వాస్తు ప్రకారం అద్దాల స్థలం కోసం చేయవలసినవీ చేయకూడనివీ
చేయవలసినవి
1) ఉత్తరం లేదా తూర్పు గోడ మీద అద్దం ఉంచండి: ఇది సానుకూల శక్తిని ఆకర్షించడానికి అనువైనది.
2) అందమైన దృశ్యాలను ప్రతిబింబించడానికి అద్దాలను ఉపయోగించండి: అద్దాన్ని ప్రకృతిని ప్రతిబింబించే ప్రదేశంలో లేదా అందమైన కళాఖండాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తిని రెట్టింపు చేస్తుంది.
3) అద్దాన్ని శుభ్రంగా స్పష్టంగా ఉంచండి: అద్దాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది స్వచ్ఛత, సానుకూల శక్తిని ప్రతిబింబిస్తుంది.
4) పూర్తి నిడివి గల అద్దాన్ని ఉపయోగించండి: ఇటువంటి అద్దాలు మొత్తం శరీరం ప్రతిబింబాన్ని నిర్ధారిస్తాయి, తద్వారా శక్తి ప్రవాహం అంతరాయం కలిగించదు.
5) లైటింగ్ పెంచడానికి అద్దాలు పెట్టండి: మీ స్థలం మసకగా కనిపిస్తున్నట్లయితే, సహజ కాంతిని ప్రతిబింబించేలా మీ ఇల్లు లేదా కార్యాలయాన్ని ప్రకాశవంతం చేయడానికి అద్దాలు పెట్టండి.
చేయకూడనివి
1) మంచం ముందు అద్దాలు పెట్టకండి: పడక గదుల్లో ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది అశాంతికి దారితీస్తుందనీ, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని నమ్ముతారు.
2) ముక్కలైన లేదా పగిలిన అద్దాలను వాడకండి: ఇది మీ ఇల్లు లేదా కార్యాలయంలో శక్తిని విచ్ఛిన్నం చేయవచ్చు లేదా చెదరగొట్టవచ్చు.
3) ఏ తలుపు ముందూ కూడా అద్దం పెట్టకండి: ఇది ఇంటి ప్రధాన ద్వారానికీ, లోపలి తలుపులకీ వర్తిస్తుంది, ఎందుకంటే ఇవి శక్తిని తిప్పికొట్టగలవు.
4) ప్రతికూల చిత్రాన్ని ప్రతిబింబించకుండా ఉండండి: అద్దం గజిబిజిగానూ, చెత్త లేదా ప్రతికూల శక్తిని ప్రసరించే ఏ విధమైన వస్తువుల్నీ ప్రతిబింబించకూడదు.
5) పాత, మసకబారిన అద్దాలను ఉపయోగించవద్దు: ఈ ప్రతిబింబాలు శక్తిని తిప్పికొడతాయి, వాస్తు శాస్త్రంలో ఇవి అశుభమైనవిగా పరిగణించబడతాయి.
వాస్తు ప్రకారం అద్దం దిశకు సంబంధించి ఈ సాధారణ నియమాలను అనుసరించడం ద్వారా వాస్తు ప్రకారం అద్దాన్ని జాగ్రత్తగా ఉంచడం ద్వారా, మీరు మీ ఇంట్లోనూ, కార్యాలయంలోనూ వీలైనంత సానుకూల శక్తి ప్రవాహాన్ని స్వాగతించవచ్చు.