Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
సామరస్యపూర్వకమైన ఆహ్వానించదగిన భోజనాల గదిని సృష్టించడానికి, దాని డిజైన్ అలైన్‌మెంట్‌కు వాస్తు సూత్రాలను అప్లై చేయడం చాలా ముఖ్యం. మీ భోజన ప్రాంతం కోసం పరిగణించవలసిన వాస్తు శాస్త్రంలోని కొన్ని కీలకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి:
వాస్తు శాస్త్రం ప్రకారం, మీ భోజనాల గది ఉండే చోటు ఆకర్షించే శక్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ ఇంట్లో పడమర లేదా వాయువ్య విభాగంలో మీరు భోజనం చేసే ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ స్థానం భోజన సమయంలో సమృద్ధినీ, శ్రేయస్సునీ కలిగిస్తుందని నమ్ముతారు. భోజనాల గదిని పడకగదిలోనో లేదా మీ ఇంటి మధ్యలోనో పొరపాటు చేయకండి, ఎందుకంటే ఈ ప్రదేశాలు సానుకూల శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగించవచ్చు.
వాస్తు శాస్త్ర రంగంలో, పురాతన భారతీయ నిర్మాణ శాస్త్రం డిజైన్‌లో, మీ డైనింగ్ టేబుల్ దిశ కేవలం సౌందర్యానికి సంబంధించినది కాదు; ఇది శక్తి శ్రేయస్సు ప్రవాహంలో లోతుగా పాతుకుపోయింది. వాస్తు సూత్రాల ప్రకారం, భోజన సమయంలో కుటుంబ పెద్దలు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా డైనింగ్ టేబుల్ను ఆదర్శంగా ఉంచాలి. ఈ ఏర్పాటు జీర్ణశక్తిని పెంపొందిస్తుందని సానుకూల సంభాషణలను ప్రోత్సహిస్తుందని, అందరికీ సామరస్యపూర్వకమైన భోజన అనుభవాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు.
మీ భోజనాల గది శక్తిని, వాతావరణాన్నీ ప్రభావితం చేసే శక్తిని రంగులు కలిగి ఉంటాయి. వాస్తు ప్రకారం భోజనాల గది రంగును ఎంచుకోవడానికి, పసుపు లేదా లేత గోధుమరంగు వంటి వివిధ షేడ్స్ వంటి ఆత్మీయమైన ప్రశాంతతనిచ్చే రంగులను ఎంచుకోండి. వాస్తు ప్రకారం ఈ రంగులు భోజనాల గదిలో ఆత్మీయతని పెంపొందించే వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీనికి విరుద్ధంగా, మీ డైనింగ్ ఆహ్లాదాన్నీ, చైతన్యాన్ని లోపింపజేసే ముదురు రంగులు లేదా పేలవమైన రంగులను నివారించడం మంచిది.
భోజనాల గది వాస్తు డిజైన్‌లో ప్రవేశ ద్వారం ఒక కీలకమైన అంశం. గదిలో బాగా వెలుతురు ఉండేలా, ఎటువంటి ఆటంకాలూ లేకుండా ఉండేలా చూసుకోండి. ఇది ఆ ప్రదేశంలో సానుకూల శక్తిని ప్రవేశపెట్టడానికి స్పష్టమైన ఆహ్వానించదగిన మార్‌గాన్ని అందిస్తుంది. ఈ సానుకూల వైబ్రేషన్లను మెరుగుపరచడానికి, ప్రవేశ ద్వారాన్ని శుభ చిహ్నాలు లేదా కళాకృతులతో అలంకరించడాన్ని పరిగణించండి.
సరైన లైటింగ్, మీ భోజనాల గది వాతావరణాన్ని సామరస్యపూరితంగా చేస్తుంది. పగటిపూట, డైనింగ్ రూమ్ వాస్తు ప్రకారం గదిలోకి చైతన్యాన్నీ, శక్తినీ నింపడానికి సహజ కాంతిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోండి. సాయంత్రం వేళల్లో, మీ భోజనం కోసం హాయిగా విశ్రాంతినిచ్చే వాతావరణాన్ని సృష్టించే సున్నితమైన, ప్రశాంతతనిచ్చే లైటింగ్ ఎంపికలను ఎంచుకోండి, ప్రతి భోజన అనుభవం ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అందమైన అనుభవంగానూ, ఎంతో సౌలభ్యంగానూ ఉంటుంది.
ఈ చిట్కాలు కాకుండా భోజనాల గది వాస్తును పరిగణనలోకి తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన మరికొన్ని ఇతర విషయాలు కూడా ఉన్నాయి:
వాస్తు ప్రకారం భోజనాలు చేసే చోటు సానుకూల శక్తి ప్రవాహంతో నిండి ఉంటుంది, నిర్మలమైన వాతావరణాన్ని మెయింటెయిన్ చేయడానికి సహాయపడుతుంది. ఈ స్థలంలో అనవసరమైన వస్తువులు లేదా చిందరవందరగా పేరుకుపోకుండా చూసుకుంటూ, డైనింగ్ ప్రదేశాన్ని చక్కగానూ క్రమబద్ధంగానూ మెయింటెయిన్ చేయండి.
మీ భోజనాల గదిలో చెక్క ఫర్నిచర్‌ని ఎంచుకోండి, ఎందుకంటే ఇది వాస్తులో శుభప్రదంగా పరిగణించబడుతుంది. చెక్క పెరుగుదలనీ, సామరస్యాన్ని సూచిస్తుంది. ఆ ప్రదేశానికి సానుకూల శక్తిని పెంచుతుందని నమ్ముతారు.
మీ భోజనాన్ని ప్రారంభించే ముందు, ఒక చిన్న ప్రార్థన చేయడం లేదా కృతజ్ఞతలు తెలియజేయడం మంచిది. ఈ రకమైన అలవాటు సానుకూలతను కలిగిస్తుంది. ఆహారాన్ని ఆశీర్వదిస్తుంది, కృతజ్ఞతనీ, సామరస్య వాతావరణాన్నీ ఏర్పరుస్తుంది.
భోజనాల గది టాయిలెట్‌కి ఆనుకొని గానీ లేదా దాని పైన గానీ లేదని నిర్ధారించుకోవడం చాలా అవసరం. అది భోజనాల గదివాస్తుకి అశుభంగా పరిగణించబడుతుంది. మరుగుదొడ్లు ప్రతికూల శక్తితో సంబంధం కలిగి ఉంటాయి. వాటి సామీప్యత భోజనం చేసే చోటుకి ఉండాల్సిన సానుకూల ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది.
మీ ఇంటిలో సానుకూల శక్తి, సామరస్యత, శ్రేయస్సును ప్రోత్సహించడానికి వాస్తు-అనుకూల భోజనాల గదిని ఏర్పాటు చేసుకోవడం ఒక శక్తివంతమైన మార్గం. ఈ బ్లాగ్‌లో, మీ డైనింగ్ రూమ్ వాస్తుపై ప్రభావం చూపే దిశ, లైటింగ్, ఇతర అంశాల గురించి మేము చర్చించాము. ఈ చిట్కాలు వారి స్వంతంగా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, మీ అవసరాలకు సరిపోయేలా నిపుణులను సంప్రదించడం ఎల్లప్పుడూ మంచి నిర్ణయం. మరింత సమాచారం కోసం, మీరు మా ఇంటి వాస్తు చిట్కాలు బ్లాగులో చూడవచ్చు.