వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి



కాంక్రీట్ మిక్సర్ యంత్రాల వివిధ రకాలు

కాంక్రీటుతో నిర్మించడానికి లేదా మార్పులు చేసుకోవడానికి చూస్తున్నారా? ఇక వెతకకండి. మీరు విశ్వాసంతో నిర్మాణం చేపట్టడానికి సహాయపడే వివిధ రకాల కాంక్రీట్ మిక్సర్‌ల గురించి తెలుసుకోండి.

Share:


కాంక్రీట్ మిక్సర్ యంత్రం అంటే ఏమిటి?

కాంక్రీట్ మిక్సర్ అనేది సిమెంట్, నీరు, ఇసుక, ఇంకా కంకర, గ్రావెల్, కలపాల్సిన మరి కొన్ని ఇతర పదార్థాలను కలిపి కాంక్రీటును తయారు చేయడానికి నిర్మాణంలో ఉపయోగించే యంత్రం. కాంక్రీట్ మిక్సర్‌లు స్థిరంగానూ లేదా పోర్టబుల్‌గానూ ఉండవచ్చు. చేతితో రవాణా చేయగల చిన్న పోర్టబుల్ మిక్సర్‌ల నుండి నిర్మాణ ప్రదేశాలలో ఉపయోగించే పెద్ద పారిశ్రామిక-పరిమాణ మిక్సర్‌ల వరకు ఇవి వివిధ పరిమాణాలలో అందుబాటులో ఉంటాయి. కాంక్రీట్ మిక్సర్ మెషీన్లు వివిధ పరిశ్రమలలో కాంక్రీటును ఆన్-సైట్‌లో తయారు చేయడానికి ఉపయోగించబడతాయి, మిశ్రమం సెట్ కావడానికి ముందు ఉపయోగించడానికి పనివారికి తగినంత సమయాన్ని అందిస్తుంది. కాంక్రీట్ మిక్సర్‌లను ఉపయోగించడం ద్వారా, నిర్మాణ ప్రదేశాలు సమయాన్నీ, శ్రమనీ ఆదా చేసుకోవచ్చు, దీన్ని ఉపయోగించి సిమెంట్ ముద్దలు కట్టకుండా కూడా చేయవచ్చు, ఈ మిక్సర్‌ల వినియోగం కార్మికుల ఉత్పాదక శక్తిని పెంచుతుంది. సమర్థవంతమైన ఈ ప్రక్రియ, తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను అందిస్తుంది.

cdxc


కాంక్రీట్ మిక్సర్ల రకాలు

 

వివిధ రకాలైన మిక్సర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రకం మిశ్రమం చేయబడిన పదార్థాల స్వభావం, కావలసిన ఫలితాన్ని బట్టి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. కాంక్రీట్ మిక్సర్ యంత్రాలలో రెండు విస్తృత వర్గాలు ఉన్నాయి, కాంక్రీట్ బ్యాచ్ మిక్సర్లు, కంటిన్యువస్ మిక్సర్లు. మనం ఈ రెండింటి గురించీ, వాటిలో ఉన్న రకాల గురించీ వివరంగా తెలుసుకుందాం.


 

    కాంక్రీట్ బ్యాచ్ మిక్సర్



కాంక్రీట్ బ్యాచ్ మిక్సర్ అనేది ఒక సమయంలో నిర్దిష్ట పరిమాణంలో కాంక్రీటును కలపడానికి నిర్మాణ పరిశ్రమలో ఉపయోగించే ఒక రకమైన మిక్సర్. కాంక్రీటు కోసం డిమాండ్ మరీ ఎక్కువగా లేని చిన్న మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు ఈ రకమైన మిక్సర్ అనుకూలంగా ఉంటుంది. కాంక్రీట్ బ్యాచ్ మిక్సర్ సాధారణంగా డ్రమ్ లేదా కంటైనర్‌ను కలిగి ఉంటుంది, ఇక్కడ అన్ని పదార్థాలు ముందుగా నిర్ణయించిన క్రమంలో జోడించబడతాయి. ఈ పదార్థాలు సాధారణంగా సిమెంట్, ఇసుక, నీరు, ముక్కలు చేసిన రాయి లేదా కంకర లేదా గ్రావెల్ అయి ఉంటాయి. ఈ మిక్సర్ వివిధ పరిమాణాలలో వస్తుంది. మిక్సర్ పరిమాణం కలపవలసిన కాంక్రీటుని బట్టి నిర్ణయింపబడుతుంది. చిన్న బ్యాచ్ మిక్సర్‌లు 1 క్యూబిక్ యార్డ్ కాంక్రీట్‌ను కలిగి ఉంటాయి, అయితే పెద్ద మిక్సర్‌లు 6 క్యూబిక్ గజాల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాంక్రీటును కలిగి ఉంటాయి.

