వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి



మోర్టార్ వివిధ రకాలను అర్థం చేసుకోవడం: లక్షణాలు, మరిన్ని ఉపయోగాలు

ఈ బ్లాగ్ మోర్టార్ ప్రాముఖ్యతను అన్వేషిస్తుంది. ఇది కొంచెం సిమెంట్, నీళ్లు, కంకర (ఫైన్ అగ్రిగేట్) మిశ్రమం లాంటి బైండింగ్ ఏజెంట్. మోర్టార్లలో అనేక వెరైటీలు ఉన్నాయి. ప్రతి సబ్-కేటగిరీకీ దానిదైన ఉపయోగం ఉంటుంది. అది ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుందో ఆ రకమైన మోర్టారుని వాడడం జరుగుతుంది.

Share:


మోర్టార్ అనేది రాళ్లు, ఇటుకలు లేదా టైల్స్ ని కలిపి ఉంచేందుకు ఉపయోగించే పేస్ట్. ఈ కంపోజిషన్‌లోని ప్రాథమిక మెటీరియల్ లో సున్నం, సిమెంట్ మొదలైన బైండింగ్ ఏజెంట్‌లు, నీళ్లు (ఇసుక/సుర్ఖీ) ఉంటాయి. మెటీరియల్ నిష్పత్తులు మోర్టార్‌ను ఉపయోగించాల్సిన అంతిమ ప్రయోజనంపై ఆధారపడి మారవచ్చు. ఈ బ్లాగ్ వివిధ రకాల మోర్టార్‌లు, వాటి ఉపయోగాల గురించి విస్తృతమైన వివరణని అందిస్తుంది.



మోర్టార్ రకాలు

నిర్మాణ ప్రపంచంలో ఏ నిర్మాణమైనా బైండింగ్ మెటీరియల్ లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. బిల్డింగ్ కట్టాలంటే ఇటుకలు, రాళ్ళు, టైల్స్ మొదలైన వాటికి కలిపి ఉంచే  పేస్ట్ లేదా మోర్టార్ అవసరం. నిర్మాణ ప్రక్రియలో మోర్టార్ ఒక అనివార్యమైన భాగం, ఎందుకంటే ఇది బిల్డింగ్ బ్లాక్‌ల మధ్య ఖాళీని పూడుస్తుంది. వివిధ రకాల మోర్టార్లను  ఉపయోగించడమనేది దాని అప్లికేషన్, సాంద్రత, ప్రయోజనంపై ఆధారపడి ఉంటుంది


మోర్టార్ మిక్స్ అంటే ఏమిటి?



సాధారణంగా, నిర్మాణంలో మోర్టార్ అనేది నీరు, బైండింగ్ మెటీరియల్, ఫైన్ అగ్రిగేట్ (ఇసుక లేదా సుర్ఖీ) మిశ్రమం. వివిధ రకాల మోర్టార్ మిక్స్‌లోని మెటీరియల్ నిష్పత్తి ఉపయోగించిన రాతి మెటీరియల్, అవసరమైన కుదింపు బలం తుది అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మిక్సింగ్ మోర్టార్ అదే చివరి దరఖాస్తుపై ఆధారపడి ఉంటుంది.


మోర్టార్ వివిధ రకాలు

 

 

1. సిమెంట్ మోర్టార్

పేరు సూచించినట్లుగా, మోర్టార్ మిశ్రమం ఈ వర్గీకరణలో బైండింగ్ మెటీరియల్ సిమెంట్. సిమెంట్, నీరు, ఇసుకను  నిష్పత్తి అనేవి ఎలాంటి కట్టడం కోసం, ఎంత మన్నికగా ఉండాలన్న విషయంపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా, మొదట, సిమెంట్ ఇసుక మిక్సింగ్ జరుగుతుంది. క్రమంగా నీరు చేర్చడం జరుగుతుంది. ఇసుక, సిమెంట్ నిష్పత్తి 1:2 నుండి 1:6 వరకు ఏదైనా కావచ్చు.

