వాటర్ ప్రూఫింగ్ పద్ధతులు , ఆధునిక కిచెన్ డిజైన్లు, ఇంటి కొరకు వాస్తు చిట్కాలు , ఇంటి నిర్మాణ ఖర్చు

అందుబాటులో ఉండు

మీ ప్రశ్నలకు సమాధానాన్ని పొందండి

చెల్లుబాటు అయ్యే వర్గాన్ని ఎంచుకోండి

మీ ఉప-కేటగిరీని ఎంచుకోండి

acceptence

దయచేసి తదుపరి కొనసాగించడానికి ఈ పెట్టెను ఎంచుకోండి



టైల్స్ 101: వివిధ రకాల టైల్స్ గురించి ప్రాథమికంగా తెలుసుకోవలసిన విషయాలు

మీ స్వప్న సౌధాన్ని నిర్మించడానికి పూనుకున్నపుడు టైల్స్ ముఖ్యమైన అంశంగా మారతాయి. ఇక్కడ ఉన్న వివిధ రకాల టైల్స్ గురించి మీ గైడ్ ఉంది, కాబట్టి మీరు సమాచారంతో నిర్ణయం తీసుకోవచ్చు.

Share:


టైల్స్ వాటి మన్నిక, వైవిధ్యత, అందం, ఆకర్షణ కారణంగా ఫ్లోరింగ్, గోడలు పైకప్పులకు కూడా ప్రసిద్ధ ఎంపికగా ఉంటాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల టైల్స్‌ లో మీ నిర్దిష్ట అవసరాలకు తగిన టైల్స్‌ ని ఎంచుకోవడం చాలా కష్టం. ఈ బ్లాగ్‌లో మనం అందుబాటులో ఉన్న వివిధ రకాల టైల్స్, వాటి పేర్లు, లక్షణాలు వాటిని ఉపయోగించడానికి మీ ఇంట్లోని వివిధ ప్రాంతాలు ఏమిటో చూద్దాం.

 

మనం ప్రత్యేకతలలోకి ప్రవేశించే ముందు, ప్రధాన రకాలకు చెందిన టైల్స్ ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం: సిరామిక్ టైల్స్, పింగాణీ టైల్స్, గాజు టైల్స్, నేచురల్ స్టోన్ టైల్స్. వీటిలో ప్రతి ఒక్కటీ దాని కంపోజిషన్, చూడడానికి ఎంత అందంగా కనిపిస్తోందీ, ఎలా పని చేస్తుందీ అనే విషయాల్లో చాలా వైవిధ్యంగానూ, ప్రత్యేకంగానూ ఉంటాయి.



మార్కెట్‌లో లభించే రకరకాల టైల్స్ ఏమిటి

ఇంటీరియర్ డిజైన్‌లో టైల్స్ ప్రాక్టికల్ గానూ, సౌందర్యపరంగానూ కూడా చాలా కీలకమైనవి. అవి వివిధ మెటీరియల్స్ లో వస్తాయి, ప్రతి దానికీ దానివైన ప్రత్యేక లక్షణాలతో ఉంటాయి. ఉదాహరణకు, సిరామిక్ టైల్స్ నే తీసుకుంటే వాటి మన్నిక, అనుకూలత (అడాప్టబిలిటీ) కి పేరెన్నిక గన్నవి. ఇవి విస్తృత శ్రేణిలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. మరో రకమైన పింగాణీ టైల్స్, సాంద్రత, స్థితిస్థాపక లక్షణాలు గల రకాలు. ఇవి ఎక్కువగా నడిచే ప్రాంతాలకు అనువైనవి. గ్లాస్ టైల్స్ వైబ్రన్సీ తో పని చేస్తాయి. తరచుగా వాటిని అలంకారం కోసం ఉపయోగించడం జరుగుతుంది. అయితే పాలరాయి  గ్రానైట్ వంటి సహజ రాతి టైల్స్ కలకాలం ఆకర్షణీయంగా ఉంటాయి, దీర్ఘకాలం మన్నుతాయి. అయితే సాధారణ సంరక్షణ అవసరం. వుడెన్ టైల్స్, హార్డ్ వుడ్ టైల్స్, ఫ్యాక్స్ వుడ్ వేరియంట్స్ లో లభిస్తాయి. వుడెన్ టైల్ బాగా మన్నుతుంది, చూడడానికి అందంగా ఉంటుంది. మీ స్పేస్‌ల కోసం డిజైన్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రకమైన టైల్స్ నీ, వాటి లక్షణాల్నీ అర్థం చేసుకోవడం చాలా కీలకం. ప్రతి టైప్ రకాన్నీ అర్థం చేసుకోవడానికి లోతుగా పరిశీలిద్దాం.

