Share:
గృహ నిర్మాణ మార్గదర్శిని
మా ఉత్పత్తులు
ఉపయోగకరమైన సాధనాలు
ఉత్పత్తులు
అల్ట్రాటెక్ నిర్మాణ ఉత్పత్తులు
Share:
ప్రపంచంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే నిర్మాణ సామగ్రిలో కాంక్రీటు ఒకటి, కాలిబాటలు మరియు డ్రైవ్‌వేల నుండి ఎత్తైన భవనాలు, వంతెనల వరకు ప్రతిదానికీ ఉపయోగిస్తారు. అయితే, మిగతా పదార్థాల్లాగా కాంక్రీటు పగుళ్లకు నిరోధకతను కలిగి ఉండదు. వాస్తవానికి, పగుళ్లు అనేది కాంక్రీట్ నిర్మాణాలకి అనివార్య లక్షణం. ఇది వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. అవి వివిధ స్థాయిల తీవ్రతను కలిగి ఉంటాయి.
కాంక్రీటులో వివిధ రకాల పగుళ్లు ఇక్కడ ఉన్నాయి:
ఇవి కాంక్రీటు నిర్మాణ సమగ్రతకు ఎటువంటి ముప్పును కలిగించని పగుళ్లు. ఇవి సాధారణంగా హెయిర్‌లైన్ పగుళ్లు. అవి ప్రధానంగా కాంక్రీటు సహజంగా ఆరే క్రమంలో ఏర్పడే ప్రక్రియ. ఉష్ణోగ్రత మార్పులు లేదా చిన్న ఒత్తిడి కారణంగా ఏర్పడతాయి. అయితే, ఈ రకమైన పగుళ్లకు, ప్రధానంగా వాటి పనితీరు కారణంగా కాకుండా కాంక్రీట్ నిర్మాణం మొత్తం పనితీరు కారణంగా మరమ్మత్తు అవసరం.
నిర్మాణ పగుళ్లు మరింత తీవ్రంగా ఉంటాయి, తక్షణ శ్రద్ధ అవసరం. ఈ పగుళ్లు కాంక్రీట్ నిర్మాణ సమగ్రతని దెబ్బతీస్తాయి. వెంటనే పరిష్కరించకపోతే నిర్మాణం కూలిపోవడానికి దారితీయవచ్చు. కాంక్రీటులో ఏడు ప్రధాన రకాల నిర్మాణ పగుళ్లు ఉన్నాయి. వీటిని మనం వివరంగా చర్చిద్దాం.
2) కాంక్రీటు క్రేజ్ మరియు క్రస్టింగ్. క్రేజింగ్ పగుళ్లు కాంక్రీటు ఉపరితలంపై చక్కటి, నిస్సార పగుళ్ల వెబ్ లాంటివి. క్యూరింగ్ ప్రారంభ దశలలో కాంక్రీటు ఉపరితలం నుండి తేమ వేగంగా ఆవిరైపోవడం వల్ల ఇవి సంభవిస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ తేమ, గాలి లేదా ప్రత్యక్షంగా ఎండ పడడం వంటి అనేక కారణాల వల్ల ఇది సంభవించవచ్చు. కాంక్రీటు క్రేజ్ తరచుగా అందం సమస్యగా పరిగణించబడుతుంది. కాంక్రీటు నిర్మాణ సమగ్రతను సాధారణంగా ఇది ప్రభావితం చేయదు.
C3) పగుళ్లను పరిష్కరించడం
3) పగుళ్లను పరిష్కరించడం
ఉష్ణోగ్రత మరియు తేమ స్థాయిలలో మార్పుల కారణంగా కాంక్రీటు విస్తరిస్తున్నప్పుడు మరియు కుదించబడినప్పుడు విస్తరణ పగుళ్లు ఏర్పడతాయి. ఈ రకమైన పగుళ్లు తరచుగా సరళ రేఖలా కనిపిస్తాయి, కాంక్రీటు ఉపరితలం పొడవైన గీతలా ఏర్పడతాయి. విస్తరణ పగుళ్లు (ఎక్స్పాన్షన్ క్రాక్స్) విపరీతమైన వాతావరణ పరిస్థితులు, సరిగ్గా అతుక్కోని జాయింట్ ప్లేస్‌మెంట్‌తో సహా వివిధ కారణాల వల్ల ఏర్పడతాయి. ఉష్ణోగ్రతలో మార్పుల కారణంగా పగుళ్లు ఏర్పడతాయి సాధారణంగా థర్మల్ క్రాక్స్ గా సూచిస్తారు. సాధారణంగా నిర్మాణాత్మక సమస్యలు కానప్పటికీ, విస్తరణ పగుళ్లు నీటిని కాంక్రీటులోకి ప్రవేశించేలా చేస్తాయి, ఇది ఇతర రకాల పగుళ్లు ఏర్పడేందుకూ, నష్టానికీ దారి తీస్తుంది. సరైన ఇన్‌స్టలేషన్ పద్ధతులు, విస్తరణ జాయింట్ల ఉపయోగం, విస్తరణ పగుళ్లను ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి : కాంక్రీట్ క్యూరింగ్ & వివిధ క్యూరింగ్ పద్ధతులు ఎలా చేయాలి
ముగింపులో, కాంక్రీటు నిర్మాణాత్మక నిర్మాణేతర కారణాల వల్ల పగుళ్లకు గురవుతుంది. కాంక్రీటులో కొన్ని రకాల పగుళ్లు పెద్ద సమస్యని కలిగించకపోవచ్చు. మరికొన్ని ప్రమాదకరమైన పగుళ్లు కాంక్రీటు చుట్టుపక్కల నిర్మాణాల సమగ్రతను దెబ్బతీస్తాయి. సైట్‌ను సరిగ్గా సిద్ధం చేయడం, సరైన మిక్స్ డిజైన్‌ని ఉపయోగించడం, క్రాకింగ్ జరగకుండా నిరోధించడానికి ఇన్‌స్టలేషన్ మెయింటెనెన్స్ వంటి మంచి పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యం.