధ ఇటుకల తయారీ పద్ధతులు వెలుగులోకి వచ్చాయి, ప్రతి పద్ధతికీ కూడా దానిదైన ఏవో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఈ బ్లాగ్‌లో, ఈ సాంప్రదాయ నిర్మాణ విధానాన్ని బాగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి మేము ఈ బ్రిక్ మాసనరీ పద్ధతులను తెలుసుకుందాం.


బ్రిక్ మాసనరీ అంటే ఏమిటి?



"బ్రిక్ మాసనరీ అనేది నిర్మాణ టెక్నిక్, ఇది నిర్మాణాలను రూపొందించడానికి వివిధ రకాల ఇటుకలు, మోర్టార్లను ఉపయోగించడం. ఇది ప్రాచీనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన నిర్మాణ పద్ధతుల్లో ఒకటి. ఇది బలం, మన్నిక, సౌందర్యం, ఆకర్షణకు ప్రసిద్ధి చెందిన పద్ధతి. బ్రిక్ మాసనరీ విధానంలో, ఇటుకలు ఒక నిర్దిష్ట నమూనాలో జాగ్రత్తగా పేర్చబడతాయి, మధ్య మధ్యలో మోర్టార్‌తో కలిపి బంధించబడి బలమైన, స్థిరమైన నిర్మాణాన్ని సృష్టిస్తాయి.  

 

మట్టి, ఇంకా ఇతర మెటీరియల్‌తో తయారు చేయబడిన ఇటుకలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, అవి వివిధ రకాల సైజులు, రంగులు, టెక్స్చర్‌లో ఉంటాయి. అవి బాండ్ పాటర్న్స్ అని పిలవబడే వివిధ రకాల మోడల్స్ లో అమర్చబడి ఉంటాయి, ఇవి నిర్మాణం, బలం, స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి. బాండ్ పాటర్న్స్ లో స్ట్రెచర్ బాండ్, హెడర్ బాండ్, ఫ్లెమిష్ బాండ్, ఇంగ్లీష్ బాండ్, ఇంకా మరిన్నో రకాలు ఉన్నాయి. ప్రతి బాండ్ పాటర్న్ దానిదైన ప్రత్యేకశైలి కూడిన బ్రిక్ (ఇటుక) అరేంజిమెంట్‌ని కలిగి ఉంటుంది, అవన్నీ వివిధ రకాలుగా వాటివైన ప్రత్యేక సౌందర్యంతో అలరారుతూ ఉంటాయి. 

 

ఇటుక, మాసనరీ బలాన్నీ, మన్నికనీ పెంచడానికి మోర్టార్, బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించబడుతుంది. మోర్టార్ సిమెంట్, ఇసుక, నీటి మిశ్రమం నుండి తయారవుతుంది,  ప్రాజెక్ట్‌ అవసరాలను బట్టి దాని కంపోజిషన్ మారుతూ ఉంటుంది. ఇది ఇటుకల మధ్య అంతరాలను నింపుతుంది, స్థిరత్వాన్ని అందిస్తుంది, తేమ చొచ్చుకుపోకుండా చేస్తుంది. ఇప్పుడు మనం ఇటుక, మాసనరీ కి గల మౌలిక విషయాల్ని అర్థం చేసుకున్నాము, ఇటుక, మాసనరీకి సంబంధించిన వివిధ రకాల పద్ధతులను అన్వేషిద్దాం."

 

 

ఇటుక, మాసనరీలో రకాలు

బ్రిక్ మాసనరీ పద్ధతులను  ఉపయోగించే మోర్టార్ రకం, ఇటుకలను పెట్టే విధానం, అలాగే ఇటుకల మధ్య సృష్టించబడిన బంధాల రకం ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. బ్రిక్ మాసనరీ రెండు సాధారణ రకాలు:

 

1. అడుసుతో ఇటుక మాసనరీ వర్క్



"బంకమట్టిగా కూడా పిలవబడే అడుసు, ఎంతో ప్రాచీనకాలంగా నిర్మాణ సామాగ్రిగా ఉపయోగపడుతూ ఉంది.  అడుసుని వేస్తూ ఇటుకలతో మాసనరీ చేసినప్పుడు సిమెంట్‌కి బదులుగా అడుసు మోర్టార్‌గా పనిచేస్తుంది. రెండు ఇటుకల మధ్యనా అడుసు మిశ్రమాన్ని బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. ఇది సిమెంట్ మోర్టార్ కంటే ఎక్కువ అనువైనది. ఈ సౌలభ్యత, నిర్మాణాలకి భూమి కదలికలను మెరుగ్గా మెయింటెయిన్ చేయడానికి సహాయపడుతుంది. మెరుగైన వేడినీ, సౌండ్ ఇన్సులేషన్‌ని అందిస్తుంది. అడుసుతో ఇటుకల్ని కలిపే ఈ పద్ధతి సాధారణంగా సాంప్రదాయ లేదా గ్రామీణ భవనాలలో కనిపిస్తుంది.