నిర్మాణ ప్రాజెక్టుల కోసం కాంక్రీట్ బ్యాచ్ మిక్సర్ అనేది చిన్న సైజు నుంచి మధ్యస్థ పరిమాణం వరకు ఒక విశ్వసనీయమైన, సమర్థవంతమైన ఎంపిక, ఇక్కడ నిర్దిష్ట పరిమాణంలో కాంక్రీటును ఒకేసారి కలపాలి.

1. డ్రమ్ మిక్సర్

డ్రమ్ మిక్సర్, బారెల్ మిక్సర్ అని కూడా పిలుస్తారు, ఇది నిర్మాణ పరిశ్రమలో పెద్ద మొత్తంలో కాంక్రీటు లేదా సిమెంటును కలపడానికి ఉపయోగించే ఒక రకమైన మిక్సర్. ఇది దాని అక్షం మీద తిరిగే డ్రమ్ లేదా బారెల్‌ను కలిగి ఉంటుంది, డ్రమ్ లోపలి భాగంలో బ్లేడ్‌లు లేదా రెక్కలు జతచేయబడి కాంక్రీటు తిరిగేటప్పుడు కలపడానికి సహాయపడతాయి. పెద్ద మొత్తంలో కాంక్రీటును సమర్ధవంతంగా కలపగల సామర్థ్యం వాటికి ఉంటుంది. ఇతర రకాల మిక్సర్‌లతో పోలిస్తే అవి పనిచేయడం కూడా సులభం, పైగా తక్కువ శ్రమ అవసరం. అందువల్ల వాటిని చిన్న పెద్ద నిర్మాణ ప్రాజెక్టుల్లో ఉపయోగించడానికి వీలవుతుంది. కాంక్రీటు, మోర్టార్ లేదా ఏ ఇతర నిర్మాణ సామగ్రినైనా కలపడానికి ఉపయోగించవచ్చు.

 

డ్రమ్ మిక్సర్లను మూడు వర్గాలుగా వర్గీకరించవచ్చు: టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు, నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు, రివర్సింగ్ డ్రమ్ మిక్సర్లు.

 

i. టిల్టింగ్ డ్రమ్ మిక్సర్

టిల్టింగ్ డ్రమ్ మిక్సర్‌లు టిల్టింగ్ డ్రమ్‌తో రూపొందించబడ్డాయి, వీటిని మిశ్రమ కాంక్రీటు లేదా సిమెంటును పోయడానికి తిప్పుతూ ఉంటారు, వీటిని నిర్మాణ ప్రాజెక్టులకు మెటీరియల్‌ను త్వరగా అన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మిక్సర్లు దాని అక్షం మీద వంగి ఉండే డ్రమ్‌ను కలిగి ఉంటాయి, ఇది మిశ్రమ పదార్థాన్ని డ్రమ్ నుండి నిర్దేశిత ప్రదేశంలోకి పోయడానికి అనుమతిస్తుంది. నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్‌లతో పోలిస్తే ఈ రకమైన మిక్సర్‌ల ఉపయోగాల్లో ఒకటి ఏమంటే, డ్రమ్‌ను వంచడం ద్వారా మిశ్రమ పదార్థాన్ని సులభంగా అన్‌లోడ్ చేయవచ్చు. కాబట్టి వాటికి తక్కువ మాన్యువల్ లేబర్ అవసరం. ఇది చిన్న, మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు వీటిని ఎక్కువగా ఎంచుకునేలా చేస్తుంది.

