PVC లేదా పాలీవినైల్ క్లోరైడ్ ప్యానెల్స్ ఆఫీసుకీ, ఇంటికీ రెండింటికీ సరిపోతాయి, వివిధ రంగులు, నమూనాలలో అందుబాటులో ఉంటాయి.
- ప్రయోజనాలు: ఇవి నీటికి నిరోధకతను కలిగి ఉంటాయి, ఇన్‌స్టాల్ చేయడం సులభం, కనీస నిర్వహణ అవసరం.
- ప్రతికూలతలు: PVC ప్యానెల్స్ కాల్చినప్పుడు టాక్సిన్స్‌ను విడుదల చేస్తాయి పర్యావరణ అనుకూలమైనవి కావు.
8. ఫాబ్రిక్ సింథటిక్ లెదర్ ఫాల్స్ సీలింగ్
ఈ సీలింగ్ రకం ఫాబ్రిక్ లేదా సింథటిక్ లెదర్ ని ఫ్రేమ్‌పై విస్తరించి, స్మూత్ గా కనిపించే రూపాన్ని సృష్టిస్తుంది.
- ప్రయోజనాలు: విలక్షణమైన సౌందర్యంతో ఉంటుంది. సీలింగ్ పై లోపాలను సులభంగా దాచవచ్చు. ఇది ధ్వనిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగించవచ్చు.
- ప్రతికూలతలు: ఇది అరుదుగా కనిపిస్తుంది, శుభ్రం చేయడం కష్టం. ఈ రకమైన ఫాల్స్ సీలింగ్ మిగతా వాటి మాదిరిగా ఎక్కువ కాలం ఉండకపోవచ్చు.
ఫాల్స్ సీలింగ్‌ల ధరను ప్రభావితం చేసే అంశాలు
మీ ఇంటికి ఫాల్స్ సీలింగ్‌ల ధరను లెక్కింపులోకి తీసుకున్నప్పుడు, మొత్తం ఖర్చుని ప్రభావితం చేసే వివిధ అంశాలలో కారకంగా ఉంచడం చాలా అవసరం. వివిధ రకాల ఫాల్స్ సీలింగ్‌ల ఆధారంగా ఖర్చుని ఎలా లెక్కించాలో ఒక అంచనా ఇక్కడ ఇవ్వబడుతోంది:
- మెటీరియల్స్: మెటీరియల్ ఎంపిక ఖర్చులో భారీ పాత్ర పోషిస్తుంది. సాధారణ ఫాల్స్ సీలింగ్ మెటీరియల్స్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP), జిప్సం, కలప, PVC ఫైబర్‌గ్లాస్ ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో ధర ఉంటుంది.
- డిజైన్: మరింత నైపుణ్యం కలిగిన కార్మికులు సమయం అవసరమయ్యే కాంప్లెక్స్ డిజైన్లకు ఎక్కువ ఖర్చు అవుతుంది. సింపుల్, స్ట్రైట్ లైన్స్ బడ్జెట్‌కు అనుకూలమైనవి, అయితే సంక్లిష్టమైన (ఇంట్రికేట్) నమూనాలు డిజైన్‌లు ధరల్ని పెంచుతాయి.
- ప్రాంతం: విస్తీర్ణం ఎంత పెద్దదైతే అంత ఎక్కువ ఖర్చు. ఇది మామూలు లెక్కే. ఎక్కువ మెటీరియల్స్ మరియు అంతకు సమానమైన లేబర్ ఖర్చులు.
- లేబర్ ఛార్జీలు: మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి లేబర్ ఛార్జీలు బాగా మారవచ్చు. మెట్రోపాలిటన్ నగరాల్లో చిన్న పట్టణాల కంటే ఎక్కువ లేబర్ ఖర్చులు ఉండవచ్చు.
మంచి విలువను పొందడం
ఫాల్స్ సీలింగ్‌ను ఎంచుకోవడం అనేది మీ ఇంటికి స్టైలిష్ టచ్‌ని జోడించడమే కాకుండా మెరుగైన లైటింగ్, సౌండ్‌ఫ్రూఫింగ్ లేదా థర్మల్ ఇన్సులేషన్ విషయంగా కూడా దాని పనితీరుని మెరుగుపరుస్తుంది. మీరు మీ పెట్టుబడికి అత్యుత్తమ విలువను పొందారని నిర్ధారించుకోవడానికి:
- మీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి.
- మెటీరియల్‌ను తెలివిగా ఎంచుకోండి, నాణ్యతనీ, ఖర్చునీ బ్యాలెన్స్ చేయండి.
- ఎక్కువ కాలం మెయింటెయినెన్స్ నీ, మన్నికనీ అందించే అంశాల్ని లెక్కలోకి తీసుకోండి.
చివరిగా, పేర్కొన్న అంశాల ఆధారంగా ఫాల్స్ సీలింగ్‌ల ధర బాగా మారుతుంది. అయినా కూడా, తక్కువ బడ్జెట్‌తో కూడా, మీరు మీకు అందుబాటు ధరలో ఉండేలా చూసుకుంటూనే సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవచ్చు, మీ ఇంటి సౌందర్యాన్ని పెంచడానికి వివిధ రకాల ఫాల్స్ సీలింగ్ డిజైన్‌లను ఎంచుకోవచ్చు.