 

ఈ ప్రత్యేక రకం ఇటుక తాపీ పని, స్థానిక మెటీరియల్‌ని వినియోగించి చేయడం వల్ల వేడికి తట్టుకునే మంచి ఇన్సులేషన్‌గా ఉంటుంది, పని చేయడం సులువుగా ఉంటుంది, మరమ్మత్తు చేయడం సులభం,  భవనాలకు ఒక గ్రామీణ సంప్రదాయ రూపాన్ని అందిస్తుంది. తద్వారా ఇది తక్కువ ఖర్చుతో సహా వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. "

 

2. సిమెంట్‌తో ఇటుక తాపీ పని



"సిమెంటుతో బ్రిక్ మాసనరీ చేయడమనేది ఆధునిక నిర్మాణంలో సాధారణంగా ఉపయోగించే రకం. ఇది బలమైన, దీర్ఘకాలిక నిర్మాణాలను రూపొందించడానికి సిమెంట్ మోర్టార్ ని బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తుంది. డిజైన్ అవసరాల ఆధారంగా స్ట్రెచర్ లేదా హెడర్ బాండ్ వంటి వివిధ నమూనాలలో ఇటుకలు అమర్చబడి ఉంటాయి. ఈ రకమైన బ్రిక్ మాసనరీ బలమైన, స్థిరమైన, మన్నికైన భవనాలను అందిస్తుంది.

 

ఈ రకమైన ఇటుక తాపీ పనిలో అధిక నిర్మాణ బలం ఉంటుంది, దీనికి మన్నిక ఎక్కువ, తేమ పట్టకుండా అగ్ని ప్రమాదాలు, చెదలు పట్టి పాడవకుండా నిరోధకత ఉంటుంది, ఇది విస్తృత శ్రేణి డిజైన్ అవకాశాలను అందిస్తూ, అత్యాధునికంగానూ, వంకలేని సౌందర్యంతోనూ అలరారుతూ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. 

ఇది కూడా చదవండి: ఇటుక నాణ్యతను ఎలా పరిశీలించాలి?

ఇప్పుడు మనం వివిధ పద్ధతులలో ఉపయోగించే వివిధ రకాల బ్రిక్ మాసనరీ సాధనాల గురించి తెలుసుకుందాం. "

 

 

బ్రిక్ మాసనరీ సాధనాలు, పరికరాల రకాలు

 

1. సుత్తి



బ్రిక్ మాసనరీ నిర్మాణంలో ఉపయోగించే మరొక కీలకమైన సాధనం సుత్తి. దానితో విస్తృత శ్రేణి పనులకు ఇది అనివార్యమైనది. ప్రధానంగా ఒక సుత్తి ఇటుకలను చిన్న ముక్కలుగా విడగొట్టడానికి, అంటే ప్రత్యేకించి సర్దుబాట్లు లేదా ఆ ప్రాంతానికి అనుకూలంగా సర్దుబాటు చేయడం అవసరమైనప్పుడు ఉపయోగించబడుతుంది.  పైగా, నిర్మాణం చేసే సమయంలో వాటిని ఆ యా స్థానాల్లో గట్టిగా కొట్టి లోపలికి నొక్కడం, సర్దుబాటు చేయడం కోసం కూడా  సుత్తులు ఉపయోగించబడతాయి. ఇది ఇటుకలు సురక్షితంగా పెట్టబడేలా, సరిగ్గా అలైన్ చేయబడేలా చూస్తుంది. 

 

2. తాపీ (ట్రోవెల్)



"తాపీ అనేది చేతిలో ఇమిడే సాధనం, దీనిని ఇటుకలతో చేసే నిర్మాణానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. నిర్మాణ ప్రక్రియలో మోర్టార్‌ని పరచడం, ఒక షేప్‌లోకి తీసుకురావడం దీని ప్రాథమిక ఉద్దేశ్యం. 

 

ఇది ఇటుకల మధ్య సురక్షితమైన బంధం ఉండేలా చూస్తుంది, నిర్మాణం మొత్తం బలాన్నీ, స్థిరత్వాన్నీ పెంచుతుంది. ఇటుకల ఉపరితలం నుండి అదనపు మోర్టార్‌ని తీసివేసేందుకు, మోర్టార్ జాయింట్లకి చక్కటి ఫినిషింగ్ ఇవ్వడానికీ, అందమైన,  ఆకర్షణీయమైన ఫినిషింగ్స్ ఇవ్వడానికి కూడా తాపీలని ఉపయోగించవచ్చు."

