Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
ఉత్తి అద్దంతోనే కిటికీలు తయారు చేసే రోజులు పోయాయి. ఈనాడు అత్యున్నత సాంకేతికత ఇంకా ఆవిష్కరణ విస్త్రుత రకాల అద్దాల తయారీకి బాట వేసాయి. ఈ విభిన్న ఎంపికలు వేర్వేరు అవసరాలని తీరుస్తాయి, అవి శక్తి సామర్ధ్యం, సురక్షత, వ్యక్తిగతం ఇంకా అందం. మనం చూద్దాం ఇంటి కిటికీలకి బాగా ప్రఖ్యాతి పొందిన అద్దాలలో కొన్నిటిని.
దీన్నే టెంపర్డ్ అద్దం అని కూడా అంటారు, ఈ రకం సాధారణ గాజుకన్నా ధ్రుఢమైనది ఇంకా ఎక్కువ మన్నిక గలది. ఒక టెంపర్డ్ గాజుని వేడిమితో ట్రీట్ చేసి పగులగొట్టినపుడు హానిలేని చిన్న ముక్కలుగా అయ్యేలా డిజైన్ చేస్తారు. దాంతో గాయాలు కావు.
ఇది కిటికీలలో వాడబడే అత్యంత సాధారణ అద్దం రకం. ఇది పారదర్శకమైనది, రంగు లేనిది ఇంకా అత్యధిక వెలుతురుని ప్రసరింపచేస్తుంది. ఇది అత్యద్భుతమైన స్పష్టతని అందించి, సరిపడా సహజమైన వెలుతురుని మీ ఇంట్లోకి వచ్చేలా చేస్తుంది, దాంతో ఒక వెలుగులు నిండిన ఆకర్షక వాతావరణం నెలకొంటుంది.
టింటెడ్ అద్దం వేర్వేరు షేడ్లు ఇంకా రంగులలో లభిస్తుంది, దాంతో ఇంటి యజమానులు తమ కిటికీలను తగినట్టుగా మలుచుకుని శక్తి సామర్ధ్యాన్ని ఇంకా వ్యక్తిగతాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఇది సూర్యకాంతినుంచి వచ్చే పొడ ఇంకా వేడిని తగ్గించడంలో సాయపడుతుంది, అలా లోపలి వాతావరణం సౌకర్యవంతంగా అవుతుంది.
తరచు అలంకరణార్ధం ఉపయోగిస్తారు, స్టెయిన్డ్ అద్దంలో అందమైన రంగులు ఇంకా అతి సూక్ష్మ డిజైన్లు ఉంటాయి. స్టెయిన్డ్ గాజు అద్దాలు చర్చిలలో, చారిత్రాత్మక భవంతులలో ఇంకా ఇళ్ళల్లోనూ చూడచ్చు దాంతో కట్టడానికి ఒక విశిష్ట కళాత్మకత చేకూరుతుంది.
ఈ రకమైన అద్దానికి ఒక పలుచటి మేటాలిక్ కోటింగ్ ఉంటుంది, అది సూర్యకాంతిని ప్రతిబింబింపచేసి వేడిని పొడను తగ్గిస్తుంది. ప్రతిబింబించే అద్దం వేడి వాతావరణంలో ఉండే ఇళ్ళకి లేదా సూర్య్కాంతి తిన్నగా పడే అతి పెద్ద కిటికీలున్న ఇళ్లకి సరైనది. ఇది పెంపొందిన ప్రైవెసీని కూడా ఇస్తుంది ఎందుకంటే ప్రతిబింబించే కోటింగ్ పగటి పూట బయటనుంచి లోపల కనబడకుండా చేస్తుంది.
ఇన్సులేటెడ్ గాజులో అనేక గాజు పలకలు ఉంటాయి. ఈ డిజైన్ లోపలి ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా మెయింటెయిన్ అయ్యేలా చేస్తుంది, శక్తి వాడకాన్ని తగ్గిస్తుంది ఇంకా అద్దం మీద గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది. ఇన్సులేటెడ్ అద్దం వేడి ఇంకా చల్లని వాతావరణాల్లో ఉండే ఇళ్ళకి సరైనది ఎందుకంటే ఇది అద్భుత ఉష్ణ నిరోధకత ఇంకా సౌండ్ ప్రూఫింగ్ ఇస్తుంది.
లామినేటెడ్ అద్దం తయారీ దాన్ని తాకిడి నిరోధకంగా చేస్తుంది, దాంతో పగిలిన అద్దం వల్ల గాయం అయ్యే రిస్క్ తగ్గుతుంది. లామినేటెడ్ గాజు అద్దాలు అద్భుతమైన శబ్ద నిరోధకతని కూడా అందిస్తాయి, హానికారక యువి కిరణాలని అడ్డుకుంటాయి, దాంతో అవి రద్దీ వీధుల పక్కన లేదా వరదలకి గురయ్యే ఏరియాల కిటికీలకు తగినవి.
టెక్స్చర్డ్ అద్దం దీన్నే ప్యాటర్న్డ్ లేదా మసక అద్దం అని కూడా అంటారు, దీని ఉపరితలం పైన ప్యాటర్న్ లు, లేదా డిజైన్లు ఉండి ప్రైవెసీ ఇంకా చూడ్డానికి బాగా కనిపిస్తాయి.టెక్స్చరున్న ఉపరితలం కాంతిని విచ్ఛేదం చేసి మసకగా కనబడేలా చేసి సహజ కాంతి ప్రసరించేలా చేస్తుంది. దీన్ని తరచు బాత్రూముల్లో, ప్రవేశ మార్గాల్లో ఇంకా కాంతితో రాజీ పడకుండా ప్రైవసీ కావలసిన ఇతర ప్రాంతాల్లో వాడతారు.