 

 

2. లైమ్ మోర్టార్



ఈ మోర్టార్ రకంలో సున్నం ప్రైమరీ బైండింగ్ మెటీరియల్. సున్నం రెండు రకాలు - హైడ్రాలిక్ లైమ్ (సున్నం), ఫ్యాట్ లైమ్. పొడిగా ఉన్న పరిస్థితుల్లో పని చేస్తున్నప్పుడు, ఫ్యాట్ లైమ్ చాలా సరైన ఎంపిక (ఇసుక పరిమాణానికి 2 నుండి 3 రెట్లు) తీసుకోవాలి. అయితే, భారీ వర్షాలు లేదా నీరు నిలిచిపోయే ప్రాంతాలలో హైడ్రాలిక్ సున్నం సరైన ఎంపిక (లైమ్-ఇసుక నిష్పత్తి 1:2).

 

 

3. జిప్సం మోర్టార్

 



జిప్సం మోర్టార్‌కి ఉపయోగించాల్సిన మంచి మెటీరియల్ ప్లాస్టర్, మెత్తని ఇసుక. ఇది తేమ లేదా తడి వాతావరణంలో చాలా తక్కువ మన్నికను అందిస్తుంది.

 

 

4. గేజ్డ్ మోర్టార్

మనం లైమ్ మరియు సిమెంటు కాంబినేషన్ ని మిశ్రమంగా చేసి, ఇసుకను ఫైన్ అగ్రిగేట్ గా ఉపయోగించినప్పుడు, గేజ్డ్ మోర్టార్ అనే మిశ్రమం ఏర్పడుతుంది. లైమ్ మోర్టార్ మరియు సిమెంట్ మోర్టార్, ఈ రెండింటిలోనూ ఉత్తమమైనది తీసుకుంటుంది. లైమ్ అవసరమైన ప్లాస్టిసిటీని జోడిస్తుంది, సిమెంట్ మన్నికను ఇస్తుంది. ఈ మిశ్రమంలో సిమెంట్-టు-లైమ్ నిష్పత్తి 1:6 మరియు 1:9 మధ్య మారుతూ ఉంటుంది. ఇది అత్యంత చవకైన మోర్టార్ ఎంపికలలో ఒకటి.

 

 

5. సుర్ఖీ మోర్టార్

సున్నం, సుర్ఖీ, నీరు కలిపిన మిశ్రమంతో మనకు సుర్కీ మోర్టార్ లభిస్తుంది.  సుర్ఖీ ఫైన్ అగ్రిగేట్ గా పనిచేస్తుంది. కాల్చిన మట్టి మెత్తగా పొడి రూపమే సుర్ఖీ. ఇది ఇసుక కంటే మోర్టార్ మిశ్రమానికి మరింత బలాన్ని పెంచుతుంది. పైగా ఇది చాలా చౌకగా వస్తుంది. అప్పుడప్పుడు మనం సగం ఇసుక. సగం సుర్ఖీని ఉపయోగించవచ్చు.

 

 

6. ఏరేటెడ్ సిమెంట్ మోర్టార్

తక్కువ ప్లాస్టిసిటీ కారణంగా సిమెంట్ మోర్టార్‌లతో పనిచేయడం గమ్మత్తైనది. అయినప్పటికీ మనం మిశ్రమానికి గాలి ప్రవేశించే  ఏజెంట్‌లను జోడిస్తే, దాని పని సామర్థ్యంలో గణనీయమైన మెరుగుదల ఉండవచ్చు. అందుకనే ఏరేటెడ్ సిమెంట్ మోర్టార్లు ఉనికిలోకి వచ్చాయి.

 

 

7. మట్టి మోర్టార్

సిమెంట్ లేదా సున్నం అందుబాటులో లేనప్పుడు, మనం వాటిని బురద మట్టిని బైండింగ్ ఏజెంట్‌గా రిప్లేస్ చేయవచ్చు. ఆవు పేడ లేదా వరి పొట్టుని బురదమట్టితో కలిపితే మంచి ఫైన్ అగ్రిగేట్ గా మట్టి మోర్టార్‌గా మారుతుంది.

