కన్స్ట్రక్షన్ జాయింట్ అంటే ఏమిటి?
ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులు కాంక్రీటుని కుంచించుకుపోయేలానూ, విస్తరించుకునేలానూ చేయడానికి కారణమవుతాయి. ఇది పదార్థం పరిమాణాన్ని మారుస్తుంది. ఈ వాల్యూమ్ మార్పు పగుళ్లకీ లేదా విరగడానికీ కారణం కావచ్చు.
కాబట్టి, దీనిని నివారించడానికి, కన్‌స్ట్రక్షన్ జాయింట్లను విరగకుండా చేసే సాధనంగా ఉపయోగిస్తారు. కాంక్రీటు పరిమాణం, పొడవు పేర్కొన్న పరిమితిని మించి ఉంటే, కన్‌స్ట్రక్షన్ జాయింట్లను ఉపయోగించడం చాలా ముఖ్యమైనది. సాధారణంగా, కొద్దిపొడవు గల కాంక్రీట్ పదార్థాలకి జాయింట్లు అవసరం లేదు.
ఎందుకంటే కొద్దిపాటి పొడవు గల కాంక్రీటుని విస్తరించడానికి, చివరి బిందువు (ఎండ్ పాయింట్) దగ్గరగా ఉంటుంది. బీటలు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాంక్రీట్ పదార్థాలు నిర్దిష్ట పరిమితిని దాటితే ఈ అవకాశం పెరుగుతుంది.
కన్‌స్ట్రక్షన్ జాయింట్ దేనికి ఉపయోగించబడుతుందా అని మీరు ఆలోచిస్తున్నారా, ఇది మల్టిపుల్ (అనేక) కన్‌స్ట్రక్షన్ అంశాల డిజైనింగ్‌కీ, నిర్మాణానికీ ఉపయోగించబడుతుంది. ఎక్కువగా, వీటిలో పగుళ్లు రాకుండా చేయడానికి కాంక్రీట్ స్లాబ్‌లూ, పేవ్‌మెంట్‌ల నిర్మాణంలో ఒక క్రమబద్ధమైన అంతరంలో ఉంచుతారు.
ఇలా చెప్పిన తరువాత, వివిధ కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్ జాయింట్ రకాలను పరిశీలిద్దాం: