టెర్రేస్ వాటర్‌ప్రూఫింగ్ విజయవంతంగా జరిగేటట్లు చూడడానికి, వరుసగా ఈ స్టెప్స్ ని అనుసరించడం చాలా ముఖ్యం. ఆ ప్రక్రియ ఎలా జరగాలో ఇక్కడ ఉంది:
1. ఉపరితలం సిద్ధం చేయడం
టెర్రేస్ ఉపరితలాన్ని పూర్తిగా శుభ్రం చేయాలి. ఏదైనా మురికిని, చెత్తను లేదా వదులుగా ఉన్న పదార్థాన్ని తీసివేసి, ఉపరితలం శుభ్రంగా, స్మూత్ గా ఎటువంటి ఎగుడు దిగుడులూ లేకుండా ఉండేలా చూసుకోండి.
2. బలహీనమైన ఉపరితలం మరమ్మత్తు లేదా బలోపేతం
టెర్రేస్ ఉపరితలంపై ఏవైనా పగుళ్లు లేదా బలహీనమైన ప్రాంతాలను గుర్తించండి, మరమ్మతు చేయండి. సీలెంట్, మోర్టార్ లేదా ఇతర ఎడిటివ్స్ ని ఉపయోగించి ఖాళీలను పూరించండి. వాటర్ ప్రూఫింగ్ పొరలకు బలమైన పునాదిని నిర్ధారించడానికి ఇది చేయాలి.
3. ప్రైమర్ వేయండి
టెర్రేస్ ఉపరితలంపై వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ అడ్హెషన్ ని మెరుగుపరచడానికి ఒక ప్రైమర్ అప్లై చేయండి. ప్రైమర్ సబ్‌స్ట్రేట్, వాటర్ ప్రూఫింగ్ పొరల మధ్య బంధాన్ని మెరుగుపరుస్తుంది.
4. బేస్ కోట్ వేయండి
ఎంచుకున్న వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ బేస్ కోటును ఉపరితలంపై సమానంగా అప్లై చేయండి. బేస్ కోట్ ప్రాథమిక వాటర్ ప్రూఫింగ్ పొరగా పనిచేస్తుంది నీటి వ్యాప్తి జరగకుండా నిరంతరాయంగా అడ్డంకిగా ఉంటుంది.
5. రీఇన్‌ఫోర్స్‌మెంట్ అప్లై చేయండి
అవసరమైతే, వాటర్ ప్రూఫింగ్ పొరను బలోపేతం చేయడానికి ఫైబర్ గ్లాస్ మెష్ లేదా అలాంటి మెటీరియల్‌తో బేస్ కోట్‌ని బలోపేతం చేయండి.
6. ఇంటర్మీడియట్ కోట్ వేయండి
అదనపు రక్షణ మన్నిక కోసం వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ ఇంటర్మీడియట్ కోటును అప్లై చేయండి. ఈ కోట్ వాటర్ ప్రూఫింగ్ అవరోధాన్ని మరింత బలపరుస్తుంది. బేస్ కోటులో ఏవైనా ఖాళీల్ని నింపుతుంది.
7. టాప్ కోట్ వేయండి
చివరి పొరను పూర్తి చేయడానికి టాప్‌కోట్‌తో ముగించండి, ఇది UV నిరోధకతను అందిస్తుంది. వాటర్ ప్రూఫింగ్ అంతర్లీన పొరలను రక్షిస్తుంది. దీర్ఘకాలిక ఫలితాలను నిర్ధారిస్తుంది.