 

 

8. భారీ తేలికపాటి మోర్టార్

బల్క్ డెన్సిటీ 15 KN/m³ లేదా అంతకంటే ఎక్కువ ఉండే మోర్టార్ భారీ మోర్టార్. ఈ రకమైన మోర్టార్‌లో భారీ క్వార్ట్జ్‌ లు ఫైన్ అగ్రిగేట్లుగా ఉంటాయి. మరోవైపు, తేలికపాటి మోర్టార్‌లో, భారీ సాంద్రత 15 KN/m³ కంటే తక్కువగా ఉంటుంది. ఈ మోర్టార్లు సున్నం లేదా సిమెంటును బైండర్లుగా ఉపయోగిస్తాయి. ఇసుక, రంపపు పొట్టు మొదలైన వాటిని ఫైన్ అగ్రిగేట్ గా ఉపయోగిస్తాయి.

 

 

9. థిన్-సెట్ మోర్టార్



మనం టైల్స్  కోసం ప్రత్యేకమైన అడ్హెసివ్ కోసం చూస్తున్నట్లయితే, మనం థిన్-సెట్ మోర్టార్ ని ఉపయోగించాలి. ఇది థిన్నర్. అయితే, ఈ మోర్టార్ ఇటుకలు లేదా భారీ రాళ్లతో ఉపయోగించడానికి పనికిరానిది. ఇది సిమెంట్, ఇసుక, నీటి నిలుపుదల ఏజెంట్లను కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో, టైల్ మాస్టిక్‌తో థిన్-సెట్ మోర్టార్‌లను ఉపయోగించడం సర్వసాధారణం. టైల్ మాస్టిక్ అనేది గోడలు లేదా అంతస్తులకు టైల్స్ ను అంటించే ఒక అడ్హెసివ్ మెటీరియల్.

 

 

10. ఎపోక్సీ మోర్టార్

మోర్టార్ల కంపోజిషన్లలో కొత్త కొత్త మార్పులు వస్తూ ఉండడం సర్వసాధారణం. అటువంటి విప్లవాత్మక ఉత్పత్తిలో ఎపాక్సీ మోర్టార్ ఒకటి. ఈ మోర్టార్‌లో ఎపోక్సీ రెసిన్‌లు, సాల్వెంట్లు మొదలైనవి ఉంటాయి. ఈ మోర్టార్ అడ్హెసివ్, వాటర్ ప్రూఫ్‌గా పని చేస్తుంది. ఇది స్టెయిన్-రెసిస్టెంట్. అలాగే సిమెంట్ మోర్టార్ కంటే వేగంగా క్యూరింగ్ అవుతుంది. అందువల్ల ఇది టైల్స్‌తో పనిచేసేటప్పుడు ఉపయోగించడానికి ఖచ్చితమైన ఎంపికగా ఉంటుంది.

 

 

11. అగ్ని-నిరోధక మోర్టార్

అల్యూమినస్ సిమెంట్ ఈ సబ్-డివిజన్ లో ముఖ్యమైన మెటీరియల్. కాల్చిన ఇటుకల పొడి మరియు సిమెంట్ ని కలపడం వలన ఫైర్ ప్రూఫ్ మోర్టార్ తయారవుతుంది.

 

 

12. మోర్టార్ ప్యాకింగ్

సిమెంట్-లోవమ్, సిమెంట్-ఇసుక, లేదా కొన్నిసార్లు సిమెంట్-ఇసుక-లోవమ్ ప్యాకింగ్ మోర్టార్‌గా ఉంటాయి. దాని బలం మరియు వాటర్-రెసిస్టెన్స్ కారణంగా, చమురు బావుల నిర్మాణంలో ఈ బైండర్ ని ఉపయోగిస్తారు.

 

 

13. ఇతర రూపాంతరాలు

జిప్సం, స్లాగ్ లేదా సిమెంట్‌తో పాటు సిండర్‌లు, ప్యూమిస్‌ను ఫైన్-అగ్రిగేట్‌లుగా ఉపయోగించే మోర్టార్ సౌండ్‌ఫ్రూఫింగ్ లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. అందువల్ల, మనం సౌండ్-అబ్జార్బంట్ మోర్టార్‌ని తయారుచేసుకోవాలి. రసాయన దాడులకు గురయ్యే నిర్మాణాల కోసం, మనం రసాయన-నిరోధక మోర్టార్‌ను ఉపయోగించవచ్చు. X-కిరణాలు చెడు ప్రభావాలను కలిగి ఉంటాయి. అందువల్ల X-రే గదుల గోడలు బాగా రక్షించబడేలా చూసుకోవడానికి హెవీ బల్క్ డెన్సిటీ మోర్టార్ (22 KN/m³) ని ఉపయోగించాలి.