 

3. స్పిరిట్ లెవల్



స్పిరిట్ లెవల్ అనేది బ్రిక్ మాసనరీ లో ఒక ముఖ్యమైన సాధనం, ఇది గోడ అలైన్‌మెంట్‌ చాలా ఖచ్చితంగా ఉందని గ్యారంటీ ఇస్తుంది. అడ్డంగా, నిలువుగా ఉండే సమతలాల్ని రెండింటినీ చెక్ చేయడం ద్వారా ఇటుకలు సరైన లెవల్లో ఉన్నాయనీ మరియు వడంబం (ప్లంబ్) వేయబడిందనీ నిర్ధారించుకోవచ్చు. ఈ ఖచ్చితత్వం అంతిమంగా ఇటుక పనికి నిర్మాణ సమగ్రతనీ, ఇంకా  సౌందర్య ఆకర్షణను పెంచుతుంది.

 

4. జాయింటర్



జాయింటర్ అనేది ఇటుక తాపీ పనిలో శుభ్రమైన, మృదువైన మోర్టార్ జాయింట్లని క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేక సాధనం. ఇది ఒక తుది రూపాన్ని అందిస్తుంది, నిర్మాణ సమగ్రతను పెంచుతుంది, నీరు చొరకుండా నిలువరించి కట్టడాన్ని రక్షిస్తుంది. ఇటుకల మధ్య మోర్టార్ ని చక్కగా షేప్ చేయడమూ, కుదించడంతో, ఇది గోడ మొత్తం మన్నికకీ, బాహ్యంగా అందంగా కనిపించేందుకూ దోహదం చేస్తుంది.

 

5. చక్రాల బండి



ఇటుకలతో తాపీ పని చేసే మేస్త్రీలకు చక్రాల బండ్లు అనివార్యమైనవి.  వారు నిర్మాణ స్థలం అంతటా ఇటుకలు, మోర్టార్, ఇంకా ఇతర మెటీరియల్స్ ని సమర్ధవంతంగా రవాణా చేస్తారు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వర్కర్లకు శారీరక శ్రమను తగ్గిస్తుంది, ఇటుకలను తీసికెళ్లడం, దించడం మరింత సునాయాసంగానూ, తక్కువ సమయంలోనూ జరిగేలా చేస్తుంది.

 

6. టేప్ కొలత



ఇటుకల మధ్య స్థిరమైన స్పేసింగ్ ని మెయింటెయిన్ చేయడంలో టేప్ కొలత కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఇటుక పొజిషనింగ్నీ, అలైన్‌మెంట్‌ ఖచ్చితత్వాన్నీ నిర్ధారిస్తుంది. ఖచ్చితమైన కొలతలు తీసుకోవడం ద్వారా ఇటుక తయారీదారులు  వాటి బలము, మొత్తం నాణ్యత బాగుండేలా జాగ్రత్తలు తీసుకుని గోడ నిర్మాణంలో యూనిఫార్మిటీకి గ్యారంటీ ఇస్తారు.



సంక్షిప్తంగా చెప్పాలంటే, ఇటుకలతో చేసే తాపీ పని వల్ల బలమైన, మన్నికైన, దృశ్యపరంగా ఆకర్షణీయమైన నిర్మాణాలను నిర్మించడానికి అనేక రకాల ఎంపికలను అందిస్తుంది. ఇటుక తాపీ పనిలో రెండు ప్రధాన రకాలు, అడుసు బ్రిక్ మాసనరీ సిమెంట్ ఇటుక తాపీ పని. అడుసు, ఇటుకతో చేసే నిర్మాణం తక్కువ ఖర్చుతో అయిపోతుంది, పైగా ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయ రూపంలో ఉంటుంది. అయితే సిమెంట్ బ్రిక్ మాసనరీ అధిక నిర్మాణ బలాన్నీ, ఆధునిక సౌందర్యాన్నీ అందిస్తుంది. ఎంచుకున్న రకంతో సంబంధం లేకుండా, ఖచ్చితమైన, సురక్షితమైన బ్రిక్ మాసనరీ పనిని సాధించడంలో సరైన సాధనాలు, పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇటుకలు మరియు మోర్టార్ ని సరైన చోట వేసి అందంగా తీర్చిదిద్దడంలో సుత్తులు, తాపీ వంటి సాధనాలు సహాయపడతాయి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి, మీరు బ్రిక్ మాసనరీపై మా వీడియోను ఇక్కడ చూడవచ్చు.



సంబంధిత కథనాలు



సిఫార్సు చేయబడిన వీడియోలు





గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....