1. శైలి : ఆకారాలు & పరిమాణాలు
పిచ్ చేయబడిన పైకప్పులు, పైకప్పుల డిజైను, ఆకారం, పరిమాణపరంగా మరింత ఖాళీని అందిస్తాయి. ఆర్కిటెక్ట్ సంక్లిష్టమైన ఆకృతులను ఎంచుకోవచ్చు, దేనికీ వెనకాడకుండా తమకు కావలసిన విధంగా చేయించవచ్చు. ఉపయోగించే పదార్థాలలో మరింత ఎంపిక కూడా ఉంది. ఇది ప్రాధాన్యత ప్రకారం పైకప్పు మరింత దోషరహిత ఆకారాన్నీ, పరిమాణాన్నీ క్యూరేట్ చేయడానికి అనుమతిస్తుంది.
2. ఎనర్జీ సేవింగ్స్
పిచ్ చేయబడిన పైకప్పులు నిర్మాణానికీ, బయటి పొరకీ మధ్య సహజ ప్రసరణ జరిగేలా చూస్తాయి, శక్తిని ఆదా చేస్తాయి భవనమంతా కవరుచేసిన కారణంగా 25-30% ఎనర్జీ నష్టాన్ని తగ్గిస్తుంది.
3. పర్యావరణ ప్రమాదాలు జరగకుండా రక్షణ
త్రిభుజాకార ఆకారం కలిగిన పిచ్ పైకప్పుల నిర్మాణం స్థిరంగానూ, సురక్షితంగానూ ఉంటుంది. ఇవి విపరీతమైన హిమపాతం, వర్షం గాలులతో కూడిన పరిస్థితులను తట్టుకునేలా నిర్మించబడతాయి, ఇవి పర్యావరణ ప్రభావాలను తట్టుకుని నిలబడడానికి బాగా సరిపోతాయి..
అదనంగా, మీరు అదనపు రక్షణ మన్నిక కోసం గోడల్నీ, రూఫింగ్స్ నీ కూడా ఇన్సులేట్ చేయవచ్చు.
4. తక్కువ ఖర్చుతో అదనపు స్థలం
ఒక స్లాంట్ ఒక కపుల్ క్లోజ్డ్ పిచ్డ్ పైకప్పుల సహాయంతో, మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఫ్లోర్‌ని పొడిగించాల్సిన అవసరం లేకుండా మీ ఇంటిలో అదనపు గదిని ఏర్పాటుచేసుకోవచ్చు.
5. వర్షపు నీటి పునర్వినియోగం
పిచ్ చేయబడిన పైకప్పులు వర్షపు నీటి సేకరణకి గల వివిధ పద్ధతులను సరళంగానూ, మరింత సౌకర్యవంతంగానూ చేస్తాయి. ఎందుకంటే ఈ పైకప్పులలో ఉండే బాహ్య డ్రైనేజీ వ్యవస్థని దారి మళ్లించడం సవరించడం సులభతరం చేస్తుంది.