Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
స్టోన్ మాసనరీ అనేది మోర్టార్ ని రాళ్ల మధ్య వేసి అవి బిగుసుకునేలా చేసే నిర్మాణాలను నిర్మించే కళను సూచిస్తుంది. ఈ నిర్మాణ టెక్నిక్ శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది, దీని ఫలితంగా బలమైన భవనాలు, స్మారక కట్టడాలు కాల పరీక్షను తట్టుకోగలవు. రాతి కట్టడాలు కట్టే విధానం వివిధ రూపాలను తీసుకుంటుంది, ప్రతి దానికీ దానివైన ప్రత్యేక లక్షణాలు, అప్లికేషన్లు ఉన్నాయి.
ఉపయోగించిన రాళ్ల అరేంజ్‌మెంట్, పరిమాణం, ఆకారాన్ని బట్టి స్టోన్ మాసనరీ (స్టోన్ మాసనరీ ) రబుల్ మాసనరీ , ఆష్లర్ మాసనరీ , స్క్వేర్డ్ స్టోన్ మాసనరీ సహా అనేక రకాల స్టోన్ మాసనరీలు ఉన్నాయి.
1. రబుల్ స్టోన్ మాసనరీ
రబుల్ మాసనరీ అనేది స్టోన్ మాసనరీలో అత్యంత సరళమైన రకం. ఇక్కడ, రాళ్లను ఉపయోగించే ముందు వాటిని ఆకృతిని సరి చేయడం లేదా శుద్ధి చేయడం వంటివి లేకుండా అవి ఎలా కనిపిస్తున్నాయో, అలానే ఉపయోగిస్తారు. క్రమరహిత లేదా అసమాన ఆకారపు రాళ్లను ఉపయోగించడం వల్ల ఈ కట్టడంలోని జాయింట్లు వెడల్పుగా ఉంటాయి. స్టోన్ మాసనరీలో ఇది అత్యంత చవకలో నిర్మాణం పూర్తి చేసుకునే ఎంపిక, ఎందుకంటే ఇందులో ఎగుడు దిగుడుగా ఉన్న రాళ్లను ఉపయోగించి కట్టడం జరుగుతుంది.
అన్‌కోర్స్‌డ్ రాండం రబుల్ అనే విధానం వివిధ రకాల పెద్దా, చిన్నా సైజులు, క్రమరహిత ఆకారాలతో కూడిన రాళ్ల వినియోగంతో నిర్మించే విధానాన్ని సూచిస్తుంది. ఈ రాళ్ల ఆకారం మారుతూ ఉంటుంది, అందువల్ల విస్తారమైన ఉపరితల ప్రాంతమంతటా ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండేలా చూడడానికి జాగ్రత్తగా పేర్చడం అవసరం. నిర్మాణాన్ని పటిష్టంగా చేయడానికి కొన్ని ప్రదేశాలలో కొన్ని పెద్ద రాళ్లను ఉపయోగిస్తారు. అన్‌కోర్స్‌డ్ రాండం రబుల్ విధానాన్ని ఉపయోగించడం వల్ల ఈ పద్ధతిలో ప్రతి ఒక్కటి విభిన్నంగా కనిపిస్తుంది.
ఇది ఒక రకమైన నిర్మాణ పద్ధతి, ఇక్కడ రాళ్లను పొరలుగా లేదా 'కోర్సులు' గా కట్టడానికి ఉపయోగిస్తారు. రాళ్లు కఠినమైనవి, ఒక పద్ధతైన ఆకారంలో ఉండవు, కానీ ప్రతి పొర నేరుగానూ, సమానంగానూ ఉండే విధంగా ఉంచబడతాయి. ఈ రకమైన రాళ్లు ప్రధానంగా బలమైన ఫౌండేషన్ అవసరమయ్యే కట్టడాల నిర్మాణం కోసం ఉపయోగించబడుతుంది.
పేరులో సూచించినట్లుగానే ఇలాంటి నిర్మాణంలో ఉపయోగించే రాళ్లు చతురస్రాకారంగానో లేదా దీర్ఘచతురస్రాకారంగానో ఉండకుండా, బహుభుజి లాగా అనేక భుజాలను కలిగి ఉంటాయి. అవి ఆకారంలో గానీ, పరిమాణంలో గానీ ఏకరీతిగా ఉండవు. నిర్మాణం అన్ని వైపులా వైవిధ్యభరితమైన మోడల్స్‌లో కనిపిస్తుంది, ఇది మరింత సౌందర్యభరితంగానూ ప్రత్యేకంగానూ ఉంటుంది.
