కాంక్రీటు పని సామర్థ్యం, దాన్ని పోసే విధానంలో సౌలభ్యత, ఒక ఆకృతిని లేదా అచ్చును సరిపడే విధంగా నింపే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అనేక అంశాలు ఈ కీలకమైన లక్షణాన్ని ప్రభావితం చేయగలవు; అవి ఉన్నాయి:
1) నీరు-సిమెంట్ నిష్పత్తి
నీటి సిమెంట్ నిష్పత్తి కాంక్రీటు పని సామర్థ్యాన్నీ, బలాన్నీ నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నిష్పత్తి అనేది కాంక్రీట్ మిక్స్‌లో సిమెంట్ పరిమాణంతో విభజించబడిన నీటి పరిమాణాన్ని సూచిస్తుంది. ఈ నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంటే, మనం ఎక్కువ పని సామర్థ్యాన్ని సాధించవచ్చు, కానీ బలం, మన్నిక తగ్గుతాయి. మరోవైపు, తక్కువ నిష్పత్తి (రేషియో) ఎక్కువ బలాన్ని కలిగిస్తుంది కానీ అది తక్కువ పనిసామర్థ్యం గల కాంక్రీటు.
2) కంకర పరిమాణం మరియు ఆకారం
ఉపయోగించిన కంకరల పరిమాణం, ఆకారం, టెక్స్చర్ కూడా కాంక్రీటు పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా, పెద్ద కంకర రాళ్ల వల్ల ఏర్పడే పెద్ద ఖాళీలు, వాటి పని సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అసమానంగా, కోణాకారంలో ఉండే కంకరని గుండ్రంగా, స్మూత్ గా ఉండే కంకరతో పోల్చినప్పుడు వీటి పని సామర్థ్యం హెచ్చుగా ఉంటుంది.
3) అడ్‌మిక్చర్లని ఉపయోగించడం
కాంక్రీటులో అడ్‌మిక్చర్లని చేర్చడం వలన దాని పని సామర్థ్యాన్ని బాగా మార్చవచ్చు. వాటర్-రెడ్యూసర్లు మరియు ప్లాస్టిసైజర్ల వంటి కెమికల్ అడ్‌మిక్చర్లు బలాన్ని వదలకుండా అవసరమైన నీటి-సిమెంట్ నిష్పత్తిని తగ్గించడం ద్వారా పని సామర్థ్యాన్ని పెంచుతాయి.
4) కాంక్రీటు మిక్సింగ్ పద్ధతి
మిక్సింగ్ పద్ధతి, వ్యవధి, ఉపయోగించిన మిక్సర్ వేగం, రకంతో సహా, కాంక్రీటు పని సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. అతిగా మిక్స్ చేయడం, కంకర సెగ్రెగేషన్ కి దారితీయవచ్చు, అయితే చేయాల్సినంతగా మిక్సింగ్ చేయకపోతే, అది సరిగా మిక్స్ అవదు.
5) కాంక్రీట్ సెక్షన్, మందం
పోయబడిన కాంక్రీట్ పొర యొక్క మందం, పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా, సన్నగా ఉండే సెక్షన్లలో మిశ్రమాన్ని పూర్తిగా ఫారమ్ లేదా అచ్చుల్లో ఖాళీలు రాకుండా నింపేలా చూసేందుకు మరింత పనిసామర్థ్యం గల కాంక్రీటు అవసరమవుతుంది.