వాస్తు శాస్త్రంలో, సానుకూల శక్తి శ్రేయస్సు కోసం ప్రారంభ బిందువుగా పరిగణించబడుతున్నందున ఇంటి ప్రధాన ద్వారం కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది. ఇంట్లోకి సామరస్యపూర్వకమైన స్వాగతించే వాతావరణాన్ని ఆహ్వానించడంలో ప్రధాన ద్వారం సరైన స్థానంలో ఉండడం, దాని దిశ, డిజైన్ వంటివి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాస్తు మార్గదర్శకాల ప్రకారం ప్రధాన ద్వారాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలో ఇక్కడ చూడండి:
1. శక్తి ప్రవాహం
వాస్తు సూత్రాల ప్రకారం, ప్రధాన ద్వారం శక్తి ద్వారంలా పనిచేస్తుంది, ఇది సానుకూల శక్తిని ఇంట్లోకి ప్రవేశపెడుతుంది. ప్రధాన ద్వారం వాస్తు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటే, ఇది నివాస స్థలమంతటా శక్తిని సాఫీగా ప్రవహింపజేస్తుంది, సానుకూలమైన, శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
2. పంచభూతాల సంతులన
వాస్తు శాస్త్రం పంచభూతాల సమతుల్యతను నొక్కి చెబుతుంది - భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. సింహద్వారం సరిగ్గా పెట్టాల్సిన చోట పెడితే, అది ఈ పంచభూతాల సమన్వయాన్నీ, ఏకీకరణనీ సాధ్యమయేలా చేస్తుంది, ఇంటిలో సమతుల్య శక్తి ప్రవాహం ఉండేలా చూస్తుంది.
3. శ్రేయస్సుకి ఆహ్వానం
ప్రధాన ద్వారం శ్రేయస్సునీ, సమృద్ధినీ లోపలికి ఆహ్వానించే ప్రవేశ మార్గమనే నమ్మకం ఉంది. సింహ ద్వారం కోసం వాస్తు సూత్రాలను అనుసరించడం వలన మీ ఇంటికి సానుకూల వైబ్రేషన్లనీ, అవకాశాలనీ ఆకర్షించడానికి సహాయపడుతుంది, నివసించేవారికి సంపూర్ణ శ్రేయస్సు, సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తుంది.
4. ఆరోగ్యవంతమైన మానసిక భావాలు
వాస్తు మార్గదర్శకాల ప్రకారం రూపొందించబడిన ప్రధాన ద్వారం ఆ ఇంట్లో నివసించేవారి మానసిక శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అందంగా ఉన్న ప్రధాన ద్వారం చక్కగా అమర్చబడితే ఇంటిలో భద్రత, శాంతి, సంతోషం, భావానికి దోహదపడుతుంది.
సింహద్వారం వాస్తు చిట్కాలు
ఇప్పుడు, ప్లేస్మెంట్, సైజు, మెటీరియల్, రంగు, నేమ్ప్లేట్, మెట్ల సంఖ్య, ఉంచాల్సిన దేవతల విగ్రహాలు మీ ఇంటి ప్రధాన ద్వారం కోసం లైటింగ్ విషయానికి వస్తే పరిగణించవలసిన కొన్ని నిర్దిష్ట వాస్తు ఆలోచనలు చిట్కాలను అన్వేషిద్దాం.
1. ప్రవేశ దిశ