మంచి మోర్టార్ లక్షణాలు



బైండర్ల వినియోగం అప్లికబిలిటీ, ప్రయోజనంపై ఆధారపడి ఉంటుంది, అయితే మంచి మోర్టార్ లక్షణాలు:

 

1. అడ్హెసివ్ 

మోర్టార్ల ప్రధాన లక్ష్యం ఇటుకలు, టైల్స్ మొదలైన బిల్డింగ్ బ్లాక్‌లను బంధన చేయడం. కాబట్టి, మోర్టార్ల అతి ముఖ్యమైన లక్షణం అంటిపెట్టుకుని ఉండేలా చేయడం.

 

2. వాటర్ ప్రూఫ్

మంచి మోర్టార్లు వాటర్-రెసిస్టెంట్ గా ఉంటాయి. అందువల్ల అవి వర్షాకాలపు వాతావరణ పరిస్థితులను తట్టుకునే నీటి నిరోధకతను కలిగి ఉంటాయి.

 

3. మన్నిక

ఒక ఆర్కిటెక్చరల్ నిర్మాణపు అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఒకటి ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉండగల సామర్థ్యం. అందువల్ల, మోర్టార్ ఎలాంటి ప్రతికూలతనైనా తట్టుకునేలా చాలా మంచి నాణ్యతతో ఉండాలి.

 

4. వినియోగం

మోర్టార్ ఉపయోగించడానికి పని చేయడానికి సులభంగా ఉండాలి.

 

5. క్రాక్ రెసిస్టెంట్

మోర్టార్, అధిక పీడనం లేదా ఉష్ణోగ్రత వైవిధ్యాలకు గురైనప్పుడు సులభంగా బీటలు రావడానికి దారి తీస్తుంది. పర్యవసానంగా, టైల్స్ లేదా భవనం ఉపరితలాలు పగుళ్లు ఏర్పడవచ్చు. అందువల్ల, మంచి-నాణ్యత గల మోర్టార్ ఎక్కువ కాలం పాటు దృఢమైన జాయింట్లు, గ్రిప్స్ ఉండేలా చూస్తుంది.

 

 

మోర్టార్ ఉపయోగాలు

 

1. బైండింగ్ ఏజెంట్

మోర్టార్ ప్రధానమైన పని ఇటుకలు లేదా రాళ్లను ఒకదానితో ఒకటి అతికబడి ఉండేలా చూడడం.

 

2. ప్రతిఘటన (రెసిస్టెన్స్)

మోర్టార్ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇతర ఏజెన్సీలకు (రసాయన దాడులు, పెద్ద ధ్వనులు మొదలైనవి) నిరోధకత బలాన్ని నిర్ధారిస్తుంది.

 

3. జాయింట్ ఫిల్-అప్‌లు

టైల్స్ లేదా ఇటుకల మధ్య జాయింట్లు, ఖాళీలను పూరించడంలో సన్నని మోర్టార్ (గ్రౌట్) సహాయపడుతుంది.



సారాంశమేమంటే, మోర్టార్ అనేది విస్తృత శ్రేణి రకాలతో కూడిన వైవిధ్యభరితమైన నిర్మాణ సామాగ్రి. మోర్టార్ లో వివిధ రకాలు వాటి వాటి నిర్దిష్ట అవసరాల కోసం రూపొందించబడ్డాయి. నిర్మాణంలో దాని ముఖ్యమైన పాత్ర, దాని వివిధ లక్షణాలతో కలిపి, మన్నికైన నిర్మాణాలను రూపొందించడంలో దాని ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. నిర్మాణ పరిశ్రమలో పాల్గొనే ఎవరికైనా మోర్టార్ రకాలు, వాటి అప్లికేషన్‌లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....