ii. నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్

టిల్టింగ్ డ్రమ్ మిక్సర్ల వలె కాకుండా, నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్‌లు టిల్టింగ్ మెకానిజంను కలిగి ఉండవు. మిశ్రమ పదార్థాన్ని అన్‌లోడ్ చేయడానికి మాన్యువల్ లేబర్‌పై ఆధారపడతాయి. ఈ కాంక్రీట్ మిక్సర్ ప్రయోజనాల్లో చెప్పుకోదగ్గ ప్రయోజనం ఏమిటంటే, వాటి సింపిల్ డిజైన్, సులభమైన ఆపరేషన్ విధానం. అవి చిన్న, మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయి. తడి, పొడి మిశ్రమాలను కలపడానికి ఉపయోగించవచ్చు. మిగతా వాటితో పోలిస్తే వాటికి తక్కువ మెయింటెనెన్స్ చాలు. అయినా, మిశ్రమ పదార్థాన్ని దానంతట అదే అన్‌లోడ్ చేయడంలో దాని అసమర్థత ప్రధాన లోపాలలో ఒకటి. మిశ్రమ పదార్థాన్ని అన్‌లోడ్ చేయడానికి మాన్యువల్ శ్రమ అవసరం. పెద్ద నిర్మాణ ప్రాజెక్టులకు దీని పనితనం సరిపోక పోవచ్చు.

iii. రివర్సింగ్ డ్రమ్ మిక్సర్

మిక్సింగ్ బ్లేడ్‌లు పదార్థాన్ని సమర్థవంతంగా కలపడానికి వీలు కల్పిస్తూ రివర్సింగ్ డ్రమ్ మిక్సర్ డ్రమ్ రెండు దిశలలో తిరుగుతుంది. డ్రమ్‌లో మిక్సింగ్ బ్లేడ్‌లు లేదా రెక్కలు డ్రమ్ లోపలికి జోడించబడి మెటీరియల్‌ని కలపడానికి సహాయపడతాయి. ఈ రకమైన మిక్సర్ ప్రయోజనాల్లో ఒకటి తడి, పొడి మిశ్రమాలతో సహా అత్యంత సజాతీయ కాంక్రీటు మిశ్రమాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉండడం. అవి చిన్న, మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయి. సులభంగా శుభ్రం చేయబడతాయి, నిర్వహించబడతాయి. అయితే మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ ధర ఉండడం వల్ల కొన్ని నిర్మాణ ప్రాజెక్టులకు ఈ రకం అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు.


2. పాన్-టైప్ కాంక్రీట్ మిక్సర్

 

 దాని వృత్తాకార మిక్సింగ్ పాన్ కారణంగా దీనిని సర్క్యులర్ మిక్సర్ లేదా పాన్ మిక్సర్ అని కూడా పిలుస్తారు. ఈ కాంక్రీట్ మిక్సర్ ఒక వృత్తాకార మిక్సింగ్ పాన్‌ను కలిగి ఉంటుంది, ఇది చక్రాలతో ఫ్రేమ్‌పై అడ్డంగా అమర్చబడి ఉంటుంది. అత్యంత సజాతీయ కాంక్రీటు మిశ్రమాలను ఉత్పత్తి చేయగల వీటి సామర్థ్యం వీటి ప్రయోజనాల్లో ఒకటి. తడి/పొడి మిశ్రమాలు, మోర్టార్, ప్లాస్టర్, వక్రీభవన (రిఫ్రాక్టరీ) మెటీరియల్స్ సహా వివిధ రకాల కాంక్రీట్ మిశ్రమాలను ఉత్పత్తి చేయడానికి పాన్-టైప్ మిక్సర్‌లు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే, ఇతర రకాల మిక్సర్లతో పోలిస్తే వీటికి తక్కువ మిక్సింగ్ సామర్థ్యం ఉంటుంది, అదే ఈ రకంలోని ప్రధాన లోపాలలో ఒకటి. అధిక సామర్థ్యం గల మిక్సింగ్ పరికరాలు అవసరమయ్యే పెద్ద నిర్మాణ ప్రాజెక్టులకు అవి తగినవి కాకపోవచ్చు.