 

 

1. సిరామిక్ టైల్స్



సిరామిక్ టైల్స్ వాటి మన్నిక, వైవిధ్యంగా ఉండడం వల్ల నివాసాలకీ,   గృహాలకీ, వాణిజ్య స్థలాలకీ ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది. అవి పింగాణీ, మొజాయిక్‌తో సహా వివిధ రకాల టైల్స్‌ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.

 

ఎ) పింగాణీ టైల్స్

పింగాణీ టైల్స్ వాటి సాంద్రతకీ తేమ, మరకలు గీతలూ పడనీయకుండా చేసే నిరోధకతకీ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి ఎక్కువగా నడిచేచోట్లా, ఔట్ డోర్ ప్రదేశాలకూ సరైనవి. ఈ టైల్స్ విస్తృత శ్రేణి రంగులూ, ఫినిష్ లతో ఉంటాయి, సీలింగ్ లేదా ప్రత్యేకంగా శుభ్రపరిచే ఉత్పత్తుల అవసరం లేకుండా   సులభమైన నిర్వహణను అందిస్తాయి.

 

బి) మొజాయిక్ టైల్స్

మొజాయిక్ టైల్స్, సాధారణంగా 2 అంగుళాల కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి, ఇవి వైవిధ్యభరితమైన డెకరేటివ్ టైల్స్ ఇవి సాధారణంగా మెష్ బ్యాకింగ్‌పై అమర్చబడిన సిరామిక్, గాజు లేదా నేచురల్ స్టోన్ తో ఉంటాయి. ఇవి అద్భుతమైన డిజైన్‌లు, పాటర్న్స్ లో అందంగా ఉంటాయి. వీటిని సాధారణంగా బాత్‌రూమ్‌లు, కిచెన్‌లు, పూల్స్ లో క్రియేటివ్ విజువల్ ఆకర్షణీయంగా కనిపించడానికి వేస్తారు. 

 

 

2) చెక్క టైల్స్ 



చెక్క టైల్స్ మన్నిక బాగుంటుంది, ఈ టైల్స్ కి నిర్వహణ సులభం, దాంతో బాటు కలపకి సంబంధించిన సహజ సౌందర్యం కూడా ప్రత్యేకమైన కాంబినేషన్ గా ఉంటుంది. దీనిలో రెండు రకాల టైల్స్ ఉన్నాయి:

 

ఎ) హార్డ్ వుడ్ టైల్స్ 

ఓక్, మాపుల్, వాల్‌నట్ వంటి నిజమైన క్లాసిక్ వుడ్ తో రూపొందించబడిన హార్డ్ వుడ్ టైల్స్, క్లాసిక్ హార్డ్‌ వుడ్ ఫ్లోర్ రూపాన్ని ప్రతిబింబిస్తాయి. అవి వైవిధ్యభరితమైన రంగు, గ్రెయిన్ ఆప్షన్స్ లో ఉంటాయి. శాండ్ చేయవచ్చు మరియు రీఫినిష్ చేయవచ్చు. ఇవి చాలా గదులకు, ముఖ్యంగా లివింగ్ రూమ్స్ కి, బెడ్‌రూమ్‌లు, హాల్స్ కి అనుకూలంగా ఉంటాయి. 