ఈ పద్ధతిలో ఫ్లింట్ అని పిలవబడే రాళ్లని ఉపయోగించడం జరుగుతుంది. ఇది చాలా గట్టిగా ఉండి, దీర్ఘకాలం మన్నికనిచ్చే రాయి. ఈ రాయి మంచి బలానికి ప్రసిద్ధి చెందింది. మన్నికైన కట్టడాల్ని నిర్మించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫ్లింట్ రబుల్ మాసనరీ అనేది సాధారణంగా ఫ్లింట్ రాయి విరివిగా లభించే ప్రాంతాల్లో సర్వసాధారణంగా జరుగుతుంది.
అష్లార్ మాసనరీ అనేది చక్కగానూ, ఖచ్చితంగానూ కట్ చేయబడిన రాళ్లను ఉపయోగించడం. ఇది చాలా ఆకట్టుకునేలా కనిపించే పాలిష్డ్ మరియు గ్రాండ్ ఫినిషింగ్‌ని ఇస్తుంది. కానీ, కటింగ్ మరియు డ్రెస్సింగ్ రాళ్లకు ఎక్కువ పని చేయవలసి ఉంటుంది కాబట్టి, ఈ రకం రబుల్ మాసనరీ కంటే ఖరీదైనది. కొన్ని కేటగిరీలు:
ఇది అత్యంత సూక్ష్మమైన స్టోన్ మాసనరీ రకాన్ని సూచిస్తుంది, ఇక్కడ ప్రతి రాయీ చూడ్డానికి ఖచ్చితంగా ఒకే రకంగా ఉండేలా కట్ చేయబడతాయి, స్మూత్, వెల్ అలైన్డ్ ఫినిషింగ్‌ని అందిస్తాయి. ఈ రకమైన స్టోన్ మాసనరీ రూపాన్ని కలిగి ఉంటుంది, ఇక్కడ మోర్టార్ చాలా సన్నని గీతలా, ఉందా లేదా అనేది కూడా తెలియనంతగా ఉంటుంది. సాధారణంగా, ఇది నిర్మాణాలకు మరింత మెరుగైన, అందమైన రూపాన్ని అందిస్తుంది.
ఫైన్ మాసనరీలా కాకుండా వీటికి చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారం వంటి ఖచ్చితమైన ఆకారాలు ఉంటాయి, అలాగే ఆష్లార్ రఫ్ మాసనరీ కొన్ని సహజమైన టెక్స్‌చర్లు, సంక్లిష్టతల్నీ కలిగి ఉంటుంది. ఇది కఠినమైన, సహజమైన ఆకారం, చతురస్రాకారపు మూలలతో ఖచ్చితత్వంతో ఒక ప్రత్యేకమైన బ్లెండ్ లో ఉంటుంది, ఇది మరింత మోటుగా ఉన్నా క్రమబద్ధమైన రూపాన్ని అందిస్తుంది.
ఈ మాసనరీ టెక్నిక్ ఆష్లార్ మాసనరీ సబ్సెట్. రాళ్ళు క్వారీ నుండి వచ్చినందున వాటి ముఖాలు నేచురల్‌గా ఉంటాయి. వాటి అంచులు చక్కగా కట్ చేయబడి ఉంటాయి, అందుకే దీనికి 'రాక్-ఫేస్డ్' లేదా 'క్వారీ-ఫేస్డ్' అని పేరు వచ్చింది. ఈ టెక్నిక్ రాళ్లలో చెక్కుచెదరకుండా సహజ టెక్స్‌చర్ ని మెయింటెయిన్ చేస్తుంది, ఖచ్చితంగా కట్ చేయబడిన అంచులకు కాంట్రాస్ట్‌గానూ, ఆకర్షణీయంగానూ ఉంటుంది.
ఆష్లార్ బ్లాక్ ఇన్ కోర్స్ మాసనరీ, ఆష్లార్ మరియు రబుల్ మాసనరీ సూత్రాలను మిళితం చేస్తుంది. గోడ బయటి భాగం అంతా రఫ్ గానూ లేదా సుత్తితో కొట్టబడిన రాతి ఉపరితలాలతోనూ ఒక మోడల్ ని ఏర్పరుస్తుంది, గోడ వెనుక భాగమంతా రాతి తాపీపని చేయబడుతుంది. రబుల్-స్టోన్ వెనుక భాగం అంతా ఒక క్రమపద్ధతిలో లేకుండా ఉంటుంది. ముందు భాగమంతా ప్రముఖమైన, క్రమబద్ధమైన ఆఫ్సెట్ చేయబడినందున ఇది ఆసక్తికరమైన సౌందర్య వైరుధ్యాన్ని అందిస్తుంది.