నిరంతర మిక్సర్

వీటిని కంటిన్యువస్ మిక్సర్లు, కంటిన్యువస్ ఫ్లో మిక్సర్లు అని కూడా పిలుస్తారు, కాంక్రీటు లేదా ఇతర నిర్మాణ సామగ్రిని కలపడానికి నిర్మాణ పరిశ్రమలో ఉపయోగించే ఒక రకమైన మిక్సర్. బ్యాచ్ మిక్సర్‌ల మాదిరిగా కాకుండా, ఒక సమయంలో ఒక నిర్దిష్ట మొత్తంలో మెటీరియల్‌ని మిక్స్ చేస్తుంది. ఈ సిమెంట్ మిక్సర్ మెటీరియల్స్ మిక్సింగ్ ఛాంబర్ గుండా కదులుతున్నప్పుడు వాటిని అది ఎడతెరిపి లేకుండా మిక్స్ చేస్తుంది. పదార్థం ఒక చివర మిక్సింగ్ చాంబర్‌లోకి నిరంతరంగా వేయబడుతూ ఉంటుంది, మిశ్రమ పదార్థం మరొక చివర నుండి నిరంతరం విడుదల చేయబడుతూ ఉంటుంది. వీటికి సజాతీయ పదార్థాన్ని త్వరగా, సమర్ధవంతంగా, పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. కాంక్రీటు (తడి, పొడి మిశ్రమాలతో సహా), మోర్టార్ తారుతో సహా అనేక రకాల నిర్మాణ సామగ్రిని కలపడానికి వీటిని ఉపయోగించవచ్చు.

అయితే, వీటిలో ఉన్న ప్రధాన లోపాలలో ఒకటి వాటి ధర మిగతా వాటితో పోల్చి చూస్తే చాలా అధికంగా ఉంటుంది. వీటితో పని చేయించడానికి కూడా మిగతా వాటి కంటే పెద్ద మొత్తంలో స్థలం అవసరం. వీటిని చిన్న నిర్మాణ ప్రాజెక్టులకు అంత అనుకూలమైనవి కావు.

 

సారాంశం

కాంక్రీటు లేదా ఇతర నిర్మాణ సామగ్రిని కలపడానికి నిర్మాణ పరిశ్రమలో ఉపయోగించే అనేక రకాల మిక్సర్లు ఉన్నాయి. అత్యంత సాధారణ రకాలు బ్యాచ్ మిక్సర్లు, డ్రమ్ మిక్సర్లు, పాన్-రకం మిక్సర్లు, టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు, నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్లు, రివర్సింగ్ డ్రమ్ మిక్సర్లు, కంటిన్యువస్ మిక్సర్లు. దిగువన ఉన్న సిమెంట్ మిక్సర్ల గురించి సారాంశం ఈ క్రింద ఇవ్వబడింది:

 

  • బ్యాచ్ మిక్సర్లు చిన్న, మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయి, అయితే డ్రమ్ మిక్సర్లు పెద్ద నిర్మాణ ప్రాజెక్టులకు అనువైనవ
  • టిల్టింగ్ డ్రమ్ మిక్సర్‌లు పెద్ద, చిన్న నిర్మాణ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయి, వీటిని ఆపరేట్ చేయడం సులభం, అయితే నాన్-టిల్టింగ్ డ్రమ్ మిక్సర్‌లు అత్యంత సజాతీయ కాంక్రీట్ మిశ్రమాలను ఉత్పత్తి చేయడానికి అనువైనవి.

  • రివర్సింగ్ డ్రమ్ మిక్సర్‌లు రెండు దిశలలో పదార్థాలను కలపడానికి డిజైన్ చేయబడ్డాయి, అయితే పాన్-టైప్ మిక్సర్‌లు బహుముఖీనంగా చిన్న, మధ్య తరహా నిర్మాణ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయి.

  • పెద్ద నిర్మాణ ప్రాజెక్టులకు నిరంతర మిక్సర్లు అత్యంత ప్రభావవంతమైన ఎంపిక, ఎందుకంటే అవి పెద్ద పరిమాణంలో పదార్థాలను కలపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.




చివరిగా చెప్పాలంటే, ఏ రకమైన మిక్సర్ కైనా, దానివైన ప్రయోజనాలూ, లోపాలూ కలిగి ఉంది. మిక్సర్ ఎంపిక నిర్మాణ ప్రాజెక్ట్ నిర్దిష్ట అవసరాలపై ఆధారపడి ఉంటుంది. నిర్మాణ ప్రాజెక్ట్ కోసం తగిన రకాలైన కాంక్రీట్ మిక్సర్లను ఎన్నుకునేటప్పుడు మిక్సింగ్ సామర్థ్యం, వేగం, వైవిధ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు



గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....