 

బి) ఫాక్స్ వుడ్ టైల్స్

వీటిని వుడ్-లుక్ టైల్స్ అని కూడా పిలుస్తారు. ఫాక్స్ వుడ్ టైల్స్ సిరామిక్ లేదా పింగాణీ నుండి తయారుచేయబడతాయి. మరింత తక్కువ బడ్జెట్ లో నిజమైన కలప లాగే ఉంటుంది. రంగులు, ఫినిష్ ల శ్రేణితో అవి మనసుకి హత్తుకునే స్టయిల్ లో ఉంటాయి. ఈ టైల్స్ తేమ, గీతలు మరకలు పడకుండా  నిరోధిస్తాయి. బాత్‌రూమ్‌లు, కిచెన్‌ల వంటి తేమతో కూడిన ప్రదేశాలకు ఇవి చాలా అనువైనవి. వీటికి మెయింటెనెన్స్ అంతగా అవసరం లేదు. ఈ టైల్ చూడడానికి ఆకర్షణగా ఉండడమే కాకుండా మంచి ప్రయోజనాల్ని కూడా అందిస్తుంది.

 

 

3) గ్లాస్ టైల్స్



గ్లాస్ టైల్స్ నిగనిగలాడే ఫినిష్ తో కాంతిని ప్రతిబింబించడం ద్వారా ఆ ప్రదేశాన్ని కాంతివంతం చేస్తాయి. ఇవి వైవిధ్యభరితమైన డిజైన్ ఆప్షన్లని అందిస్తాయి. వాటి మన్నిక, మరక నిరోధకత, శుభ్రపరిచే సౌలభ్యం కారణంగా ఇవి కిచెన్‌లు, బాత్‌రూమ్‌లు, బ్యాక్‌స్ప్లాష్‌లలో ప్రసిద్ధి చెందాయి. కానీ అవి ఎక్కువ ఖర్చులో అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు సరైన అడ్హెషన్  కోసం ప్రొఫెషనల్ ఇన్‌స్టలేషన్ అవసరం.

 

 

4) సిమెంట్ టైల్స్



సిమెంట్ టైల్స్ ని ఎన్‌కాస్టిక్ టైల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి రంగుల సిమెంట్‌తో హ్యాండ్ క్రాఫ్ట్ తో తయారు చేయబడ్డాయి. ఇవి ప్రత్యేకమైన డెకరేటివ్ పాటర్న్ లలో మంచి రంగుల్లో వస్తాయి. ఇవి మన్నికైనవి, ఎక్కువగా నడిచే ప్రాంతాలకు సరైనవి, సహజంగా జారిపోకుండా ఉంటాయి, కానీ వాటికి సీలింగ్, అలాగే వాటి ఆకర్షణని సంరక్షించడానికి సాధారణ నిర్వహణ అవసరం. ఎక్కువ ఖర్చు అయినా, అవి ఎంతో కాలంపాటు గదిని ఎంతో ఆకర్షణీయంగానూ, ఎంతో ప్రత్యేకంగానూ ఉంచుతాయి. 

 

 

5) విట్రిఫైడ్ టైల్స్



విట్రిఫైడ్ టైల్స్ వివిధ ప్రదేశాలకు అనువైన మన్నికైన వైవిధ్యభరితమైన ఫ్లోరింగ్ ఎంపిక. వాటి బలం, తక్కువ రంధ్రాలు ఉండడం, సులభమైన నిర్వహణ కారణంగా అవి నివాసాలకీ, వాణిజ్య ప్రాజెక్టులకీ ఒక ప్రముఖ ఎంపికగా చేస్తాయి. వాటిలో వివిధ రకాలు ఇలా ఉన్నాయి:

 