స్టోన్ ఖచ్చితమైన ఆకారాలలో కట్ చేయడంలో ఈ స్టోన్ శైలి ఆష్లార్ మాసనరీ సాధారణ సూత్రాలను అవలంబిస్తుంది. అయితే, ఈ రకమైన స్టోన్ మాసనరీలో అంచులు పదునుగా, నిటారుగా ఉండడానికి బదులుగా అవి బెవెల్డ్‌గా గానీ లేదా చాంఫెర్డ్‌గా గానీ ఉంటాయి. దీని అర్థం అంచులు ఒక కోణంలో కట్ చేయబడతాయి, ఇది వాలు ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఇది నిర్మాణం యొక్క విజువల్ అప్పీల్‌ని మెరుగుపరచడమే కాకుండా నిర్మాణ స్థితిస్థాపకతను కూడా జోడిస్తుంది, ఎందుకంటే చాంఫెర్డ్ అంచులు కాలక్రమేణా బాహ్య మూలకాల వల్ల దెబ్బతినే అవకాశం తక్కువ.
స్క్వేర్ స్టోన్ మాసనరీ అనేది అన్ని మూలలు చతురస్రాకారంగా సమం చేయబడేలా రాళ్లని షేప్ చేస్తుంది. ఇది చాలా ఖచ్చితమైన, స్పష్టమైన రూపాన్ని ఇస్తుంది. ఇది రెండు ప్రధాన రకాలు:
ఈ రకమైన స్టోన్ మాసనరీ అనేది ఎటువంటి ప్రత్యేక మోడల్ లేదా డిజైన్ లేకుండా, వివిధ పరిమాణాలలో కట్ చేయబడని లేదా రఫ్ గా కట్ చేయబడిన రాళ్లను ఉపయోగించుకుంటుంది. రాళ్లని ఒకదాని మీద మరొకటి పేర్చి పెడతారు. దీని ఫలితంగా అదంతా ఒకేరీతిలో ఉండదు, ఒక క్రమంలో ఉన్నట్టు కనిపించదు. రాళ్ల మధ్య ఖాళీలను చిన్న రాళ్లు లేదా మోర్టార్‌తో నింపడం జరుగుతుంది. ఈ రకమైన మాసనరీ, తక్కువ శ్రమతో ఉన్న కారణంగా సాధారణంగా మరింత తక్కువ లేబర్ ఖర్చుతో సరిపోతుంది, కానీ ఇది అంత ఖచ్చితమైనది కాదు, చూడడానికి అంత బాగా అనిపించదు, యూనిఫాంగా ఉండదు.
దాని అన్‌కోర్స్‌డ్ కౌంటర్ పార్ట్‌లా కాకుండా, కోర్స్డ్ రబుల్ మాసనరీ రాళ్లను ప్రత్యేకమైన సమాంతర పొరలుగా లేదా కోర్సులుగా కనిపించేలా చేస్తుంది. ఉపయోగించే రాళ్ళు గట్టివీ, దృఢమైనవీ, క్రమరహితంగా ఉన్నవీ అయినప్పటికీ, అవి నిర్మాణమంతటా స్థిరమైన రీతిలో అడ్డంగా పంక్తుల్ని సృష్టించే విధంగా అమర్చబడి ఉంటాయి. మోటుగా ఉండడంలోని అందం, నిర్మాణపరమైన చక్కదనం ఈ రెండింటినీ కలగలిపి అందించడం ద్వారా అంతిమంగా ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ అందంగా ఉండడం మరింత ముఖ్యమైనది అయినప్పుడు ఇది తరచుగా ఉపయోగించబడుతుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, సరైన కొలతలతో ఉన్న ఆష్లార్ నుండి మోటైన రబుల్ వరకు స్టోన్ మాసనరీ రకం, భవనం, డిజైన్ విభాగాల్లో వివిధ రకాల ఎంపికలను అందిస్తుంది. ప్రతి దానికీ దానివైన స్వంత ప్రయోజనాలు, అందం వేర్వేరుగా ఉంటుంది, ఆ యా రాతి కట్టడాలతో పని చేసే ఫ్లెక్సిబిలిటీ కూడా వేరుగా ఉంటుంది. స్టోన్ మాసనరీ ఉపయోగాలు అనేకం ఉన్నప్పటికీ, స్టోన్ మాసనరీ ఫైనల్ ఫినిష్ విషయంలో అత్యంత నైపుణ్యం, మంచి సృజనాత్మకతను కలిగి ఉంటుందని ఈ స్టయిల్స్ మనకు గుర్తు చేస్తాయి.