లో-ఇ లేదా తక్కువ ఎమిషన్ అద్దం హానికారక యువి కిరణాలని అడ్డుకుని సురక్షతని ఇంకా సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది శక్తి సామర్ధ్య కిటికీలకి అద్భుతమైన ఎంపిక. వేడి చేసే ఇంకా చల్లబరిచే ఖర్చులని తగ్గించడంలో సాయపడుతుంది.
ఈ రకమైన అద్దం వేడి బదిలీని తగ్గించడానికి ప్రత్యేకంగా డిజైన్ చెయ్యబడింది, దాంతో ఇది తీవ్ర వాతావరణంలో ఉండే ఇళ్ళకి తగినవి. ఇది సింగిల్ ఇంకా మల్టీ-పలకల కలయికలలో లభిస్తుంది, దాంతో అద్భుతమైన వేడిమి సామర్ధ్యాన్ని అందిస్తుంది ఇంకా శబ్ద సరఫరాని తగ్గిస్తుంది.
ఇళ్ళల్లో వాడే అద్దాలలో రకాలతో పాటు వాటికి మెరుగు పెట్టే పద్ధతి లేదా కిటికీ ఫ్రేముల్లో వాటిని అమర్చడం అద్దాల కార్యదక్షత నిర్ధారించడంలో ప్రముఖ పాత్రని పోషిస్తుంది. అద్దాల అమరికలోని 3 సాధారణ రకాలని ఇపుడు చూద్దాం:
సింగిల్ గ్లేజ్డ్ కిటికీలు అత్యంత ప్రాధమిక ఇంకా పారంపరిక రకమైన అద్దాల అమరిక. వీటిలో ఒకటే గాజు పలక ఉండి దాన్ని కిటికీ ఫ్రేములో అమరుస్తారు. సింగిల్ గ్లేజ్డ్ కిటికీలు అత్యంత సరసమైన ఎంపిక అయినప్పటికీ అవి పరిమిత ఇన్సులేషన్ లక్షణాలని కలిగి ఉంటాయి. ఇవి అంశాలకి అవరోధంగా నిలుస్తాయి కానీ ఇతర గ్లేజింగ్ ఎంపికలతో పోలిస్తే వేడిమి నష్టం ఇంకా శబ్ద సరఫరా నిరోధకతలో అంత ప్రభావవంతం కాదు.
డబుల్ గ్లేజ్డ్ కిటికీలు వాటి ఇన్సులేషన్ సామర్ధ్యాలకి ప్రఖ్యాతిగాంచాయి. ఇవి సీల్ చేసిన గాలి లేదా గ్యాస్ నింపిన స్థలంతో వేరు చేయబడ్డ రెండు గాజు పలకలు, సాధారణంగా ఏర్గాన్ లేదా క్రిప్టన్ గ్యాస్తో నింపుతారు. ఈ పలకల మధ్య ఉన్న గాలి లేదా గ్యాస్ ఉన్న ఇన్సులేటింగ్ పొర ఒక అవరోధంగా పని చేస్తుంది. దాంతో వేడిమి బదిలీ తగ్గుతుంది అలా శక్తి సామర్ధ్యం పెరుగుతుంది. డబుల్ గ్లేజ్డ్ కిటికీలు మీ ఇంటిని వేసవిలో చల్లగానూ శీతాకాలంలో వెచ్చగానూ ఉంచి బయటి శబ్ద సరఫరాని తగ్గిస్తాయి.
ట్రిపుల్ గ్లేజ్డ్ కిటికీలు కిటికీ గ్లేజింగ్ లోని 3 రకాల్లోను అత్యధిక ఇన్సులేషన్ అందిస్తాయి. దాంతో ఇవి పర్యావరణహిత ఇంటి నిర్మాణానికి అద్భుతమైన ఎంపిక అవుతాయి. వీటిలో 3 గాజు పలకలు రెండు గాలి లేదా గ్యాస్ నింపిన స్థలాలతో వేరు చేయబడి ఉంటాయి.ఈ అదనపు గాజు పొర ఇంకా ఇన్సులేషన్ వేడిమి నష్టాన్ని గణనీయంగా తగ్గించి, శక్తి సామర్ధ్యాన్ని పెంచి ఇంకా శబ్ద ఇన్సులేషన్ ని మెరుగు పరుస్తాయి. ట్రిపుల్ గ్లేజ్డ్ కిటికీలు ముఖ్యంగా తీవ్ర వాతావరణాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు లేదా అధిక శబ్ద స్థాయిలు ఉన్న ప్రాంతాలలో లాభదాయకం ఎందుకంటే ఇవి అద్వితీయమైన థర్మల్ సౌకర్యాన్ని ఇస్తాయి.
మీ ఇంటికి సరైన కిటికీ అద్దం రకాన్ని ఎంచుకోవడం కావలసిన రూపురేఖలు, సౌకర్యం ఇంకా శక్తి సామర్ధ్యం సాధించడానికి అవసరం. లభిస్తున్న వివిధ రకాల కిటికీ అద్దాలని ఇంకా గ్లేజింగ్ ఎంపికలని అర్ధం చేసుకుంటే, మీరు మీ అవసరాలకు ఇంకా ఎంపికలకు తగినట్టుగా మెరుగైన నిర్ణయం తీసుకోవచ్చు. లభించే ఎంపికలని తెలుసుకోండి, సురక్షతనుంచి ప్రైవెసీ దాకా అలా మీ ఇంటికి సరైన అద్దం రకాన్ని కనుగొనండి. తలుపు ఇంకా కిటికీ ఫ్రేములు బిగించటంపై మా వీడియో చూసి ఇన్స్టలేషన్ ప్రక్రియలో సహాయక మార్గదర్శన పొందండి.