ఎ) పాలిష్ గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్

పాలిష్డ్ గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, లేదా PGVT, విట్రిఫైడ్ టైల్స్‌ పై గ్లేజ్ లేయర్‌ను అప్లై చేయడం పాలిష్ చేయడం ద్వారా నిగనిగలాడే ఫినిష్ తో కూడిన సిరామిక్ టైల్స్. అవి ఆధునిక ఇంటీరియర్‌ల కోసం సొగసైన మన్నికైన ఎంపికను అందిస్తాయి, వివిధ డిజైన్‌లు రంగులలో లభిస్తాయి. నివాసాలకీ,  వాణిజ్య స్థలాలకు అనువైనవి.

 

బి) గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్

GVT టైల్స్ అని పిలువబడే గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, విభిన్న డిజైన్‌లు నమూనాలతో కూడిన గ్లేజ్ లేయర్‌ను కలిగి ఉంటాయి. అవి PGVT కంటే తక్కువ నిగనిగలాడే ఫినిష్ ని కలిగి ఉన్నప్పటికీ, అవి మంచి ఆకర్షణగా ఉంటాయి. ఈ మన్నికైన నీటి-నిరోధక టైల్స్ సాధారణంగా వంటశాలలు, స్నానపు గదులు నివాస స్థలాల వంటి ఇంటి లోపలి ప్రాంతాలలో ఉపయోగించబడతాయి. సిరామిక్స్ ప్రాక్టికల్ గా నేచురల్ మెటీరియల్ లుక్ ని ఇస్తాయి.

 

నేచురల్ స్టోన్ టైల్స్, క్వారీ టైల్స్, టెర్రకోట టైల్స్, మెటల్ టైల్స్ వంటి అనేక ఇతర రకాల టైల్స్ ఉన్నాయి, వాటి నుండి మీరు మీ ఇంటికి అవసరమైన టైల్స్ ని ఎంచుకోవచ్చు.



ఈ బ్లాగ్ పోస్ట్ లో మనం ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో సాధారణంగా ఉపయోగించే వివిధ రకాల టైల్స్‌ ని గురించి తెలుసుకున్నాము. అంతే కాకుండా పాలరాయి, గ్రానైట్, టెర్రకోట ట్రావెర్టైన్ వంటి ఇతర టైల్ రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటీ దానిదైన ప్రత్యేకమైన సౌందర్యాన్ని అందిస్తాయి. ప్రతి రకం వివిధ పరిస్థితులలో ఇంటి డిజైన్లలో విలువను కలిగి ఉంటుంది. ఈ ఎంపికలను అర్థం చేసుకోవడం మీ ప్రాధాన్యతలకు సరిపోయే అందమైన ఫంక్షనల్ స్పేస్‌లను రూపొందించడంలో సహాయపడుతుంది.



సంబంధిత కథనాలు




సిఫార్సు చేయబడిన వీడియోలు




గృహ నిర్మాణానికి ఉపకరణాలు


ఖర్చు కాలిక్యులేటర్

ప్రతి ఇంటిని నిర్మించేవారు తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు, కాని అధిక బడ్జెట్‌కు వెళ్లకుండా అలా చేస్తారు. 

logo

emi కాలిక్యులేటర్

గృహ-రుణం తీసుకోవడం అనేది గృహనిర్మాణానికి ఆర్థిక మార్గంగా చెప్పవచ్చు, కాని గృహనిర్మాణదారులు వారు ఎంత EMI చెల్లించాలో తరచుగా అడుగుతారు.

logo

ప్రొడక్ట్ ప్రిడిక్టర్

ఇంటిని నిర్మించే ప్రారంభ దశల్లో గృహ నిర్మాణదారు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

logo

స్టోర్ కాలిక్యులేటర్

ఇంటి బిల్డర్ కోసం, ఇంటి భవనం గురించి విలువైన సమాచారాన్ని పొందగలిగే సరైన దుకాణాన్ని కనుగొనడం చాలా ముఖ్యం.

logo

Loading....